Loading...
loading

బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశివారి పూర్తి జాతకం బయటపడింది

  • Home
  • Blog
  • బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశివారి పూర్తి జాతకం బయటపడింది

బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశివారి పూర్తి జాతకం బయటపడింది

బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాల్ని చెప్పారు, ఆ విషయాలలో ప్రతి ఒక్కరియొక్క జీవితంగురించి కూడా ఆయన చెప్పడం జరిగీంది, అంటే కాల కాలజ్ఞానం లో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతోపాటుగా మరొక విషయంగురించి కూడా ఆయన చెప్పారు.

ఏ వ్యక్తియొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందినవారై ఉంటారు, అనేటువంటి వాటిని కూడా చూచాయిగా ఆయన చెబుతూ వచ్చారు, మరి వాటికి సంబంధించి కాల కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారంగా కుంభరాశివారికి జరగబోయేటువంటి నిజాలు గురించి ఇప్పుడు మనం చూసేద్దాం.

కుంభరాశి, రాశి చక్రంలో పదకొండవది కుంభరాశి, ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం 1,2,3,4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు, ఈ కుంభరాశికి అధిపతి సెని, ఇది వాయుతత్వపు రాసి అలాగే స్థిరరాసి అని కూడా చెప్పుకోవచ్చు.

కుంభరాశిలో జన్మించినవారు పొడవైన,బలిష్టమైనసెరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగీ ఉంటారు, చక్కటి ముఖవర్ఛస్సు ఉంటుంది, సుందరమైనవంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటివారికి కనబడతారు.

వీరు చాలా దయాగుణం కలిగీ ఉంటారు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగీ ఉంటారు, ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు, నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తుంటాయి.

ఈ కుంభరాశివారియొక్క స్వరూప విషయానికి వస్తేకనక కుంభరాశివారు దృడమైన సెరీరం కలిగీ పొడవుగా ఉంటారు, వీరు సగం వయస్సులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలుంటాయి, అందమైన ముఖవర్చస్సు, అలాగే అందమైనటువంటి రూపం మీ జుట్టు బ్రౌన్ కలర్ లో ఉంటుంది, వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటువంటి స్వభావం కలిగీ ఉంటారు.

ఇక వీరి స్వభావం విషయానికొస్తే ఎంతో తెలివిగలవారు అదేవిధంగా మంచి జ్ఞాపక సెక్తి కలిగీ ఉంటారు, చూడగానే ఎదుటివారిని కచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగీ ఉంటారు, నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశివారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు.

అలాగే కుంభరాశివారు చాలా చక్కటి కాన్సన్‌ట్రేషన్ కలిగీ ఉంటారు, కుంభరాశివారు దయ మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగీ ఉంటారు, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు, ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడూ ఆనందంగా ఉండటం జరుగుతోంది.

ఇక పరిశోధనాత్మకమైనటువంటి సెక్తి అనేది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతోంది, అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండటం జరుగుతుంది, అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు.

కుంభరాశివారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు, అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు, సీరియస్ గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగీ ఉంటారు, కానీ శాంతంగా, సౌమ్యంగా ఉంటారు, అలాగే మంచి ఆలోచన సెక్తి కలిగీ ఉంటారు, వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ కుంభ రాశివారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు, వీరు కొద్దిగా స్వార్ధపరులుగా ఉంటారు, అదేవిధంగా సోషలిస్ట్ గా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు, కటినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతుంటారు.

అలాగే కార్యనిర్వాహణను కూడా చాలా సామర్థ్యంగా కూడా వీరి చేస్తారు, వీరికి చాలా మంచి వివేక సెక్తి ఉంటుంది, అలాగే వేరేవారికి బోధించడంకన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేకంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు.

ఈ రాశివారి ధనవంతులవ్వడం ఖాయం, నీతి నిజాయితీకి కట్టుబడి వారియొక్క పనులు చేస్తూ ఉంటారు, అదేవిధంగా ఎప్పుడు చాలా అలర్ట్ గా ఉంటారు, కొత్తకొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగీ ఉంటారు, అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగీ ఉంటారు, నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.

