బ్రహ్మంగారి కాలజ్ఞానంప్రకారం వృషభరాశివారి పూర్తి జాతకం ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు, చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశివారియొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీకూడా మనం తెలుసుకుందాం,
ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభరాశివారికి శని పదవ స్థానమైన కుంభరాశిలో, రాహువు పదకొండో స్థానమైన మీనారాశిలో, కేతువు ఐదవ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతోపాటుగా 12 జన్మస్థానమైన వృషభరాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉందంటే వృషభరాశివారికి అంటే, ఏ రాశివారికైనా గురుస్థానం బలంగా ఉందంటే కచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు.
గురు గ్రహం ప్రత్యేక కదిలికల కారణంగా వృషభరాశివారికి ఫిబ్రవరి 4 నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడంవల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యరంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక ఈయొక్క వృషభరాశివారికి మనం చూసుకున్నట్లైతేగనక ఇక పూర్తి జాతకము ప్రకారం ఎంతో చక్కగా వారియొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తాం అనేది వీళ్లు చేసేటువంటి పని అని చెప్పుకోవచ్చు. వీళ్లు చాలా కష్టపడతారు, అయితే ఎంత కష్టపడినాకూడా ఎన్ని కష్టాలొచ్చినకూడా వీళ్ళు భయపడరు, ఆ కష్టాలను చూసి వీళ్లు దూరంగా పారిపోరు. ప్రతి కష్టాన్ని అదిగమించే ప్రయత్నం చేస్తారు, దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాలు వైపు నడుస్తుందో, అదేవిధంగా వీళ్ళయొక్క జీవితంలో అదృష్టంకూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృషభరాశివారికి. అదృష్టవంతులు వీళ్లు అని చెప్పి నలుగురు మాట్లాడుకునేవిధంగా వీళ్ళయొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు.
వృషభరాశివారు ఎప్పుడూకూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు, పరిస్థితులుకూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళయొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లైతేగనుక, ఈ వృషభరాశివారికి వారియొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్ లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే, కన్ఫర్మ్ గా మనకి తేడా అనేది తెలుస్తుందిమాట, ఎందుకంటే వాళ్ళయొక్క జీవితం అంటే పెళ్లికి ముందు లేదా వాళ్ళయొక్క కెరియర్ లైఫ్ ని స్టార్ట్ చేయడానికి ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాతకి కూడా చాలా తేడా అనేది క్లియర్ గా కనబడుతుందనమాట, వృషభరాశివారికి పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత అలాంటి తేడాలు క్లియర్ గా తెలిసిపోతుందన్నమాట.
ఇక అదేవిధంగా వృషభరాశివారు చాలా సహనంతో ఉంటారు, కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే, ఎప్పుడు పిరికివాడు మొండివాడు రాజుకంటే బలవంతుడు అని చెప్పి అంటుంటారు, కాబట్టి ఈ వృషభరాశివాళ్లుకూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా రెచ్చగొట్టి కావాలని చెప్పి వీళ్ళ విషయాల్లో తలదూర్చడం లేదా వీళ్ళ చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకొచ్చే కోపం అంతాఇంతా కాదు. వీళ్ళ కోపంతోపాటు వీళ్ళయొక్క జీవితంలో వీళ్ళకు వచ్చే కష్టాలన్నింటినీకూడా అధిగమించడానికి వీళ్లు కోపాన్ని తగ్గించుకొని అనుచుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే, ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాదు కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటేమాత్రం కచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్‌ని వీళ్ళ లైఫ్ లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట.
వృషభరాశివారికి ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది, అంతే బలంకూడా ఉంటుంది. కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈజీగా బలహీనులైపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలో, అన్ని రకాల జాగ్రత్తలు ఈ వృషభరాశివారు తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్పబడుతోంది, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతాయి, అదేవిధంగా తొందరగా తగ్గిపోతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మాములుగా ఉండదు, అంటే అంత పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు అనేవి ఈ వృషభరాశివారికి వస్తాయి, కాబట్టి చాలాచాలా జాగ్రత్తగా ఉండాలనీ చెప్పి సూచించబడుతుంది.
ఇక వృషభరాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలాచాలా దృడంగా ఉంటారు, అంటే వీళ్ళు ఏదైనా విషయంగురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనాసరే కంప్లీట్ చేయాలని కానీ, లేకపోతే పలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అంటే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫర్మ్ గా ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. దృడంగా అంటే స్ట్రాంగ్ ఇంకా నేను అనుకున్నాను ఇలాగే చేస్తాను, ఇందులో మార్పు ఉండదు, ఇలా వాళ్ళయొక్క మొండి వైఖరి ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి దృడంగా నిర్ణయాలు తీసుకోవటంవల్ల వాళ్ళల్లో మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలుకూడా వస్తాయి, ఏంటంటే మూర్ఖత్వంగాపోవడంవల్ల నష్టపోయేముందు అయినా ఈ విషయాన్ని వీళ్లు అస్సలు గ్రహించరు.
