Loading...
loading

తులారాశివారి లక్షణాలు, గుణగణాలు

  • Home
  • Blog
  • తులారాశివారి లక్షణాలు, గుణగణాలు

తులారాశివారి లక్షణాలు, గుణగణాలు

తులారాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!

చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు మరియు విశాఖ 1,2,3 పాదాములలో జన్మించినవారు తులారాశికి చెందుతారు. 

తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రములో తులారాశి ఏడవది.  తులారాశివారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. 

తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతుంటారు.

తులారాశికి చెందినవారు ఎత్తుకు పైఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశివారు అధిరోహిస్తారు.  తులారాశిలో జన్మించినవారు,తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక  అత్యంత ఉపాయముతో లక్ష్యసాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు.

తులారాశిలో జన్మించినవారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశివారు ఇతురుల కుయుక్తులకు లొంగరు.  తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. 

తులారాశివారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి,ఉద్యోగ,వ్యాపార,వ్యాపకాలలో బాగా రాణిస్తారు.  తులారాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రుల ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు.

తులారాశిలో జన్మించినవారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దానధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా సునిశితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళితే, వారికి న్యాయం చేస్తారు.

తులారాశివారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్ధశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది. జీవితములో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరివర్గము సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకము ఔతారు. వైరి వర్గము ఒక్కటి కానంతవరకు వీరికి ఇబ్బంది లేదు.

తులారాశివారు స్వంతవర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చెయ్యక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడములో విఫలము ఔతారు. ఉన్నత స్థానములో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలౌతాయి. ముఖ్యముగా బాల్యములో ఉన్నత స్థానాలలో ఉన్నవారివలన కుటుంబానికి అన్యాయము జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితములో ప్రాధాన్యత సంతరించికోకుండా జాగ్రత్త వహించాలి.

తులారాశివారికీ సాహసోపేతమైన నిర్ణయాలు కలసి వస్తాయి. ఆత్మీయులు,సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు. పడమర,దక్షిణ దిక్కులు లాభిస్తాయి.

తులారాశివారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనాసరే వీరు పరోపకారం చేస్తారు.  ఇలా ఎవరికిపడితే వారికి పరోపకారం చేయడంవల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధివలన అవమానాలుకూడా ఎదుర్కొనవలసి వస్తుంది.

తులారాశివారికి యవ్వనప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు.  బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశివారికి కొనసాగుతాయి. కూతురుకి మాత్రము అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది. ఏ విషయంలోనైనా రాజీలేకుండా శ్రమించే గుణం ఈ తులారాశివారిలో ఉంటుంది.

వీరియొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినా పాతపద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలుకూడా అప్పుడప్పుడూ తలెత్తుతుంటుంది. 

తులారాశివారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతికవిద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు. తులారాశివారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది.  తులారాశివారికి సంగీతసాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది.అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది.  అయితే ఎంత త్వరగా కోప్పడతారో, అంత త్వరగా చల్లబడతారు.

తులారాశివారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడినమాట గంట తర్వాత మార్చేస్తారు, అంటే మాటమీద నిలబడు తత్వం వీరికి ఉండదు.

తులారాశివారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు.  అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే, భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశివారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి, డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది.

తులారాశివారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మిపూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం.

తులారాశివారు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడంవల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునేవారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశివారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి, అన్నివిధాలా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

తులారాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటంవలన శుక్రవారం అన్ని విధాలా కలిసివస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించిన శుభ ఫలితాలను ఇస్తుంది.  తులారాశివారికి నీలంరంగు బాగా కలిసి వస్తుంది.  అందువలన నీలపురంగు కలిగిన చేతిరుమాలును జోబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది.

తులారాశివారు శుక్రమౌఢ్యమి కాలములో జాగ్రత్త వహించడము మంచిది. ప్రజా బలము, సన్నిహిత వర్గము అండదండలు, సంఘంలో మంచిపేరు ఉంటాయి.  దీపావళినాడు చేసే లక్ష్మీపూజ  మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానము, స్వీయవిద్య అక్కరకు వస్తాయి. తులారాశివారికి బాల్యములో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయంకృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు.

చిత్తా నక్షత్రంలో పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్రవిచిత్ర వస్తుసేకరణయందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్తానక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రశ్నిస్తారు.అలాగే ఈ చిత్తానక్షత్రంలో పుట్టినవారు మధ్య వయస్సువరకు సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి.

శరీరం & ఆరోగ్యం: అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.

ఆర్థిక స్థితి: వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్ధిక సహాయాన్ని సైతం చేస్తారు.

ఆదాయం మరియు అదృష్టం: ఈ రాశివారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలలో రాణిస్తారు. వీటితోపాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నతస్థాయికి వెళ్లగలరు.

ప్రేమ సంబంధం: తులారాశివారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయ బద్దమైన వీరి ఆలోచనలపట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు.

వ్యాపారం: వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి యత్నాలు చేస్తూ ఉంటారు. కాని పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటంవల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టటానికి వీరు కృషి చేస్తారు.

గుణగణాలు: వీరి జీవితగమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు, ఈ చురుకు స్వభావంవల్ల ఇతరులు దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు.

దాంపత్య జీవితం: తులారాశికి చెందినవారిలో ఎక్కువమంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు.

విద్య: తులా రాశికి చెందినవారు విద్యావిషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్నకలలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

గృహం మరియు కుటుంబం: కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల వారినుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఇల్లాలు అంటే వీరికి ఇష్టం. ఆమె చెప్పినమాటను జవదాటరు. కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు.

సహజమైన బలహీనతలు: తులారాశివారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపటం. అతిరాజీ స్వభావంతోపాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి.

వ్యక్తిత్వం:  అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.

ఆరోగ్యం: ఆరోగ్య విషయాల్లో వీరు శ్రద్ద చూపించరు. ఫలితంగా చిన్నచిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X