ఇక ధనుస్సురాశివారికి మనం చూసుకున్నట్లైతేగనక ఇక పూర్తి జాతకముప్రకారం మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తారాషాడ 1వ పాదంలో జన్మించినవారు ధనూరాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు, ఈ ధనుస్సురాశివారు ఎవరైతే ఉన్నారో వారికి అత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము, స్వవిషయాలను ఇతరులకు అవసరమైనమేరకే తెలియజేస్తారు, స్వవిషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు.
ధనుస్సురాశివారియొక్క స్వభావము లక్షణాలు మరియు వారియొక్క జాతకరీత్యా వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, దానికంటే ముందు వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్ధం అవుతుంది.
ధనుస్సురాశి వారియొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి, ఊహలన్నీ కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు, వారు తలచిన పనులు చాలావరకు సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగీ ఉంటారు, మీరు ఏకసంథాగ్రాహిలుగా ఉంటారు.
అనుకున్న ప్రతి పని కచ్చితంగా పూర్తి చేయాలి, అటువంటి మనస్తత్వం కలిగీ ఉంటారు, ఎలాంటి కొత్త పనినైనా చూసిన వెంటనే గ్రహించటం అనేది వీరిలో ఉండే ప్రత్యేకత, అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు, ధనుస్సురాశివారికి వేదాంత పరమైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
వీరియొక్క మాటలలో రాజటీవి వ్యక్తమవుతూ ఉంటుంది, రాజసం అనేది వీరిలో కనపడుతూ ఉంటుంది, కొంత గర్వంకూడా ధనూరాశివారిలో మనకి గోచరిస్తూ ఉంటుంది, వీరు ప్రతి మాటని కూడా నిష్కపటంగా పలుకుతూ ఉంటారు, ధనస్సురాశివారు మంచి వాగ్ధాటిని కలిగీ ఉంటారు.
కపటం లేనటువంటి మాటలను వీరు పలుకుతూ ఉంటారు, మంచి వాక్కు, వాగ్ధాటి వాక్పటిమ అలాంటివన్నీ కూడా చాలా శ్రేష్టంగా ఉంటాయి, కొన్ని సందర్భాలలో వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వీరియొక్క ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరు కూడా ఈర్ష్య పడేవిధంగా వీరియొక్క నడవడిక అనేది ఉంటుంది.
అదేవిధంగా వీరు పొగడ్తలకు పొంగే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు, అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అస్సలు వారికి భయపడటంకానీ బెణకటంకానీ ఇలాంటివి వీరిలో అస్సలు ఉండవు, ధనుస్సురాశి అంటే ధనువు అంటే బాణం, వీటికి సంబంధించి చాలావరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగీ ఉంటుంది ధనస్సు.
అలాంటి స్వభావాన్నే ఈయొక్క రాశివారు కలిగీ ఉంటారు, వీరు జరగబోయే విషయాలలో మీరు కొన్ని చెప్తూ ఉంటారు, వీరు చెప్పేటువంటి జోస్యం అనేది చాలావరకు నిజమవుతూనే ఉంటుంది, ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించేటువంటి విషయాలు కచ్చితంగా జరిగీ తీరుతూ ఉంటాయి.
వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ ధనుస్సురాశివారు, తరచుగా వీరికి మృష్టాన్నభోజనం అనేది లభిస్తూ ఉంటుంది, దీనివలన వీరు కొంత లావు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి, తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి.
ధనుస్సురాశివారు తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గీంచుకుంటే చాలా చక్కగా ఉంటుంది, ఈ రాశివారికి ప్రయాణాలు అంతగా పడవు, వీరు చాలా గొప్ప పదవుల్ని అధిరోహిస్తూ ఉంటారు, ఈ ధనుస్సురాశివారు భోగభాగ్యాలు అంటే పుట్టినప్పటినుంచి కూడా మాక్సిమం భోగభాగ్యాలును అనుభవిస్తూ ఉంటారు.
చాలావరకు కూడా వీరికి వయసు మీద పడేకొద్దీ కూడా వేదాంతము, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది సన్యాసి జీవితం గడుపుతుంటారు, వీరు వీరియొక్క ఆలోచనల్ని అదుపులో పెట్టుకున్నట్లుయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు.
కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక మీరు చాలా కాలంవరకు జీవనాన్ని సాగీంచగలుగుతారు, వీరియొక్క సెరీరంలో విశాలమైన నుదురుని కలిగీ ఉంటారు, విశాలమైన దృఢమైన సెరీరాన్ని కలిగీ ఉంటారు, వీరిలో తలభాగము మెడభాగం పెద్దదిగా ఉన్నట్లైతేగనక జీవితంలో ఎక్కువగా సుఖపడగలుగుతారు.
ఈ రాశివారిని ఎక్కువమంది గుర్తుంచుకుంటారు, సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగీన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు, జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు, జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి, కొద్దిగా అననుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది.
