బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి స్త్రీలయొక్క మనం చూసుకున్నట్లైతేగనక ఇక పూర్తి జాతకముప్రకారం మేషరాశి రాశిచక్రంలో మొట్ట మొదటి రాశి, మేషరాశిలో అశ్వని నక్షత్రంలోని 1,2,3,4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1,2,3,4 పాదాలు, కృత్తిక నక్షత్రంలో మొదటి పాదం ఉంటాయి.
ఈ నక్షత్రలోని పాదాలో జన్మించినవారిని మేషరాశిగా అభివర్ణించటం జరుగుతూ ఉంటుంది, సాధారణంగా మహిళల వ్యక్తిగత లక్షణాలను గుర్తించగలిగితే ఎవరైనా వారిని బాగా అర్థం చేసుకోవచ్చు, మహిళల లక్షణాలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత వారితో మనం మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎంతో మంచి వాతావరణం ఉంటుంది.
ఎప్పుడైతే మహిళల లక్షణాలను అర్థం చేసుకుంటామో అప్పుడు వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు, 12 రకాల రాశుల్లో పుట్టినటువంటి స్త్రీలయొక్క ప్రవర్తన 12 రకాలుగా ఉంటుంది, అంతేకాదు ఒకేరాశిలో పుట్టిన వివిధ నక్షత్రాల్లో పుట్టినటువంటి స్త్రీల ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది.
రాశిచక్రాలలో వారి ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది, అలాగే వారి జీవిత కాలాన్ని కూడా అది రాసి వారి పుట్టినటువంటి నక్షత్రం ప్రకారం అంచనా వేస్తూ ఉంటారు, గ్రహాల మార్పులు అలాగే జన్మరాశి ఆధారంగా ఒక స్త్రీని అర్థం చేసుకోవడం ఐతే అంత సులభం కాదు కానీ, ఒక వ్యక్తి పాత్రని వారి లక్షణాలని ఎటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు లాంటి వాటిని మాత్రం అంచనా వేయొచ్చు.
ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీల గురించి మీరు తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులు, వెరీ పవర్‌ఫుల్ అన్మాట సినిమాలో చూపించిన విధంగా హీరోతో కూడా తలపడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి.
మేషరాశివారు స్త్రీలు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు. అందరితో చాలా స్నేహంగా ఉండే వ్యక్తులు. వారు అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తులు.
మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులుగా,మనోధైర్యము, దయార్థ హృదయము కలవారుగా ఉంటారు, స్త్రీలు సౌందర్య లక్షణాలను కలిగి ఉంటారు,. వీరు అమాయకంగా మరియు నమ్మకంగా ఉంటారు.
వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమనుకానీ విపరీతమైన కోపంగానీ చూపిస్తారు, అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో, ఇతరులు అంత ప్రేమ వీరిపట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధ పడతారు, దీని వలన వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది.
వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహా కార్యములు కూడా సాధించగలరు, అందువల్ల, వారు అందరిలో స్థానం సంపాదించడానికి చాలా చురుకైన జీవనశైలిని నడిపిస్తారు, మేషరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఇష్టపడతారు, అయితే, వారు కుటుంబం మరియు స్నేహితుల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు.
మేషరాశి స్త్రీలకి భయం తక్కువ, ఒక్కసారి గనుక ఎవరితోనైనా పోటీకి సిద్ధమైతే వారిని వెనక్కి లాగటం, ఆ పోటీలో నుంచి నిష్క్రమించు చేయడం ఎవరి వల్లా కాదు, ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాటం చేయగలిగినట్టువంటి శక్తి మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ఉంటుంది.
అలాగే ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు, ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు కాబట్టి ఎదుటివారిని అంచనా వేసే శక్తి ఎక్కువ ఉంటుంది, ఎదుటివారిని అంచనా వేయడంవల్ల వారితో సరిగా మాట్లాడినా మాట్లాడకపోయినా వారి ప్రవర్తన ఆధారంగా వారి ఏంటి అనేది ఒక అంచనాకి వచ్చేస్తుంటారు, మేష రాశిలో పుట్టినటువంటి స్త్రీలు.
