Loading...
loading

మేషరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

  • Home
  • Blog
  • మేషరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

మేషరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

మేషరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1 వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు. మేషరాశివారి చిహ్నము గొర్రె. మేషరాశివారి అధిపతి కుజుడు.

మేషరాశికి చెందినవారిపై కుజగ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరికి మంగళవారం కలిసివచ్చే రోజుగా చెప్పవచ్చు.దీనితోపాటు గురువారం,ఆదివారం కూడా కలిసివచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసిరాదు.

మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 9 మరియు 1.

మేషరాశికి చెందినవారు ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే, వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపురంగు రుమాలును చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది.

 

మేష రాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి, మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మేషరాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహరాలను క్రమం తప్పకుండా పాటించండి.

ఆడంబరము లేని పూజలు, గుప్తదానాలు, మనోధైర్యము మేలు చేస్తాయి.  తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలసి వస్తాయి. సుభ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీపూజవలన సమస్యలను అధిగమించగలరు.  గురువారము చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి.

గురువారమురోజు ఆలయంలో పసుపురంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి.  గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి.

మంగళ,శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమంతునికి చమేలీ లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి.

ఎరుపురంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది.

ఆలయంలో పూజారులు,పెద్దలు,మీ తల్లి తండ్రులు,  మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారినుండి ఆశీర్వచనాలు తీసుకోండి.  అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లి తండ్రులు, మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచినవిధంగా సేవ చేయండి. 

మీరు ప్రతినెలా సుందరకాండ పారాయణం చేస్తే, మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది.

శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్లనువ్వులు దానం చేయండి.

మీ కుడిచేతికి వెండి రిస్ట్‌బ్యాండ్ లేదా బ్రాస్‌లెట్ ధరించండి.  మీ కుడిచేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటిది, మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా వున్న వెండి బ్రాస్‌లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి, అన్ని విషయాలలో మీ విజయావకాశాలను మెరుగు పరుచుకోవచ్చు.

మీరు ఎవ్వరినుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనాసరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి.

తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలోనూ మీరు ఎప్పుడూ పాల్గొనకూడదు. అనగా, మీరు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం పని చేయకూడదు.

మీ ఇంట్లో లేదా లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మచెట్టును నాటవద్దు.

మీ ఇంటి పైకప్పుపై, బరువైన మట్టి పాత్రలలో, పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడంకొరకు నీటిని ఉంచండి.  మీ ఇంటి బయట, నేలపై సంచరించే జంతువులకొరకు చిన్న పాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెట్టండి. 

అదేవిధంగా, మీ ఇంటి పైకప్పుపై, పక్షులకొరకు ఆహార ధాన్యాలను మట్టి పాత్రలలో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట, శుభ్రమైన ప్రదేశంలో, జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి.  మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి.  చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ వుండండి. 

మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే, మీకు  ఎంతో పుణ్య కర్మ లభిస్తుంది.  జంతువులకు, పక్షులకు, క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి.  జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు, కష్టాలు  ఇలా భూతబలివలన లభించిన పుణ్య కర్మతో తొలగిపోతుంది.

అన్నదమ్ములకు, అన్నదమ్ముల వరుస అయ్యేవారికి సహాయం చేయాలి.  వారి మాటకు విలువు ఇవ్వాలి. 

స్ర్తీలు ఎర్రని కుంకుమ, ఎరుపురంగు గాజులు నిత్యం ధరించాలి. 

కందులు  లేదా కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి. అలాగే కందిపప్పును నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి.

కుజుని అనుగ్రహంకొరకు కుజుని బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం 19 సార్లు పఠించండి.  

కుజగ్రహంయొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం రోజులలో, షష్టి తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని  పూజించాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. మంగళవారం రోజున నియమంగా ఉండాలి.  మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. 

