Loading...
loading

మిథునరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

  • Home
  • Blog
  • మిథునరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

మిథునరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

మిథునరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు, మరియు పునర్వసు 1, 2,3 పాదములలో జన్మించినవారు మిథునరాశికి చెందుతారు. మిధునరాశి యొక్క గ్రహాదిపతి బుధుడు. 

మిథునరాశిలో జన్మించినవారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి, మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి, బుధుని అనుగ్రహంకొరకు వృషభరాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహరాలను క్రమం తప్పకుండా పాటించండి.

మిధున రాశికి చెందిన  లేత పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కలిసివచ్చే రంగులు. పచ్చరంగు వస్త్రాలు ధరించాలి. ఇది సాధ్యం కాకపోతే కనీసం పచ్చరంగు రుమాలు చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది. ఈ రంగుల వస్త్రాలను ధరించటంద్వారా మానసిక ప్రశాంతతని పొందగలరు.

బుధవారంరోజు కనకదుర్గమ్మ ఆలయంలో పచ్చరంగు గాజులు అమ్మవారికి ఇవ్వండి. సాధ్యమైతే 9మంది కన్యలకు పచ్చరంగు గాజులు లేదా బట్టలు బహుమతిగా ఇవ్వాలి.

బుధవారంనాడు ఆవుకి పచ్చిగడ్డి మేత వేయాలి. లేదా దానం చేయాలి.

ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలూ,స్తోత్రాలు పఠించండి.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. మిధున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరికి కలిసివచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసివచ్చే రోజుగానే ఉంటుంది.

మిథునరాశివారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథునరాశి మృగశిర నక్షత్రంలో జన్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించినవారు పంచముఖి రుద్రాక్షను  ధరించుటవలన శుభ ఫలితాలను పొందుతారు.

బుధవారంనాడు ట్రాన్స్ జెండర్లకు మీకు తోచినంత డబ్బులిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి.  పొరపాటునకూడా ట్రాన్స్ జెండర్లకు కోపం తెప్పించకూడదు.

బుధవారంనాడు 5 శమీ పత్రాలను గణేశుడికి సమర్పించాలి.  విఘ్నేశ్వరుడు అనుగ్రహం పొందడమే కాకుండా విద్య, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ విధంగా చేయడంవల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేయగలరు.

బుధుని అనుగ్రహం పొందడానికి ఇంట్లో తులసి మొక్కను నాటాలి. ఆ చెట్టుకు రోజూ పూజలు చేయాలి. వీలైతే తులసి మొక్కను కూడా దానం చేయాలి.

బుధవారంనాడు ఒక రాగినాణెం తీసుకొని ప్రవహించే నీటిలో వేయాలి. అదేవిధంగా ప్రవహించే నీటిలో ఖాళీ మట్టి కుండను వేసినా బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది.

బుధవారం ఉపవాసం ఉండటంవల్ల వ్యాపార,ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఉపవాసం పాటించడం ద్వారా జ్ఞానాన్ని పొందే వరం లభిస్తుంది. ఉపవాసం చేయడంవల్ల, బుధగ్రహానికి శాంతి కలుగుతుంది. తద్వారా సంపద,విద్య,వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

వీలైనప్పుడల్లా శనిదేవుడిని ఆరాధించండి.

వ్యాపారంలో విజయంకోసం, వ్యాపారస్థలంయొక్క దక్షిణదిశలో ఎరుపురంగు జాడీని ఉంచండి.

ఉద్యోగస్తులు, పనులలో అనుకూలతకోసం ఒక పసుపు కొమ్మును, పసుపురంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టుకోండి.

అనుకూలమైన దాపత్య జీవితంకొరకు, మీ పడకగదిని ఎరుపు మరియు పసుపురంగులతో అలంకరించండి.

అనేక విషయాలలో అనుకూలతకొరకు మిథునరాశివారు గోవులను పూజించి సేవించాలి.

మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి, మీ స్థోమతప్రకారం దానధర్మాలను చేయండి. మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతారు.  కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ వుండండి. 

నీటిలో ఎక్కడైనా చేపలు ఉన్నట్లు మీకు తెలిస్తే, అటువంటి సరస్సులు, కొలనులువంటి వాటియొక్క నీటిలో ఆహారాన్ని విసిరి చేపలకు ఆహారం ఇవ్వండి. నీటివనరులలో నివసించే చేపలకు ఆహారాన్ని అందించడంద్వారా, మీరు మీ సమస్యలనుండి మరియు దోషాలనుండి బయట పడతారు.

మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే, అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి. ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది. పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. ఈ వస్తువులను దేవాలయాలలో దానం చేయడంద్వారా, మీకు అపారమైన దైవానుగ్రహం లభిస్తుంది.

మీకు అవకాశం వున్నప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు  ఔషధాలను ఉచితంగా అందించండి.  నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడంద్వారా, మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితులనుండి మీరు రక్షింపబడతారు.

ఒక పచ్చరంగు గాజు బాటిల్ తీసుకోండి, బాటిల్‌ను గంగా జలంతో నింపండి. గంగాజలంతో నింపిన ఈ పచ్చరంగు గాజు బాటిల్‌ను ఏదైనా వ్యవసాయ భూమిలో పాతిపెట్టండి. ఈ తంత్రం చేయడంవలన, మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతుంది.

మీ ఇంట్లో ఎప్పుడూ మనీప్లాంట్ ఉంచవద్దు. మనీప్లాంట్లు కూడా మీకు దురదృష్టాన్ని తెస్తాయి.

వీలైనప్పుడల్లా 12 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్వీట్లు,చాక్లెట్లు లేదా ఏదైనా ఇతర తీపి వస్తువులను ఇవ్వండి. పిల్లలను ఎంతో ప్రేమతో, జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చేయడంవలన మీకు అన్ని పనులలో మంచి అనుకూలత లభిస్తుంది. 

మీ ఇంటి పైకప్పు పై, బరువైన మట్టిపాత్రలలో, పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడంకొరకు నీటిని ఉంచండి.  మీ ఇంటి బయట, నేలపై సంచరించే జంతువులకొరకు, చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెట్టండి. 

అదేవిధంగా, మీ ఇంటి పైకప్పు పై, పక్షులకొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టిపాత్రలలో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట, శుభ్రమైన ప్రదేశంలో, జంతువులకొరకు ఆహారాన్ని ఉంచండి.  మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి.  చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ వుండండి. 

మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే, మీకు  ఎంతో పుణ్య కర్మ లభిస్తుంది.  జంతువులకు, పక్షులకు, క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు,కష్టాలు ఇలా భూతబలివలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది.

బుధుని అనుగ్రహంకొరకు బుధుని బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి బుధవారం 9 సార్లు పఠించండి.

బుధగ్రహంయొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. బుధుని అనుగ్రహంకొరకు బుధవారంరోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ వెంకటేశ్వరస్వామివారిని పూజించాలి. శ్రీమహావిష్ణువు,వెంకటేశ్వర స్వామివారి  దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి.  ఆలయంలో కొబ్బరికాయ,అరటిపళ్ళు,పూలు,అగరబత్తి, కర్పూరమువంటివి సమర్పించి బుధుని అనుగ్రహంకొరకు, అనుకూలత కొరకు ప్రార్దించాలి. శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి.  శ్రీమహావిష్ణువుయొక్క ఇతర మంత్రాలను, స్తోత్రాలనుకూడా పఠించాలి. 

పెసలుతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి.  ఆవుకు పచ్చగడ్డి,తోటకూర మరియు ఇతర ఆకుకూరలు ఆహారంగా ఇవ్వాలి.  విద్యార్థులకు పుస్తకాలను దానం చేయాలి. గోవుకు పెసలును నీటిలో నాన పెట్టి తినిపించాలి.  బుధవారంనాడు నియమంగా ఉండాలి. బుధవారంరోజున ఉపవాసంకూడా ఆచరించవచ్చు.

బుధుని అనుగ్రహంకొరకు, బుధవారాలలో చిన్న సైజులో ఉండే పండ్లు,ఆవు పేడ,గోరోచనము,తేనే,ముత్యములు, బంగారము, వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి.  బుధవారాలలో ఆకుపచ్చరంగు దుస్తులను ధరించాలి.  

బుధుని అనుగ్రహంకొరకు, శుభతిథి వున్న బుధవారాలలో పెసలు,పచ్చనిరంగు వస్త్రము, వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి, తమలపాకులు వక్కలు,అరటి పండ్లు దక్షిణపెట్టి దానం ఇవ్వాలి.

బుధవారంరోజున పంచదార లేదా ఏలకులు దానం చేయడంవల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీరు కొత్త బట్టలు కొనుగోలు చేసినప్పుడు, మీరు వాటిని మొదటిసారి ధరించేముందు వాటిని ఉతికి ఆ తరువాత ధరించండి.

మీ సోదరీమణులు,అత్తలపట్ల గౌరవంగా ఉండండి. మీ కుమార్తె లేదా ఇతర చిన్నారులపట్ల శ్రద్ధ వహించండి.

నానబెట్టిన పచ్చి శనగలను పక్షులకు తినిపించడంద్వారా జాతకంలో బలహీనమైన బుధుడిని శక్తివంతం చేసుకోండి.

ప్రత్యేకించి బుధవారంనాడు పూర్తి భక్తితో దానాలు చేయండి. జ్యోతిష్యశాస్త్రంప్రకారం దానం చేయడం, మంచిపనులు చేయడంవల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి .

దక్షిణావర్తి శంఖాన్ని శివ మరియు విష్ణు ఆలయాలకు బహుకరించాలి.

వీరు గృహమునందు దక్షిణావర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి.

గ్రామమునందుగల శక్తి దేవాలయాలయందు శ్రేష్టమైన ముత్యాల హారాన్ని అమ్మవారి మూలవిరాట్టుకు బహుకరించాలి.

సువాసనగల పుష్పాలను మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను శివాలయంలో దానం చేయాలి.

ఆకుపచ్చరంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారంనాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి.

బుధవారంనాడు కొంత డబ్బును దాచిపెట్టండి. దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి. సంప్రదింపులు,కొత్త నిర్ణయాలు, రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున గణేశుడిని అలాగే విష్ణువునుకూడా పూజించడంవల్ల, మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది.

బుధవారం ఆహారం తీసుకునేముందు, కొన్ని తులసిఆకులను గంగాజలంతో కలిపి తీసుకోవాలి. ఆ తరువాత బుధ గ్రహానికి సంబంధించిన ఆకుపచ్చగడ్డి,పెసర్లు, నీలంపువ్వులు, ఆకుపచ్చ దుస్తులును దానం చేయాలి. ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X