కన్యారాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!
ఉత్తర ఫల్గుణి 2,3,4 పాదాలు, హస్త 1,2,3,4 పాదాలు మరియు చిత్త 1,2 పాదాలలో జన్మించినవారు కన్యారాశికి చెందుతారు.
కన్యారాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యారాశి ఆరవది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని, జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించినవారు ఎక్కువగా పొడవుగాగాక,ఎక్కువగా పొట్టిగాగాక మధ్యస్థమైనవంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పయినటువంటి భుజాలు ఉంటాయి.వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు.
కన్యారాశివారు మృదుమధురంగా మాట్లాడుతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు.
కన్యారాశివారు దేనిని అంత సులభముగా వదలరు. ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారి ముఖ్యలక్షణం ప్రతి దానిని అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. కన్యారాశివారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ, ఎదుటివారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు.
కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతుంటారు. కన్యారాశివారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారంమీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
కన్యారాశివారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాలమీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు. పనిచేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్నివిధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు.
ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించి, పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నము కన్యారాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రములలో కీర్తించబడింది.
కన్యారాశిలో జన్మించినవారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమేకాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏపనికి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బంధు ప్రీతి అధికముగా ఉంటుంది. గణితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది. మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు.
కన్యారాశివారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా దానిని ఋజువు చేసే ప్రయత్నము చేయలేరు. రచయితగా, లేఖికునిగా రాణిస్తారు. పత్రికారంగములో రాణించగలరు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు. ప్రభుత్వరంగములో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి.
కన్యారాశివారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగంచగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మక పోయినా ఇతరులను నమ్మి మోసపోతారు.
కన్యారాశివారికీ ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగములో పురోగతి సాధించిన తరువాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి.
కన్యారాశివారికి వివాహజీవితములో ఒడిదుడుకులు ఉండక పోయినా, స్వయంకృత అపరాధమువలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసునుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి ఔతారు. ముద్రణ,టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ,కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరచుకుంటారు.
కన్యారాశివారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావము ఉంటుంది. కన్యారాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు.
పరిస్థితులు అనుకూలిస్తే, వీరు జీవితంలో బాగా రాణించి పదిమందికి సహాయపడగలరు. అయితే ఇతరులు కలిసిరానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగమునుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము వీరికి ఉంటుంది.
కన్యారాశివారు పెద్దపెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించువారు వీరికి తారసపడినప్పుడు, వీరికి ధైర్యం, బలము వస్తుంది. అయితే కన్యరాశివారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసము ఉండదు.
కన్యారాశివారికి ఎప్పుడు ఇతరుల గూర్చిన ఆలోచనలు మనసును బాధపెట్టు చుండును. తమను గురించి ఇతరులు ఏమనుకుంటారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉండును.
కన్యారాశివారు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రులనుగూర్చి చెడ్డగా తలచుట, వారిపైన వారే జాలిపడుటవంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయముగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతుంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన ఎత్తుకొని చిరకాలము బాధ పడతారు.
కన్యరాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చేటకు ప్రయత్నించి చిక్కులు పడుదురు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేయుదురు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు.
కన్యారాశివారికి వచ్చిన అవకాశం ఏదైనను దానిని వదలక సద్వినియోగం చేసుకొను గుణము కలదు. బుద్ధిసూక్ష్మత ఉపయోగించు అన్ని రంగములలో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యావిధానము టైపు,షార్ట్ హ్యాండ్,కావ్యరచన,దళారీ వ్యాపారము ఆరోగ్యపరిశోధనశాఖలలో, బ్యాంకులు,కోశాగారములు, సహకారశాఖలో వీరు సాధారణముగా రాణిస్తారు.
కన్యారాశివారికి చిన్నతనంలో వివాహమైనవారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్యాబిడ్డలను వదిలి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనములోనే ప్రేమ వివాహము చేసుకొనే అవకాశము కలదు. కన్యారాశివారికీ తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయము చేయుటతోనే సరిపోవును.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలను తయారు చేయుటతోపాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగల గడసరితనము ఉంటుంది.
కన్యారాశివారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు,జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు. కావున జీర్ణశక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మవ్యాధులు కూడా బాధించును. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది. దానితోపాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమమీద శ్రద్ధ చూపలేదని బాధ అధికముగా ఉండును. మొత్తంమీద కన్యరాశివారు ఆరోగ్యంమీద శ్రద్ధ వహించాలి.
కన్యారాశివారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయములో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశము ఉంది. గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చి దిద్దుకుంటారు. ఉత్తర,దక్షిణ దిక్కులు కలసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది. విష్ణు ఆరాధనా, గణపతి ఆరాధనావలన సమస్యలను అధిగమించవచ్చు.
శరీరం & ఆరోగ్యం: కన్యారాశివారు చామనచాయగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యల పరిష్కిరిస్తూ ముందుకు సాగిపోతారు.
ఆర్థిక స్థితి: వ్యాపారంలో రాణించటంవల్ల ఆర్ధిక స్థితి బాగానే ఉంటుంది. సంవత్సర మధ్యలో ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు.
ఆదాయం మరియు అదృష్టం : ఈ రాశివారు రక్షణ మరియు పోలీసుశాఖల్లో ఉన్నతపదవుల్లో కొనసాగుతారు. శాఖాపరమైన విషయాల్లో కొన్నిసందర్భాలలో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు.
ప్రేమ సంబంధం: ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్లాడటంవల్ల జీవితం ఆనందంగా సాగిపోతుంటుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దటంలో సఫలం అవుతారు.
వ్యాపారం: ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తుంటారు. మార్కెట్‌లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి ఉత్పత్తుల కొనుగోలుపట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.
గుణగణాలు: ఈ రాశివారు దుడుకుస్వభావం కలవారై ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్ధం చేసుకుంటారు.
దాంపత్య జీవితం: ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగి పోతుంది. అప్పుడప్పుడూ చిన్నపాటి మనస్ఫర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు.
విద్య: ఇంజనీరింగ్,మెడికల్,మేనేజ్మెంట్ కోర్సులలో రాణిస్తారు.
గృహం మరియు కుటుంబం: ఈ రాశివారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి. ఫలితంగా ఈ రాశివారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు. వీరి సంతానాన్ని ఉన్నతస్థాయికి తీసుకవెళతారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు.
సహజమైన బలహీనతలు: కన్యారాశికి చెందినవారిలో అతిగా విశ్లేషించేతత్వం, తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుకా ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన వత్తిడి, అశాంతికి గురై ఉంటారు.
వ్యక్తిత్వం: కన్యారాశివారి వ్యక్తిత్వం అసమాన్యం. దూరదృష్టి కలవారుగా వుంటారు. నిబద్ధత,నమ్రతతో కూడిన వారుగా వుంటారు. ఎంతటి కార్యన్నయినా సాధించుకునే సామర్థ్యం ఉంటుంది.
ఆరోగ్యం: ఈ రాశికి చెందినవారి ఆరోగ్యం స్తిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతి కూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా ఉదర,చర్మ సంబంధిత తదితర అనారోగ్యసమస్యలు ఇబ్బంది పెడతాయి.