మంగళవారాలలో మరియు ప్రతినెల ఆర్ద్ర నక్షత్రం వున్న రోజులలో ఓం రుద్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.  ప్రత్యేకించి మంగళవారాలలో యమగండ కాలం సమయంలో ఉదయం 9.00 నుండి 10.30 మధ్య మరియు ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రం ఉన్నరోజులలో శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం.  శివాలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్ధించాలి.   కేతు గ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం, కొంత వరకు కుజ గ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది.

కుజుని అనుగ్రహం కొరకు, మంగళవారాలలో  మారేడు పట్టా, ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి. మంగళవారాలలో ఎరువు రంగు దుస్తులను ధరించాలి.  

కుజుని అనుగ్రహంకొరకు, శుభ తిథి వున్న మంగళవారాలలో కందులు, బెల్లము, ఎర్రని వస్త్రము, రాగి, వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి, తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. 

కుజుని అనుగ్రహంకొరకు, ఏడు ఆదివారాలు సుబ్రమణ్యస్వామి ఆలయంలో 70 ప్రదక్షిణాలు చేయాలి. షష్టి,సుబ్రహ్మణ్యషష్టి, కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయాలి.

కుజశ్లోకం రోజు 70 సార్లు జపించాలి. కుజజపం చేయించి కందులు,ఎర్రనివస్త్రంలో చుట్టి దక్షిణ, తాంబూలం ఇవ్వాలి.

సుబ్రహ్మణ్యస్వామికి ఏడు మంగళవారాలు ప్రదక్షిణ చేయాలి. ఎరుపురంగు పుష్పాలతో మాలకూర్చి సుబ్రహ్మణ్యస్వామికి సమర్పించాలి.

బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించాలి. మంగళవారంరోజున ఎర్రనికుక్కకు ఆహారం వేయాలి.

ఎర్రచందనం,కందులు,దానిమ్మ పండ్లు ఎరుపురంగు వస్త్రాలతో చుట్టి సుబ్రమణ్యస్వామి ఆలయంలో దానం ఇవ్వాలి.

రాగిపాత్రలో నీరు తాగడం, రాగిపాత్రలు వాడటం మంచిది. అమ్మవారికి ఎరుపురంగు చీర సమర్పించాలి. నవగ్రహ ఆలయంలో కుజుడికి ఎరుపురంగు పూలు,దానంగా ఇస్తే మంచిది.

అష్టమూలికా తైలంతో సుబ్రమణ్య స్వామికి దీపారాధన చేయాలి. శని,ఆది,సోమవారాల్లో రాహుకాలంలో ఇలా చేయాలి. దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులు వాడాలి.

సుబ్రమణ్యమాలా మంత్రం 42 రోజులపాటు రోజుకు ఒకసారి పారాయణం చేయాలి.

సుబ్రమణ్య కరవలాంబ స్తోత్రం 11 రోజులపాటు రోజుకు 80 సార్లు చదవాలి.

శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి. ఏడు మంగళ వారాలు ఇలా చేయాలి. ఉదయం 7 గంటలలోపు ఇలా చేయించాలి.

ఆదివారం రాహుకాలం సాయంత్రం 4.30 నుంచి 6 గంటలలోపు నిమ్మ కాయ డొప్పలో దీపారాధన చేయాలి. తదుపరి సుబ్రమణ్య అష్టకం చదవాలి.

మేషరాశివారు, వారి రాశి ననుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించినవారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించినవారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృత్తికా నక్షత్రం లో జన్మించినవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. 

జాతకదోష నివారణకొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి.

వీధి కుక్కలకు ఆహరం అందివ్వాలి.  కొడుకు వరుస అయ్యేవారిని ప్రేమగా చూసుకోవాలి.  నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయాలి. దేవాలయములు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయాలి. అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిపించాలి.  ఉలవలతో చేసిన ఆహార పదార్ధాలు పేదలకు పంచాలి.  ఉలవలను నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి.  మంగళవారం నాడు నియమంగా ఉండాలి.  మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X