భవిష్యత్తును ఊహించడం వీరియొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పొచ్చు, అదేవిధంగా వీరికి కాన్సన్‌ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, ఈ రాశివారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లభిస్తాయి, వీరు వీరి కుటుంబంలో సమానత్వం కలిగీ ఉండటం జరుగుతుంది, ఈ రాశివారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది.

వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది, సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు, వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదేమార్గంలో వెళ్లడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా వీరు ఊహించుకోవడం ఎక్కువ చేస్తుంటారు.

అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగీ ఉంటారు, వీరు పనులు ఊహలకు అందనివిధంగా ఉంటాయి, వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీకూడా దానిగురించి పెద్దగా ఆలోచించరు, అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడటం కూడా వీరిదగ్గర ఉండదు.

చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడమే వీరికి ఇష్టంగా ఉంటుంది, అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు, ఈ కుంభరాశివారు శాంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగీ ఉంటారు, వీరు ప్రవర్తన వీరు టీవీ వీరు మేధో సంపత్తి, ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్లే విధంగా ఉంటాయి.

అలాగే వీలైనంతవరకు వీరిభావాలు ఎక్కువగా వేరేవారుకు తెలియజేయడం కూడా జరుగుతుంది, ఇండోర్ గేమ్స్, క్యారం బోర్డు లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు, కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు, విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు.

వీరి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి, ఈ కుంభరాశివారికి సంబంధించినటువంటి వృత్తులుగురించి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే, డాక్టర్స్ గా, డిటెక్టివ్‌గా వీరు పనిచేయడం జరుగుతోంది.

అలాగే మానసిక వైద్యులు, పరిశోధన శాస్త్రవేత్తలు అదేవిధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, లెక్చరర్, అలాగే సోషల్ వర్కింగ్, సివిల్ కాంట్రాక్టర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు.

ఈ కుంభరాశివారి ప్రేమ మరియు వివాహ విషయాలకొస్తే వీరు తెలివైనవారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు, స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు, అదే విధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు.

వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు, అయితే వీరి వీరు ప్రేమను బయటకు వ్యక్తపర్చకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండటం జరుగుతోంది. ముఖ్యంగా ఈ రాశివారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరుచుకోవడానికి బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

ఈ కుంభరాశివారి ఆర్థిక విషయాలు, అదృష్ట విషయాలకొస్తే వీరు ధనం విషయంలో అదృష్టవంతులు, విశేష గౌరవమర్యాదలు, ఐశ్వర్యం వీరు పొందుతారు, ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి సుకించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు, సంపాదించినంతవరకు డబ్బులు అవసరాలకుమాత్రమే ఉపయోగపడితే చాలనుకుంటారు.

అలాగే అత్యాశను కలిగీ ఉండరు, అప్పులు చేయడం అస్సలు నచ్చదు, అసాధారణమైన అనూహ్యమైన మార్గాలద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు, ఈ రాశివారికి మంచి బహుమానాలు వస్తాయి, వీరు అదృష్టవంతులు, ఈ రాశివారిని చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడంవలన చాలా అలసిపోతారు.

దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు లేదంటే కీళ్లకు సంబంధించిన జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెజర్ లాంటివాటికి గురవుతుంటారు. అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది, కంటి జబ్బులకు గురవుతారు కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినాసరే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం అవసరం.

ఈ రాశులవారు జాగ్రత్తపడాల్సిన విషయాలు ఏంటంటే బద్ధకాన్ని తగ్గీంచాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, భాదపడే గుణం తగ్గీంచుకోవాలి, ఒంటరిగా ఉండటాన్ని తగ్గీంచుకోవాలి, అలాగే అభిప్రాయాలు మార్చుకొనే గుణాన్ని పెంపొందించుకోవాలి.