అలాగే వీరి జీవన శైలి, కానీ వీరి వ్యక్తిత్వం కానీ నలుగురిలో భిన్నంగా ఉంటుంది, స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు, మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు, అంతేకాదు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు, ఎవరైనా ఏదైనా ఆంక్షలు పెడితే మాత్రం వారు తట్టుకోలేరు, వారిని ఫ్రీగా వదిలేయాలి అని కోరుకుంటారు, ఏదైనా ఒక పని అప్ప చెప్పాలి, అంతే తప్ప పని ఎలా చేస్తున్నారు ఎలా ముందుకు వెళ్తున్నారని దగ్గరుండి గమనించడం లాంటివి వీరికి నచ్చవు.
వీరి పట్ల వీరికి నమ్మకం ఎక్కువ, వీరితో పరిచయం పెరిగిన తర్వాత మిగతా వారికి కూడా వీరి పట్ల నమ్మకం పెరుగుతుంది, అలాగే వీరు ఎంతో విశ్వసనీయంగా ఉంటారు, ప్రేమ విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ కుటుంబ సభ్యులపట్ల బాధ్యతల విషయంలో కానీ చాలా నమ్మకంగా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు.
వీరిని ఎట్టి పరిస్థితుల్లోనైనా నమ్మచ్చు, వీరిని నమ్మి ఎటువంటి రహస్యమైన పంచుకోవచ్చు, దాని వల్ల వచ్చే నష్టం ఉండదు, ఒకసారి వీరిని నమ్మిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
మేషరాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి వత్తయిన కనుబొమలు కలిగి, అంత పొడుగు కాదు, అంత పొట్టీ కాదు, అంత లావు కాదు, అంత సన్నగా కాదు అన్నట్టుగా మధ్యస్థంగా ఉంటారు, విశాలమైన ముఖము అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది.
వీరు చూడటానికి ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు, వీరిపట్ల వందలమంది ఆకర్షితులవుతారు, కానీ వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా తను ప్రేమించిన వ్యక్తిపట్ల మాత్రమే ఆకర్షితులవుతారు.
అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ముక్కుసూటితనం ఎక్కువ, ఈ స్త్రీల ఏంటంటే మనసులో ఏదైనా ఉంటది మొహం మీద చెప్పేస్తూ ఉంటారు, అవతలి వారు బాధపడతారు లేదా ఇది చెప్పొచ్చా చెప్పకూడదని కాదు వీరికి మనసులో అనిపించింది, అది దించేసుకుంటారు, అటువంటి వ్యక్తిత్వం మేషరాశి స్త్రీలకి ఉంటుంది, అలాగే వీరు చూపు చురుకుగా ఏదైనా నిశితంగా గమనిస్తూ ఉంటుంది, ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా చురుకుగా పాల్గొంటారు.
కొన్ని సందర్భాల్లో మేషరాశి స్త్రీలని కోపిస్తుగా, దురుసుతనం ఎక్కువగా ఉన్నవారిగా అందరూ పోలుస్తూ ఉంటారు, అలాగే, ఇంట్లో సంతోషమైనటువంటి వాతావరణం కోసం వీరు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు, కుటుంబమే వీరికి ప్రధానమైనటువంటి భాధ్యత, ప్రాధాన్యత కూడా, ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటూ ఉంటారు, మేష రాశిలో పుట్టినటువంటి స్త్రీలు.
వీరు చాలా కష్టపడతారు, చుట్టుపక్కల వారి కోసం వీరి మీద ఎవరైతే నమ్మి ముందుకు వెళ్తూ ఉంటారు, వారి కోసం కుటుంబం కోసం ఎంత కష్టపడడానికైనా వీరు వెనకాడరు, అలాగే వారి సొంత నిబంధనలు, షరతుల మీద జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
వీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా ఒక సంబంధంలో ఎవరితోనైనా ప్రవర్తించేటప్పుడు ఇంత వరకే ఒక లిమిట్ పెట్టుకుంటారు, అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు, అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు వారికి ఇష్టమైన వారిపట్ల ఎంతో అంకితభావంగా ఉంటారు, అంతే అంకితభావాన్ని, విశ్వసనీయతని కోరుకుంటారు.