పూర్వాచారములో వీరికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది, పూర్వపు సాంప్రదాయమైనటువంటి విషయాలలో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది, వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్ధం చేసుకోగలుగుతారు, ఈ కారణంచేత వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తలచిన ప్రతి పనికూడా వీరు సాధించగలుగుతారు.
వీరి ఆలోచనలు సాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి, ధనుస్సురాశివారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు కలిగీ ఉంటారు, వీరు ఎవరి చెప్పుచేతుల్లోనూ ఉండరు, అంటే ఒకరి మాట వినరు ఒకరికి లోబడి ఉండరు, ఒకరిమాట ప్రకారం అసలు పనిచేయరు.
న్యాయవర్తనము దైవచింతన ఎక్కువగా ఉంటుంది, పెద్దలపట్ల గౌరవాన్ని కలిగీ ఉంటారు, మర్యాదపూర్వకంగా ఉంటారు, శుచి శుభ్రతలాంటివి ఎక్కువగా ఉంటాయి, ఇక ధనుస్సురాశివారు చాలా అవయవపుష్టిని కలిగీ ఉంటారు, అభిజాత్యం అనేది ఎక్కువగా ఉంటుంది, వీరికి ఒక్కోసారి ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఎదుటివారికి కష్టం కలిగేలా మాట్లాడుతూ ఉంటారు.
తాము ఎంతో ఆలోచన కలవారమని, లౌక్యంగా ఉండేవారమని వీరియొక్క ఉద్దేశం ఉంటుంది, వీరు నిజాయితీగా ఉంటారు, అదేవిధంగా మనస్సులో ఎలాంటి మాటని దాచుకోకుండా బయటకు చెప్పెయ్యడం వీరి స్వభావం, తన చుట్టుపక్కల అంతా కూడా న్యాయవర్తనగా ఉండాలని న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు.
ఈ రాశివారు ఏ పనినైనా బాగా ఆలోచించి చేస్తారు, ఆలోచించకుండా అస్సలు చేయరు, దైవభక్తి, పాపభీతి ఎక్కువగా ఉంటాయి, సంప్రదాయాలు బాగా పాటిస్తారు, వీరు ఏ పని అయినా కొంచెం అనుమానంగా అనిపిస్తేకనుక వెంటనే ఆ పనిని ఆపేస్తారు, ఎంతటి పనైనాసరే, అది చివరకు వచ్చేసింది ఇంకేముంది అయిపోతుంది అనుకున్నసరే దాంట్లో అనుమానం కలిగీతే వెంటనే ఆపేస్తారు.
ఈ రాశివారు ఎప్పుడూ ఎలాంటి ఆలోచిస్తూ ఉంటారు అంటే వీరు ఎప్పుడుకూడా ఎదుగుదలగురించే ఆలోచిస్తుంటారు, ఒకచోట ఉండడం స్థిమితముగా ఉండటంలాంటివి వీరికి నచ్చదు, ఎప్పుడూ ఏదో ఒక పని పెట్టుకుని బిజీగా ఉంటూనే ఉంటారు, వీరికి జంతువులపైన కరుణ జాలి అనేవి ఎక్కువగా ఉంటాయి.
ఉన్నది ఉన్నట్టు మొహమ్మీదే మాట్లాడతారు, దానివల్ల కొంత వైరాన్ని కూడా తెచ్చుకుంటారు, బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు, గౌరవాలు ఎక్కువగా ఉంటాయి, వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని ఇంట్లోవారు గుర్తించరు, అదేవిధంగా ఈ ధనుస్సురాశివారియొక్క మనసు చాలా మంచిది అని చెప్పి తెలుసుకుని చాలామంది స్నేహం చేయడానికి కోరుకుంటారు.
వీరి సంతానం కొద్దిగా గర్విష్టులుగా ఉంటారు, కుటుంబంతో తొందరగా కలవరు, ఈ రాశివారు ఎప్పుడు తృప్తిగా, ఆనందంగా ఉంటారు, వీరిని కనుక చిరాకుపరిచిన వీరికి చిరాకు వచ్చినాసరే వీరి కోపం అనేది తారాస్థాయిలో ఉంటుంది, చాలాచాలా కోపం ఎక్కువగా వస్తుంది, వీరి జీవితాన్ని చాలా సరదాగా తీసుకుని నడుపుతారు.
అదేవిధంగా ఇతరత్రా విషయాలేవీకూడా ఒక పట్టాన తలమీద పెట్టుకొని భారంగా మోయరు, వీరు వేరే ప్రదేశానికి వెళ్లినప్పుడు వారికి ఒక్కోసారి శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది, వీరి వయసు పెరిగేకొద్దీ మంచి బుద్ధికుశలత వీరికి ప్రాప్తించబడుతుంది, సహజంగా వీరు బుద్ధిమంతులు, వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ వీరికి చాలా గొప్పజ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది.
