మరో 48 గంటల్లో తులారాశివారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ముఖ్యంగా తులారాశిలో పుట్టినవారు ఈ 2024వ సంవత్సరం డిసెంబరు 25వ తేదీనుంచి మిఠాయిలు పంచి పెట్టేటువంటి ఒక శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం తులారాశివారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులరాశి, రాశి చక్రంలోని ఏడవ రాశి. చిత్తా నక్షత్ర 3, 4 పాదాలు, స్వాతి నక్షత్ర 4 పాదాలు, విశాఖా నక్షత్ర 1, 2, 3 పాదాలు కింద జన్మించినవారు తులారాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ తులరాశివారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో, ఈ రాశులన్నింటిలోకూడా ఎంతో ఓర్పు, అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు, సహనం ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు, సహనం కోల్పోతారో, అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశివారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారునమ్ముకోరు. అందువల్ల ఈ తులారాశివారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంకూడా జరుగుతుంది. అలాగే వీరి ఏదైతే సాధించాలను కుంటున్నారో అటువంటిదే ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడంకూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీ నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీకూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులరాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. సాధించి ముందుకు సాగుతారు డిసెంబర్ 25వ తేదీనుంచి మీకు జరగబోయే శుభవార్తలు గురించి విన్నట్లయితే కచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిని పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరిప్పుడు వినబోతున్నారు.
అలాగే తులరాశివారు ముఖ్యంగా దైవారాధన చేయడంకూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజుకూడా దైవారాధన చేస్తే కచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్క వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి.
ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటగా మీరు దైవారాధన చేయడం రెండోది మిమ్మల్ని మీరు నమ్మడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నవాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశివారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలోనే విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడంకూడా మొదలు పెట్టండి.
అలాగే తులారాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్ లో ఉండిపోవడం, అలాగే మీలో మీరే సందేహపడిపోయి ఉండపోవడం అంటే మీరు ఏదైనా దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడంద్వారా మీరు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్నికూడా నమ్మటం మొదలు పెట్టండి. అదే విధంగా మిమ్మల్ని మీరు నమ్మడంకూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. అలాగే తులారాశివారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడంద్వారా మీకా పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యేవరకు ఎవరితోకూడా షేర్ చేసుకోకండి.
తులారాశివారు జీవితంలో ప్రతి దాన్నికూడా నవ్వుతూ సవాలుగా తీసుకుంటూ ముందుకు వెళ్లిపోతారు. అలాగే ఏదైనా లోపం జరిగినప్పుడు ఇతరులను ఎప్పుడుకూడా తప్పుపట్టారు. తను జాగ్రత్తగా ఉండకపోవడం, తను సరిగ్గా ఆలోచించకపోవడంవల్ల లోపం జరిగిందని నింద తనమీద వేసుకుంటారు వీరుకున్నటువంటి మంచి మనసు ఇంకా ఎవరికీ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ రాశివారు తను అభివృద్ధి చెందాలని అనుకోరు. తన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులుగానీ, వ్యాపారగానే ఇతర పరంగాగాని అందరు అభివృద్ధి చెందాలనికుంటారు. వాళ్ళ కేదైనా అవకాశంవస్తే సర్లే మనం చేసుకుందాం అనికాకుండా ఇంకొక పదిమందికూడా దాని గురించి చెప్పి బాగుపడమని సలహా ఇస్తారు. ఇలాంటి మంచి మనసున్న తులారాశివారికి కూడా నమ్మక ద్రోహలు ఎదురవుతూ ఉంటాయి.
తులారాశిలో జన్మించినవారు ఎవరైతే ఉన్నారో నూటికి 95% మంది ఈ సంఘటన ఎదుర్కొని ఉంటారు. మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైతే అభివృద్ధికి వచ్చారో వారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడంగానీ లేదంటే కృతజ్ఞత లేకుండా మీతో మాట్లాడి సందర్భాలుకూడా కచ్చితంగా మీరు చూసే ఉంటారు. నూటికి 95% మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎప్పుడుకూడా అవతల వాళ్లు అలా చేసినందుకు తులారాశివారు బాధపడడం జరగదు. పోనీలే ఒకరు మనవల్ల ఆనందంగా ఉన్నారు. మనవల్ల వాళ్ళు అభివృద్ధి చందుతున్నారు. ఏం చేసిన ఆ దేవుడే చూసుకుంటారనే అంతా ఆ దైవ మీదే భారం వేస్తూ ముందుకు వెళ్లిపోతారు. మీకున్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినాకూడా వాటిని ఎదుర్కొని తెలివి శక్తి కూడా నిరంతరంకూడా ఆ దైవం మీకు అందిస్తూ ఉంటుంది.
అయితే తులారాశికి సంబంధించిన వ్యాపారాలు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఎవరికీ చెప్పకండి. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకుంటే, ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే బయటకు చెప్పండి.
ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం కాస్త ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఇంట్లో సమస్య అయినా మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకుని నిరంతరం ఒంటరిగా ఉండటం ఏదో కోల్పోయినట్టుగా ఉండటం చేయకండి. ఈ విధంగా ఉండటంవల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మికు ఎలాంటి ఉపయోగం ఉండదని మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళ బాధపడే పరిస్థితులుకూడా కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు జరిగినవన్నీ మర్చిపోయి ప్రోత్సాహంతో మీకు నచ్చింది ఏదైతే ఉందో మీకు ఎందులో ఇంటరెస్ట్ ఉందో దాన్ని కొనసాగించడం మంచిది. ఎందుకంటే రాబోయే నూతన సంవత్సరం ఏదైతే ఉందో విద్యపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్లడానికి టార్గెట్ అయితే ఏర్పాటు చేసుకోండి.
ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశివారు మాత్రం ఒత్తిడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం అయ్యో మనం ఎంత చేసిన అవతల వాళ్ళు మనల్ని గుర్తించట్లేదు, మన కంటే మన తోటివారు అసలు ఏమి కష్టపడడం లేదు, వారికి గుర్తింపు లభిస్తుంది ఏంటి ? మనకి విలువ లేకుండా పోతుందన్న భావన ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఎప్పటికైనా సరే మీ కష్టానికి తగ్గ ఫలితం ఐతే మీరు పొందుతారు. మీరు ఉద్యోగం విషయంలో మాత్రం ఎవరి గురించి ఆగిపోవడం గానీ, అంటే ఉద్యోగాలు మారాలంటే మారిపోపోండి, ఎవరి గురించి ఆలోచించే ఆగిపోయినట్లయితే మీరు భవిష్యత్తులో బాధపడే పరిస్థితి కనిపిస్తోంది. ట్రాన్స్ఫర్లకు అనుకూల ప్రదేశాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ ఇంక్రిమెంట్ విషయంలో మీరు కొంచెం ఓర్పుతో ప్రయత్నించకోవాల్సి ఉంటుంది. తొందరపడి ఎవరిని గబుక్కున నోరు జారకండి. ఈ రాశివారికి సంబంధించినది అంటే చెరువుల వ్యాపారం చేస్తూ ఉంటారో చెరువులు, వ్యాపారాలు అనేవి చాల అనుకూలంగానే బాగా కనిపిస్తుంది. అయితే ఈ తులారాశివారికి అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీరు ఎంతో కాలంగా కోర్టులో ఉండేటటువంటి వంశపారంపర్య ఆస్తులు గురించి గాని, వివాహ విషయాల గురించి గానీ అంటే ప్రేమ విషయాలకు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో ఈ విషయాలపట్ల సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యాపారాలన్నీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగడంవల్ల ఎంతో ఆనందంగా ఈ శుభవార్త అయితే వెంటనే మీరు వింటారు.
ఈ రాశివారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశివారు అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామినుంచి చాలా అద్భుత మైనటువంటి సహకారం లభిస్తుంది. ఎప్పుడుకూడా మీ పరిస్థితిని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా మలుచుకుంటారు. అలానే మీ యొక్క సంతాన బాధ్యత కూడా చాలావరకు మీ జీవిత భాగస్వామి చూసుకుంటారని చెప్పవచ్చు. వ్యాపారపరంగాగానీ, కుటుంబపరంగాకానీ ఎంతోమంది మిమ్మల్ని ఎదురించడం కానీ లేకపోతే మిమ్మల్ని వెనక్కి లాగడంగాని ప్రయత్నించిన నిలబడే ఏకైక వ్యక్తి జీవిత భాగస్వామిగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా ప్రేమాభిమానాలు పొందుతారు. అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతారు.
ఈ రాశికి సంబంధించినవారు ఎంతో కాలంగా విహారయాత్రకి కొన్ని ప్రదేశాలకి వెళ్లాలనుకుంటారు. నిరంతరం ఆ కారణాలవల్ల వాయిదాలు వేసుకుంటూవస్తున్నారు. అయితే మీ కుటుంబంతో యాత్ర చేసి సంతోషంగా గడుపుతారు. అయితే తులారాశివారికి చాలా అనుకూలంగా ఉండడంవల్ల మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక నరదృష్టి పెట్టేవారుకూడా ఎక్కువ మంది ఉన్నారు. అయితే చాలామంది వీటి నమ్మరుకానీ అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుందండి.
ఈ రోజుల్లో నరదృష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనగానే దరిద్ర స్థితికి చేరిపోయే స్థితిని ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి రోజువారీ జీవితంలో చిన్న చిన్న పరిహారం ఐతే కచ్చితంగా పాటించికోవాలి. ఈ నెలలో వచ్చే శనివారం ఏదైతే ఉందో, అమావాస్య ఏదైతే ఉందో కచ్చితంగా ఆ రోజుల్లో కళ్ళు ఉప్పుతో స్నానం చేసినట్టుఅయితే, అంటే కళ్ళు ఉప్పుతోను నీటిలో వేసుకుని స్నానం చేయండి. వ్యాపార ప్రదేశాలు కాని తరుచు నరదృష్టి యంత్రాలనేవి కడుతూ, మారుస్తూ ఉండాలి. అలానే బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడు కూడా పెద్దల ఆశీర్వాదంకానీ లేదా ఇష్ట దైవాన్ని తలుచుకుని బయటకు వెళ్లడం చాలా మంచిది. ఇదండీ తులారాశివారి గురించి విన్నారు కదా.
