Loading...
loading

కర్కాటకరాశివారి లక్షణాలు, గుణగణాలు

  • Home
  • Blog
  • కర్కాటకరాశివారి లక్షణాలు, గుణగణాలు

కర్కాటకరాశివారి లక్షణాలు, గుణగణాలు

కర్కాటకరాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!

పునర్వసు 4 వ పాదం, పుష్యమి 1,2,3,4 పాదాలు, మరియు ఆశ్లేష 1,2 ,3,4 పాదాలలో జన్మించినవారు కర్కాటకరాశికి చెందుతారు.

ఎండ్రకాయ లేక పీత అనబడు జలచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో చెప్పబడినది. కర్కాటకరాశివారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనః కారకుడు. కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది.

కర్కాటకరాశివారు గొడవలు, కొట్లాటలు  అంటే అస్సలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇవి కర్కాటకరాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు.

కర్కాటకరాశి చరరాశి. అనగా ఈ రాశివారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచకా మారిపోతుంటాయి. వీళ్లు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణవలన సమస్యను జటిలం చేసుకుంటారు. 

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీళ్ళకి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది.

ఈ రాశిలో జన్మించినవారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది. కొంత కాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంత కాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంటుంది.

కర్కాటక రాశి వారు మనోధైర్యము కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా, అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగుసార్లు కష్టపడ వలసి వస్తుంది. సన్నిహిత వర్గములో నిజాయితీపరులు ఉన్నంతవరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయరంగములో చక్కగా రాణిస్తారు.

కర్కాటకరాశివారు మహాలక్ష్మీ పూజవలన ఆటంకాలను అధిగమించగలరు. లలిత కళలలో ప్రవేశము ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు. సంతానము పురోగతి సాధిస్తారు. ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానముగా వాటిని అధిగమిస్తారు. రాణించలేమని భావించిన రంగాలలో కూడా రాణిస్తారు. హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కార్యనిర్వహనకు చక్కని పధకాలు,  ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు.

కర్కాటకరాశివారికీ నిష్కారణ శతృవర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఊపిరితిత్తులమీద ప్రత్యేక శ్రద్ధ అవసరము. టెండర్లు,ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిలువ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమపడవలసి వస్తుంది.

కర్కాటకరాశివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టువిడుపు లౌక్యము ప్రదర్శించుటవలన ప్రయోజనము ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడమువలన పోటీ ఏర్పడుతుంది. చిన్నచిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటలవలన అధికముగా నష్టపోతారు.

కర్కాటకరాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న, అనుకున్న వివాహము జరిగినా, వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబంధబాంధవ్యాలు లేనివారు ప్రోత్సహించి, ఆశ్రయము ఇవ్వడం జీవితములో మలుపుకు దారి తీస్తుంది. విదేశీ విద్య,ఉద్యోగము,విదేశీ యానము కలసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి.

కర్కాటకరాశివారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము. స్వార్జితము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధములేని విషయాలలో ఎదురైయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి.

కర్కాటకరాశివారికి చురుకుతనం ఎక్కువ, అయితే దీనియందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయము వీళ్ళకి ఉండదు.‌ ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు.

కర్కాటకరాశివారికి జ్ఞాపకశక్తి అధికముగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధానలోపం, ఏ పనినీ సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు.

కర్కాటకరాశివారు నచ్చినవారికోసం వాళ్ల సంపదను, ధనాన్ని,వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినను, అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్కపెట్టక సహాయం చేసే మంచి మనస్సు వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేసే స్వభావము కూడా వీరికి ఉంటుంది.

కర్కాటకరాశివారికి ప్రయాణం చేయు వృత్తులయందు స్థిరపడే  అవకాశం ఉంటుంది.  అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలుపైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు,  మార్కెటింగ్ చేయువారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయముల వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి.

కర్కాటకరాశివారికి ఉద్యోగముకన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. కర్కాటకరాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వేరేస్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ వుంటారు.

కర్కాటకరాశివారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు. వీరు ఇల్లు బాగా తీర్చిదిద్ది గల నేర్పరులు.  అదేవిధంగా ఆదాయవ్యయాలయందు బాగా జాగ్రత్తపడే అలవాటు ఉంటుంది. కర్కాటకరాశివారికి గృహసౌఖ్యము, వాహన సౌఖ్యము లభిస్తుంది.

కర్కాటకరాశివారు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడంవల్ల అష్టైశ్వర్యాలు, సకలసంపదలు కలుగుతాయి. కర్కాటకరాశివారికి చిన్నతనమున జలుబు, దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు.  వివాహానంతరం స్థూల శరీరము రావచ్చును. అలసట, ఆయాసము దాహము, శ్వాసకోస వ్యాధులు కలిగే అవకాశం ఉంది.

కర్కాటకరాశివారికి వార్ధక్యమున మధుమేహము,రక్తపోటు, ఉదరము,జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు,లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది. కావున ఈ రాశివారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి.

దాంపత్య జీవితం: కర్కాటకరాశికి చెందినవారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయితే కొన్నిసార్లు చిన్నచిన్న సమస్యలు తలెత్తినా వాటంతట అవే సర్దుకుంటాయి. భార్యా భర్తలు ఒకురికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతారు. భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాలనుంచి గట్టెక్కటానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది.

శరీరం & ఆరోగ్యం: కర్కాటకరాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు. అందంగానూ, ఆకర్షిణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. కర్కాటకరాశికి చెందినవారు ఆరోగ్యంపట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి. వీరిని ఉదర సంబంధితవ్యాధులు పీడించే అవకాశం ఉంది. కనుక ఆహారంపట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడసూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం. ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటివాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండటం మేలు.

ఆర్థిక స్థితి: ఈ రాశివారికి భార్య లేదా భర్త తరుఫున ఆస్తులు కలిసివస్తాయి. అయితే వాటిని ఉపయోగించుకోవటానికి ఇద్దరూ విముఖత చూపిస్తారు.

ఆదాయం మరియు అదృష్టం: కర్కాటకరాశికి చెందినవారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ధనార్జనకోసం దూరతీరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయినా వీరి దృఢసంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగానూ పనిచేస్తారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు.

ప్రేమ సంబంధం: కర్కాటరాశికి చెందినవారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు. ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు.

వ్యాపారం: కర్కాటకరాశివారు వ్యవసాయం, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు. ఈ రాశివారు ఉష్ణప్రాంతాలలో పర్యటనలు,వాస్తు,జల క్రీడలు,చిత్రలేఖనంవంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు.

గుణగణాలు: ఈ రాశివారు ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు. వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు. వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగతుంది. ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేధిస్తూ ఉంటారు. సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది.

విద్య: కర్కాటకరాశివారు విద్యలో బాగా రాణిస్తారు. వీరికి విద్యాజ్ఞానం ఎక్కువ. ఏ విషయాన్నానైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు. వీరి రాశికి గ్రహాలుసైతం అనుకూలంగా ఉండటంవల్ల వీరికి తిరుగులేదు. వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గృహం మరియు కుటుంబం: ఈ రాశివారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాలవల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు. అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు.

సహజమైన బలహీనతలు: కర్కాటరాశికి చెందినవారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందటం, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం. ఈ రెండు గుణాలవల్ల ముందు వెనక ఆలోచచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. క్షమాగుణంలేనివారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనస్సుగలవారుగా ఉంటారు.

వ్యక్తిత్వం: చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటంవల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతుంటుంది. ఈ చంచల స్వభావంవల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాలవల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు. ఇక అప్పట్నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X