అంటే చాలా షార్ప్ గా ఉంటూ ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వెంటవెంటనే సాల్వ్ చేయగలిగీనట్టు తెలివితేటలు కలిగీ ఉంటారు, ఈ రాశివారు నిన్నటికన్నా ఈ రోజు, ఈ రోజుకన్నా కూడా రేపు ఎంతో ఆనందంగా గడపాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉంటారు.
ఎప్పటికప్పుడు కొత్తగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఈ రాశివారికి కోపం కలిగీంచే సంఘటనలు, పాత విషయాలు, తేదీలతో సహా చాలా బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు, అదేవిధంగా పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు వీరు మర్చిపోతుంటారు.
వీరికి పొడవైన ముఖము భక్తి గలవారు మంచి త్యాగీ ఔదార్యవంతులు, అదేవిధంగా సామరస్యం కలిగీంచే అంశం కలిగీ ఉంటారు, అంటే వీరు సామరస్యంగా ఉంటేనే మన మాట వింటారు తప్ప, ఎదిరిస్తే లేదా రెచ్చగొడితే అసలు మన మాట వినరు, వీరిచేత పని చేయించుకోవాలి అంటే మంచి మాటలు నెమ్మదిగా చెప్పి మాత్రమే పని చేయించుకోగలుగుతాం.
వీరిని మోసగీంచడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, ధనుస్సురాశివారు చాలా ముక్కుసూటిగా ఉంటారు, ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటారు, ఆలోచన విధానం చాలాచాలా సూటిగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, షార్ప్ గా ఉంటుంది.
అదేవిధంగా వీరు ఇతరులపట్ల మంచి అవగాహన కలిగీ ఉంటారు, జంతు ప్రేమికులు అదేవిధంగా దేవునిపట్ల ఆధ్యాత్మికమైనటువంటి భావనలు కలిగీ ఉంటాయి, అంతేకాకుండా వీరు సూటిగా ఉంటారు, అంతేకాకుండా వీరియొక్క స్వభావం ఎప్పుడూ కూడా ఇతరులతో మంచిగా ఉంటుంది, సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగీ ఉంటారు.
అలాగే ఈ ధనుస్సురాశివారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది, నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం లేక మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకి సెత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూఉండడం, ఏ పనికూడా విశేషంగా కలిసిరాకపోవడం, మీకు వందరూపాయలు రావలసినచోట పదిరూపాయలు మాత్రమే మీ చేతికి రావటం లేక మీ కష్టానికి తగీనటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీకూడా నరఘోషకి మూలముగా చెప్పుకోవచ్చు.
ఈ నరఘోష అనేటువంటిది దాదాపుగా ఈ ధనుస్సురాశివారి అందరికీ ఉంటుంది, ఎవరైనా పైన ఉదహరించినటువంటి భాదలు పడేవారు నరసింహస్వామి వారియొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మేడలో నరసింహస్వామి వారియొక్క లాకెట్ వేసుకోవాలి, అదేవిధంగా ఏదైనా నరసింహస్వామివారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచం తెచ్చుకొని నాగాసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజూ పెట్టుకుంటూ ఉండాలి.
అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి, మగవారైతేకనుక ఎరుపురంగు మొలతాడును నడుముకు ధరించండి, అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపుదారాన్ని మొలతాడుగా కట్టి ఎడమఅరికాలుకు కాటుకబొట్టు పెడుతూఉండాలి, మగవారికి అయితే కుడివైపు అరికాలుకు కాటుక బొట్టు పెట్టాలి, కుంకుమబొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి.
ఈ విధంగా చేయటంవలన మీకున్నటువంటి ఈయొక్క నరఘోశ,నరపీడ అనేటటువంటివి తగ్గుముఖం పడుతుంది, అదేవిధంగా మనం బయట కిరాణా దుఖాణాల్లో స్పటిక అని ఒకటి దొరుకుతుంది, కాస్త ఉప్పుగా పుల్లగా ఉంటుంది, అది తెచ్చుకుని ఒక ఎరుపురంగు బట్టలో కొంచెంపసుపు,కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి, మీ ఇంటిగుమ్మానికి వేలాడదీయటంవలన నరఘోశ అనేది తగ్గుతుంది.
అలాగే ధనుస్సురాశివారు ఎప్పుడూకూడా గోమాతను ఆరాధించండి, ఎందుకంటే గోమాత అంటేగనక సకల దేవతా స్వరూపం, గోమాతను ఆరాధించడంవల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకలదేవతలయొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి.
ఈ ధనుస్సురాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి, ఇలా దీపం వెలిగీంచి దేవుడిని ప్రార్థించడంవల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి, ఈ ధనుస్సురాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి, ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది, మెరిసే కాంతి దుష్టసెక్తులను దూరం చేస్తుంది, అలాగే తులసిముందు కూడా దీపం వెలిగీస్తే సకలశుభాలు కలుగుతాయి.