కాబట్టి ఈ వృషభరాశివారు కోపాన్ని తగ్గించుకోవాలి, మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో, అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు, వీళ్ళు మొండిపట్టుదలను వదలాలి.
అయితే వృషభరాశివారు మొండిగా ఉంటారు అంటున్నారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు అంటున్నారు, మరి ఎక్కడా లొంగరా అనే విషయానికొస్తే కచ్చితంగా వీళ్ళు ప్రేమవిషయంలో తల్లి ప్రేమకుమాత్రమే వీలుదాసోహం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుందంట కదా, అలా ఈ వృషభరాశివారు ఎంత కోపిష్టులుగా ఉన్నా, మొండివాళ్లుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా కూడా, కాదు అగు అంటే, ఏదో ఒకచోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటివంటి హక్కునిగాని అలాంటి పరిస్థితిగానీ తల్లికి మాత్రమే ఇస్తారు, ఇక ఎవరి మాట వినిపించుకోరు, ఒక రకంగా చెప్పాలంటే వృషభరాశివారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం, తల్లి ప్రేమ వెనకాల వీళ్లు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ప్రేమకు వీళ్ళు లొంగుతారని మొండిగా చెప్పినా, కోపంగా చెప్పినా వీళ్లు అసలు వినిపించుకోరు.
ఈ రాశివారికి ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ప్రేమించిన వ్యక్తియొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే, వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. వృషభరాశిలో కొంతమంది వారియొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తియొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే, ఇక వాళ్ళు వాళ్ళచేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్నైనాకూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు, అదికూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెప్తే అదే అన్న రీతిలో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితిలోకి కొంతమంది వృషభరాశివారు వచ్చేస్తారు. అలాంటి స్థితిగతులుయొక్క వృషభరాశివారి జాతకంలో ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశివారు ప్రేమించినకూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాలకోసం డబ్బు వృథాగా ఖర్చు చేయబుద్ధి కాదు, వీళ్ళు జాగ్రత్తగా ఉండడంవల్ల డబ్బు దాచి పెడతారు, కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తేగనక పెద్ద వ్యాపారంలోగానీ స్పెక్యులేషన్‌లో గానీ నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి పెద్దపెద్ద వ్యాపారాల జోలికి వీళ్లు వెళ్లకుండా ఉండటం మంచిది. వ్యాపారం హై రేంజ్ లో పెట్టుకోవాలి అని ఆలోచన చేచి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే, ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతోంది.
ఇంకా ఈయొక్క వృషభరాశివారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒకరకంగా చెప్పాలంటే అది మంచిదే. ఒకచోట ఏదైనా పనులో వాళ్లు నిమగ్నమయ్యారనుకోండి, ఇంక అప్పుడు వాళ్ళు తిండిగురించి గాని, నిద్రగురించి గాని ఏమీ పట్టించుకోరు, చుట్టుపక్కల ఏం జరుగుతుందనేదికూడా పట్టించుకోరు అనమాట, కాబట్టి వీళ్లు ఈవిషయంలో ఆసక్తి చూపించకపోవడంవల్ల, శ్రద్ధ చూపించకపోవడంవల్ల, ఆరోగ్యం అనేది క్రమేపీ క్షీణించేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభరాశివారికి ఆరోగ్య సంబంధ విషయాలకొస్తే ఊపిరితిత్తులు, శ్వాససంబంధ వ్యాధులకి ఎక్కువగా వృషభరాశివారు గురవుతారు.
వృషభరాశివారు ఇతరుల మాటలు అస్సలు లెక్క పెట్టరండి, ఈ రాశివారికి మధ్య వయసునుండి జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే వీళ్లు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పుడునుండి చూస్తారన్నమాట. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్లుకు ఎక్కువ ఉన్నాయి. మంచి ధనసంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ వృషభరాశివారు చాలావరకు వాళ్ల జీవితంలో ముందుకు వెళ్తారు. ఏ విషయంలోనైనా కచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువులనుంచి జీవిత భాగస్వామివైపునుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుందది.
ఇన్ని ఉన్న కూడా వీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే ఆరోగ్య విషయం, అలాగే ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యలనుంచి తప్పించుకోలేరు, కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడకూడా అశ్రద్ధ చేయకండి, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవిమాత్రమే కుంగదీయగలవు, ఆర్థిక ఇబ్బందులు కాదు, శారీరక శ్రమకు సంబంధించింది కాదు, వృత్తి,వ్యాపారపరమైన ఇబ్బందులు కాదు. మిమ్మల్ని ఆరోగ్య విషయంలోమాత్రమే దెబ్బకొట్టే పరిస్థితిలే కనిపిస్తూ ఉన్నాయి, ఆ విషయాల్లో మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది, కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. చేశారా, మీరు చాలా నష్టపోతారు. చూశారు కదా, వృషభరాశివారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
