ధనుస్సురాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!
మూల 1,2,3,4 పాదాలు, పూర్వాషాడ 1,2,3,4 పాదాలు మరియు ఉత్తారాషాడ 1వ పాదంలో జన్మించినవారు ధనుస్సు రాశికి చెందుతారు.
రాశి చక్రములో ధనుస్సురాశి తొమ్మిదవది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుస్సురాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో, కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ, మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు.
ధనుస్సురాశివారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచినవిధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే, ఆ సలహాలు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా, ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు.
ధనుస్సురాశివారికి అత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వ విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యలపట్ల ఆశక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరుప్రతిష్ఠలు కలిగి ఉంటారు.
ధనుస్సురాశివారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దలపట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణకి తీసుకుంటారు. అవకాశము ఉండీ సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది.
ధనుస్సురాశివారికీ ఉన్నతస్థితిలో ఉండికూడా అయినవాళ్ళకు ఏమి చేయలేక పోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చెయ్యలేరు. ఆత్మీయుల ప్రతిభా పాటవాలను సాధించాలని కోరిక ఉన్నా, వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు. వారిని ఏ విధముగా అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు.
ధనుస్సురాశివారికి స్వంత వర్గము వారితోనే బద్ధ వైరము ఏర్పడుతుంది. ధనసంపాదనకంటే మించినవి చాలా ఉన్నాయన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగములో అయినా ఎవరికైనా ఆదర్శముగా ఉండాలని వీరు భావిస్తారు.
ధనుస్సురాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తరువాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయముగా మారుతుంది. దానధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్ఠలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
ధనుస్సురాశివారు ధనము కొరకు ప్రాధేయ పడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ, మగ అన్న తేడా లేక అందరిని సమంగా చుస్తారు. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలి వెస్తారు.
ధనుస్సురాశివారు ఏ విషయములో అతిగా కలుగ చేసుకోరు. వీరి మాటను దిక్కరించిన, వారిని జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యులవలన కుటుంబ పరువు, ప్రతిష్ఠలు దెబ్బ తింటాయి. స్వంతవాళ్ళు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి.
ధనుస్సురాశివారి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంత కాలము దూరమవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహొదర, సహోదరీ వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారి తీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనూరాశివారు మారక, వారి సింద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజములో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు.
ధనస్సురాశి స్వభావరీత్యా ద్విస్వభావ రాశి. ఏదైనా విషయంపై ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిధానంగానూ స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగముతోను మరోసారి నిధానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
ధనస్సురాశివారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసిన ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు.
ధనస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందముగా ఉంటారు. స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారియొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనస్సులో ఏది ఉంచుకోరు. అంతా బయటికి చెప్పేస్తారు.
ధనస్సురాశి వారియొక్క కల్మషంలేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యధాతథంగా ఎదుటివారికి చెప్పటంవలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారి తీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాలు లాగా ఎదుటివారి మనస్సుకు గుచ్చుకుంటాయి. అయినా వీరి మనస్సు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాప పడతారు.
ధనుస్సువారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు, ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చెస్తారు. దాదాపు అందరికీ మంచి ఔతారు. తమ స్వంత వారికి మంచి అవకాశము ఉండదు. కనుక వారికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చి దిద్దడములో విఫలము ఔతారు. కుజ,రవి,రాహు,గురు దశలు యోగిస్తాయి. శుక్రదశా కాలములో జీవిత భాగస్వామితో విబేధాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
శరీరం & ఆరోగ్యం: ధనస్సురాశికి చెందినవారు ఛామనఛాయగా ఉంటారు. ప్రతిఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది. ఈ రాశివారు అందరినీ కలుపుకు పోతారు.
ఆర్థిక స్థితి: చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతుండటంవల్ల ఆర్ధికస్థితి మెరుగ్గా ఉంటుంది. మొదటినుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతుంటారు. తద్వారా లాభాలు బాగానే వస్తాయి.
ఆదాయం మరియు అదృష్టం: చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు.
ప్రేమ సంబంధం: ప్రేమంటే వీరికి ఆరోప్రాణం. ప్రేమకోసం ఏమి చెయ్యటానికైనా వెనుకాడరు. ప్రేమికులను కలపటానికి కృషి చేస్తుంటారు. బంధువులతో ఆప్యాయంగా ఉంటారు.
వ్యాపారం: వ్యాపారం రంగంమీద ఆసక్తిలేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించటంవల్ల, ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పనిమీద ఆసక్తి చూపించటంవల్ల విజయాలకు తిరుగే ఉండదు.
గుణగణాలు: దుందుడుగు స్వభావం కలవారుగా ఉంటారు. అయితే వీరు కుటుంబసభ్యులతో సర్ధుకుపోగలరు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలరు.
దాంపత్య జీవితం: వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు. వారి ఆశయాలను సఫలీకృతం చేయటానికి, వీరు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.
విద్య: విద్యా విషయాదుల్లో వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ. దానివల్ల వైద్యం, ఇంజనీరింగ్ విద్యలలో రాణిస్తారు. ఉన్నత చదువులకోసం విదేశీయానం చేస్తారు. ఉన్నత చదువువల్ల వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
గృహం మరియు కుటుంబం: ఇల్లు, పిల్లలు, జీవిత భాగస్వామి అన్నా వీరికి ఎనలేని అనురాగం. పిల్లలతో ఆటపాటలతో గడపటానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులను పిల్లలను తమ పిల్లలుగా బావించి వారిని దగ్గరకు తీస్తారు.
సహజమైన బలహీనతలు: ధనస్సురాశివారు ఉద్రేక స్వభావులుగా ఉండి ఎదుటి వ్యక్తి చెపుతున్న మాటలను పట్టించుకోకపోవటమనే పెద్ద బలహీనతతో ఉంటారు. ఈ గుణాన్ని కనుక జయిస్తే వారికి తిరుగుండదు.
వ్యక్తిత్వం: ఉన్నత వ్యక్తిత్వం గలవారై ఉంటారు. జీవితంలో ఎప్పుడూ నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు వేయనోళ్ల పొగుడుతారు. స్పష్టమైన వైఖరి కలిగిన ఈ రాశి వారు, ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు తరచి తరచి ఆలోచిస్తారు.
ఆరోగ్యం: ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ద వున్నప్పటికీ బాల్యంలోని జబ్బులుకూడా కొన్ని వెంటాడుతాయి.