వీరు ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే మేషరాశి స్త్రీలకు ఏ మాత్రం నచ్చదు, అలా మేషరాశి స్త్రీలు కూడా ప్రవర్తించరు, ఒక దగ్గర మాట్లాడుకున్నా అంశాన్ని వారు లేని సమక్షంలో వేరే చోట చెప్పడం అనేది అస్సలు నచ్చదు.
అలాగే తెలివైనటువంటి మహిళలు మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు సాహసాలు చేయడానికి సవాళ్లను ఎదుర్కోవడానికి ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు.
జీవితంలో కొత్త కొత్త పనులు గొప్ప గొప్ప బృహత్కర కార్యక్రమాన్ని చేయాలని సాహసాలు చెయ్యాలని, ఎవరూ చేయలేనివి సాధించి సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోరుకుంటారు, ఎంతైతే ధైర్యంగా ఉంటారు, సమస్యలని సవాల్ అని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటారో అంతే, ఎమోషనల్‌గా కూడా ఉంటారు, చాలా భావోద్వేగంగా ఉంటారు, కేవలం వీరంటే ఇష్టమైన వారి దగ్గర, వీరిని ఇష్టపడే వారి దగ్గర మాత్రమే, ఆ ఇమోషనల్ అనేది బయటపడుతూ ఉంటుంది.
అలాగే ఎదుటి వారు చెబుతున్నది, చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు, మేష రాశిలో పుట్టినటువంటి స్త్రీలు, వారికి బాగా ఇష్టమైన వారిని చూసుకోవడానికి ఏమైనా చేస్తుంటారు, అలాగే దయాగుణం ఎక్కువ మేషరాశిలో పుట్టిన వారికి, ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే అప్పటి నుంచి వారిని గట్టెక్కించడానికి ఏమైనా చేయగలను అని అనిపిస్తే కచ్చితంగా చేస్తారు.
ఇతరులకి సహాయం చేయడానికి ఎవరినైనా ఎదిరిస్తారు, ఎట్టిపరిస్థితుల్లో తప్పు చేయరు, చేయాలి అని ప్రోత్సహించే వారిని సైతం ఎధిస్తారు, ప్రేమని కోరుకుంటారు, మనస్ఫూర్తిగా ఒక వ్యక్తితో మంచి స్నేహాన్ని కోరుకుంటారు, ఎటువంటి దాపరికాలు లేని ముసుగులులేని బంధాన్ని మాత్రమే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఆశిస్తూ ఉంటారు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంస్కృతి,సంప్రదాయాలకు ఎక్కువ విలువ, గౌరవం ఇస్తారు. అలాగే వీరికి సామాజికతత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ హక్కులు, బాధ్యతలకోసం పోరాడుతుంటారు. వీరు ధైర్యంగా ఉంటారు. వీరు ఆలోచనలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరికి దాతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెబుతుంటారు.
ఏ విషయంలోనైనా చురుగ్గా ముందుకు వెళ్లిపోతుంటారు. వీరు ఇలా చొరవగా, తొందరపాటుగా ముందుకు వెళ్లిపోవడంవల్ల కొన్ని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంవల్ల కొన్నికొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే వెనుకా ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఆ పని మొదలు పెట్టడంవల్ల ఆ పనిలో వచ్చే కష్టనష్టాలు వీరు అనుభవిస్తారు. ఇబ్బందులు పడుతుంటారు.
అలాగే వీరికి స్వేచ్ఛగా ఉండటం అంటే ఇష్టం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. స్వేచ్ఛ, స్వతంత్రంవలన వీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు.
అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు, కానీ ఆ పని నచ్చకపోయినా ఆ పనిలో వారి ఆత్మాభిమానానికి భంగం కలిగించే వాతావరణం అక్కడున్న అది ఎంత ముఖ్యమైన పనైనా దాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతారు.
వీరికి ఆత్మాభిమానం,ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి, వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది, అయితే వీరు కొన్ని కొన్నిసార్లు వీరి శ్రమకు మించిన ప్రతిఫలాన్నీ కోరుకుంటారు, దీనివలన వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడినుంచి ఆ పని వదిలేసి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి.
వీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఆశించే స్వభావం కలవారు ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు, అలాగే వీరికి సామాజిక ధృక్పథం ఎక్కువగా ఉంటుంది, వీరు హక్కులు అలాగే బాధ్యతల గురించి వీరు పోరాడుతుంటారు.
ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీల ప్రేమ వైవాహిక జీవితం గురించి చెప్పినట్టయితే ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారు అనుకుంటే మిమ్మల్ని అభినందించాలో విచారం వ్యక్తం చేయాలో కూడా నిర్ణయించుకోవడం కష్టమే.
మేషరాశి యువతి ప్రేమకి తానే ప్రతిరూప అనుభవిస్తుంది, ఎదుటి వారి ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారు కూడా అంతే వీరిని ప్రేమించాలని అనుకుంటారు, ఒకసారి వీరు ఎదుటివారిని ఇష్టపడితే అతనే సర్వస్వం అతని జీవితం అని అనుకుంటారు, అంతలా వారి ప్రేమ ఉంటుంది.
ఇక ఆ ప్రేమ నిజం కాదు, అందులో స్వార్థం ఉందని ఒకసారి తెలిస్తే మాత్రం జీవిత భాగస్వామినైనా వదిలి ఒంటరిగా బ్రతకగల ధైర్యం మొండితనం వీరుకుంటుంది, అంటే మోసాన్ని అసలు భరించరు. అలాని జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు. తన ఆశలకు తగ్గ కలల రాకుమారుడు కోసం వెతుకుతూనే ఉంటారు.
అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని క్షుణ్ణంగా గమనిస్తుంటారు, ఇలా గమనించి ఎదుటివారిలో ఉన్న లోపాలు వీరు ఎత్తి చూపుతారు, ఇతరులలో తప్పులు లేదా లోపాలు వీరు వెతుకుతారు, దీనివల్ల వారు ఇతరులకు విరోధులుగా తయారవుతారు.
అలాగే ఎదుటివారితో గొడవలు పడినా అందులోనూ ఏ మాత్రం తగ్గరు, నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణితో ఉంటారు, వీరు తప్పులేకుండా వీరు అస్సలు తగ్గరు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆలోచనలు చాలా బాగుంటాయి.
వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్తకొత్త సృజనాత్మక ఆలోచనలు వస్తుంటాయి, వీరులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలీదు, వీరు బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందని వీరికి తెలీదు, సమయాన్ని సందర్భాన్ని బట్టి వీరు మెదడు చురుకుగా పాదరసంలా పనిచేస్తుంది.
ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పని ఎవరు చెప్పినా వీరు వినరు, అలాగే వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు, ఆ నిర్ణయంలో కష్టనష్టాలు వచ్చినా అది వారే భరిస్తారు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభనష్టాలు చూడకుండా ముందుకు వెళ్లిపోతుంటారు.
వీరు మనస్సు వాక్కు నియంత్రించుకునే నిగ్రహము ఓర్పు,సహనం వీరికి ఉండదు, అలాగే వీరు కుటుంబంపట్ల తల్లిదండ్రులపట్ల గౌరవంగా,ప్రేమగా వ్యవహరిస్తారు, వీరు మొట్టమొదటి ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో పని చేస్తుంటారు, వీరు ఇతరుల అభివృద్ధి గెలుపుముందు చూసినప్పుడు వీరికి నేను ఏదో సాధించాలనే ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉంటుంది.
ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, ఎదుటివారికంటే ఇంకా ముందు ఉండాలి అనుకుంటారు, వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి, విద్యార్థి దశలో వీరి తెలివి విద్యపట్ల చూపినట్టయితే వీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు, వీరు ఎప్పుడు ఇతరులకంటే ముందంజలో ఉండాలనుకుంటారు, దానికనుగుణంగా కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు.
అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు, వీరు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు, జలానికి సంబంధించిన విహార యాత్రలు అనగా బీచ్, బోటింగ్, వాటర్ ఫాల్స్ లాంటి ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు, అలాంటి ప్రదేశాలు అంటే వీరికి భయం అని చెప్పాలి, ఇక వీరి ఆహార విషయాలకొస్తే వీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, అంటే స్పైసీ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా తలకు సంబంధించిన తలనొప్పి ఉదరానికి సంబంధించి కడుపునొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి, అలాగే వీరు ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు, వీరు దేహదారుఢ్యంపట్ల అనగా ఫిజికల్ ఫిట్ నెస్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు.
అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంతటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగల ధైర్యం వీరుకుంటుంది, సమాజంలో పేరు ప్రతిష్టలు కోసం ఆరాట పడుతుంటారు, దాని కోసం కష్ట పడుతుంటారు, తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడుకూడా సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటారు.
సమాజంలో వీరుడిగా ధీరుడిగా తన ముందు నిలబడాలని వీరు ఊహించుకుంటారు, కళలు కంటారు, అలాగే వీరికి ఓర్పు, నేర్పు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది, వీరికి గుండె నిబ్బరం అధికంగా ఉంటుంది.
ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగం విషయానికి వస్తే, మేష రాశిలో జన్మించిన స్త్రీలు ప్రభుత్వ రంగం, నిర్మాణ రంగం,వంట రంగం, విద్యా రంగం, ప్రభుత్వ రంగ సంబంధిత రంగాలలో ఉద్యోగాలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది, వారు ఓపెన్ మైండెడ్ మరియు ఎనర్జిటిక్ గా ఉంటారు,కాబట్టి, వ్యక్తులకు సంబంధించిన ఉద్యోగాలు వారికి బాగా సరిపోతాయి.
మేషరాశి స్త్రీలు ఇతరుల గురించి చింతించకుండా తమదైన రీతిలో ముందుకు సాగుతారు, వారు కొన్నిసార్లు మంచి స్వభావంతో ప్రవర్తించినప్పటికీ, వారు చాలా మందికి చెడుగా కనిపిస్తారు, అయితే దీన్ని తమ జీవన శైలికి అందని ద్రాక్షగా కూడా భావిస్తారు.
వారు దేనిలోనైనా కొంచెం రిస్క్ తీసుకుంటారు, మరియు అనేక చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే వారి నిర్ణయం యొక్క పరిణామాలను అర్థం చేసుకుంటారు, అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పొగడ్తలు అంటే చాలా ఇష్టం, కానీ ఆ పొగడ్తలో నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకోగల ప్రతిభ ఓర్పు కూడా పేర్కొంటుంది.
మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు, ఆ పని అయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు, వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు, వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది.
మేష రాశిలో పుట్టినటువంటి స్త్రీలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే బాగా కలిసొస్తుంది, అలాగే ఏడు సంఖ్య మేషరాశి స్త్రీలకి కలిసొచ్చే సంఖ్య, ఆకుపచ్చ రంగుని ఎంత తక్కువ ధరిస్తే అంత మంచిది, ఎరుపు రంగు మేషరాశి స్త్రీలకి బాగా కలిసొస్తుంది.
అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు మంగళవారంనాడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అందులో శుభమే కలుగుతుంది, బంగారాన్ని ధరించిన లేదంటే వైడూర్యని ధరించిన మేలు కలుగుతుంది, వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఎంత నిత్యం సందర్శిస్తే అంత సుఖం వీరి జీవితంలో సొంతమవుతుంది.