ఈ కుంభరాశివారికి ఏదైనా చేయగలం, అనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్న మాట, ఎలాంటి విషయంగురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు, చాలా ఈజీగా దానిగురించి మాట్లాడేస్తూ ఉంటారు, ఎందుకు చేయలేం, చేయగలం అని చెప్పి చాలావరకు కూడా కొంచం ఇగోయిస్టిక్ గా ఉంటూ ఉంటారు.

ఇతరులనుంచి విమర్శల్ని అస్సలు తీసుకోలేరు, ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు, వీళ్ళ ఏది చెబితే అది జరగాలి అనేటువంటి మనస్తత్వం కలిగీ ఉంటారని చెప్పుకోవచ్చు, తమ కోపం చల్లబడేవరకు వీళ్లు ఒంటరిగా ఉంటారు.

ఈ కుంభరాశివారికి కలిసొచ్చే రోజులు సోమవారం, గురువారం, శుక్రవారం, సెనివారం, అలాగే కలిసొచ్చేటువంటి కలర్స్ ఏంటంటే ఎల్లో, వైట్, రెడ్, బ్లూ కలర్స్ కలిసి వస్తాయి, లక్కీ నంబర్సు చూసుకుంటే 3,5,6,8.

అలాగే ఈ కుంభరాశివారికి నరదృష్టి, నరగోష ఎక్కువగా ఉంటుంది, నరగోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం లేక మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం.

అందరూ మనకి సెత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూఉండడం, ఏ పనికూడా విశేషంగా కలిసిరాకపోవడం, మీకు వందరూపాయలు రావలసినచోట పదిరూపాయలు మాత్రమే మీ చేతికి రావటం లేక మీ కష్టానికి తగీనటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీకూడా నరగోషకి మూలముగా చెప్పుకోవచ్చు.

ఈ నరగోష అనేటువంటిది దాదాపుగా ఈ కుంభరాశివారి అందరికీ ఉంటుంది, ఎవరైనా పైన ఉదహరించినటువంటి భాదలు పడేవారు ఆంజనేయస్వామి వారియొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మేడలో ఆంజనేయస్వామి వారియొక్క లాకెట్ వేసుకోవాలి.

అదేవిధంగా ఏదైనా నరసింహస్వామివారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచం తెచ్చుకొని నాగాసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజూ పెట్టుకుంటూ ఉండాలి, అలాగే ఆంజనేయస్వామి వారియొక్క సింధూరం ప్రతిరోజూ బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి.

అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి, మగవారైతేకనుక ఎరుపురంగు మొలతాడును నడుముకు ధరించండి, అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపుదారాన్ని మొలతాడుగా కట్టి ఎడమఅరికాలుకు కాటుకబొట్టు పెడుతూఉండాలి, మగవారికి అయితే కుడివైపు అరికాలుకు కాటుక బొట్టు పెట్టాలి, కుంకుమబొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి.

ఈ విధంగా చేయటంవలన మీకున్నటువంటి ఈయొక్క నరగోశ,నరపీడ అనేటటువంటివి తగ్గుముఖం పడుతుంది, అదేవిధంగా మనం బయట కిరాణా దుఖాణాల్లో స్పటిక అని ఒకటి దొరుకుతుంది, అది తెచ్చుకుని ఒక ఎరుపురంగు బట్టలో కొంచెంపసుపు,కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి, మీ ఇంటిగుమ్మానికి వేలాడదీయటంవలన నరగోశ అనేది తగ్గుతుంది.

ఈ కుంభరాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి, ఇలా దీపం వెలిగీంచి దేవుడిని ప్రార్థించడంవల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి, ఈ కుంభరాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి, ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది, మెరిసే కాంతి దుష్టసెక్తులను దూరం చేస్తుంది, అలాగే తులసిముందు కూడా దీపం వెలిగీస్తే సకలశుభాలు కలుగుతాయి.

అలాగే కుంభరాశివారు ఎప్పుడూకూడా గోమాతను ఆరాధించండి, ఎందుకంటే గోమాత అంటేగనక సకల దేవతా స్వరూపం, గోమాతను ఆరాధించడంవల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకలదేవతలయొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *