Loading...
loading

మేష రాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీ గుండె ఝల్లుమంటుంది.

  • Home
  • Blog
  • మేష రాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీ గుండె ఝల్లుమంటుంది.

మేష రాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీ గుండె ఝల్లుమంటుంది.

మేషరాశివారి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు మరి వాళ్ళు ఎవరో తెలిస్తే నీ గుండె ఝల్లుమంటుంది, అంటే వారు మీకు బాగా కావాల్సిన వార, అసలు వారు మీకు ఎందుకు రహస్య శత్రువులుగా మారారు? ఈ వివరాలు అన్నీ కూడా. ఇప్పుడు  మనం తెలుసుకోబోతున్నాం.

మేషరాశి అనేది రాశి చక్రం లో మొదటి రాసి అశ్వినీ నక్షత్రం 1234 పాదాలు భరణి నక్షత్రం 1234 పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం లో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేష రాశి వారికి అధిపతి కుజుడు. మేషరాశి వారు శస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించి వంటి వ్యాపకాలు వీళ్లకే ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కొత్త పరికరాలు తయారు చేయడంలో వీరు ఆరితేరి ఉంటారు. అందరూ ఒకరకంగా ఆలోచిస్తే వీళ్లు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులుకూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి, చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి, అలాగే ఎక్కడ కూడా మాట పడకుండా ఉండాలి, అనేటువంటి  ఆలోచనతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు.

ఈ రాశివారు చాలా కష్టాలనే బాల్యంలోనే అనుభవించడంవల్ల జీవితానికి సంబంధించిన పాటలు ఎక్కువగా నేర్చుకొని ఉంటారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి. అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించికూడా మీకు చిన్న వయసులోనే అర్థమవుతాయి. కాబట్టి డబ్బు విషయంలో మేషరాశి వారు. చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి. ప్రతిదాని గురించి ఆలోచిస్తారు, అంటే రూపాయిని మనం ఖర్చు పెట్టేది, ఒక వస్తువు కోసం అది మనకి ఎంతవరకు ఉపయోగం. అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా? ఇలా అన్ని విషయాలని వారు లెక్కవేసుకుంటారు.

మేష రాశి వారు స్నేహితులకి వెనుకంజ వేయకుండా సహాయం చేస్తారు. వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు ఆపద ఉన్నారు అంటే వీళ్ళు ముందడుగు వేస్తారు, వాళ్ల కోసం ఏం చేయ డానికైనా వెనుకాడరు. ఎంత దూరమైన అంటే ఎంత ఎక్స్టెండ్ కైనా వెళతారు అన్నమాట. అలాగే ఈ మేషరాశి వారు ఒక స్త్రీ వలన మాత్రం చాలా ఇబ్బందికి గురవుతారు. ఈ స్త్రీ మీ జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో ఈ మేషరాశివారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహస క్రీడలు అంటే వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం, ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు.

మేష అంటే ఏంటి? గొర్రె పొట్టేలు ఈ గొర్రె పొట్టేలు కొండని కూడా ఢీ కొట్టడానికి వెనకాడదు. ఆకుండా దీని కొమ్ములవల్ల పగులుతుంది, విరుగుతుంది అనే ది పక్కన పెడితే. అటెంప్ట్ మాత్రం వదలకుండా చేస్తుంది. అలాంటి వారు ఈ మేషరాశివారు, ఇక అదే విధంగా చూసుకుంటే మనోధైర్యంతో సాహస నిర్ణయాలు వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువ ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునే వంటి నిర్ణయాలు వీరిని చాలా ముందుకు తీసుకువెళతాయి. ఈ మేషరాశివారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాలవల్ల మాత్రం వీరు నష్టాలు అనేవి కొన్ని చూస్తారు. అలాగే మేషరాశివారు వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా ఈ మేషరాశివారు సోమరితనాన్ని అసలు ఇష్టపడరు. ఒక రకంగా ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి, పనికి తగ్గ ఫలితం ఫలితానికి తగ్గ పని జరుగుతూనే ఉండాలి, మన అవసరానికి పని చేయాలి. ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి. ఇలాంటి మెంటాలిటీ వీళ్ళ సైకిల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట.

ఈ మేషరాశివారికి అలాగే స్వతంత్ర అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశివారు ఇండివిడ్యువాలిటీ అనే దాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదు. అంటే దానికి సంబంధించిన విషయాన్ని అస్సలు పట్టించుకోరు అనమాట. అయితే వీళ్ళకి స్వాతంత్య్రం ఇస్తే కనుక ఎలాంటి కార్యాన్ని అయినా సరే కచ్చితంగా మడత పెట్టి పక్కన పడేస్తారు. అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారు అన్నమాట. అది ఎంత కష్టం పని అయినా సరే అసలు ఈ పని అవ్వదు రా బాబు అని చెప్పి, మనం ఎవరితోనైనా అన్నమే అనుకోండి. మేషరాశివారు ఆ మాట వింటే ఎందుకవదు అండి ఖచ్చితంగా అవుతుంది, చేసి తీరుతాం చూడండి అని చెప్పి దాన్ని చేసి పక్కన పెట్టేస్తారు. అలాంటి మెంటాలిటీ ఈ మేషరాశివారి. అలాగే వీరిలో అహంకారం, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చుట్టూ చూసే వాళ్ళు అనుకుంటూఉంటారు. కానీ అలాంటి ధోరణి వీరికి అస్సలు ఉండదు. ఒక వేళ అలాంటి ఆలోచన వీరి మైండ్లోకి వచ్చిన వెంటనే, అది వీరి పతనానికికూడా దారి తీసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక వీరిని కొంచెం పొగిరంటే చాల, ఊరికె  లొంగిపోతారు.

మేషరాశికిచెందినవారు ప్రతిసారికూడా వీళ్లు చేసే ప్రతి పనిలో చాలా వరకు ఆలోచనా విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గుడ్డెద్దు చేలోపడింది, ఇది అయిపోతుంది అన్నట్టుగా విడిపోతూ ఉంటారు. కచ్చితంగా చేసి తీరుతం కదా, చేసి తీరుతాం అని మాట ఇచ్చాం కదా, ఎలా అంటే అలా చేసుకువెళ్లడమే. ముఖ్యంగా అలా చేసేస్తారు. అదేంటో కానీ వీళ్ళకి అదృష్టంతోడై రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందనమాట. వీళ్ళకి ఇలా రిజల్ట్ రావడంతో ఏం అవుతుందంటే వీళ్ళలో అహంకారం ఎక్కువగా పెరిగిపోతుంది. యెస్ నేను చెప్పాను కదా జరుగుతుందని అదే జరిగింది అని అట్లా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అట్లా చేస్తూ ఉంటారనమా,. సో. ఇలాంటి స్వభావం అనేది మేషరాశివారిని చాలావరకు ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి. ముందు బాగానే ఉంటుంది, చూసేవాళ్లకి వినే వాళ్ళకి అంత బాగుంటుంది. వీళ్ళకి కూడా ఇది అహంకారంలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని పరిణామాలు అనేవి మాత్రం వెళ్లని చాలావరకు ఇబ్బందులకు గురిచేస్తాయి అని చెప్పుకోవచ్చు.

అలాగే మేషరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విధంగా వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు అనేవాళ్లు ఉన్నారు. అసలు ఎవరు ఈ రహస్య శత్రువు? వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎందుకు ఉంటారు అంటే, ఈ మేషరాశివారికి ఉన్నటువంటి కోపంవల్ల కావచ్చు, చికాకువల్ల కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లోని వారితోనే గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవని మేషరాశివారు అంతా సద్దుమణిగాక వీళ్ల మనసులో నుంచి తీసేస్తారు, కానీ అవతలి వ్యక్తులు మాత్రం దాన్ని మనసులు అలానే పెట్టుకొని ఉంటారు. అందువల్ల వాళ్ళు శత్రువులుగా వీరికి తయారవుతారు అన్నమాట ఎప్పుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? ఎప్పుడిప్పుడు వెళ్ళని దెబ్బ కొడదామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీ శత్రువులు బయట వాళ్ళు కాదు ఇంట్లోవాళ్లే మీ బంధుమిత్రుల వాళ్ళు, ఎవరైనా కావచ్చు. అలాగే మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే మీ బంధుమిత్రుల్లో దూరపు చుట్టాలు అన్నమాట. మీరు ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్లారు, అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది, దాన్ని మీరు మర్చిపోయారు అంటే మేషరాశివారు మర్చిపోయారు, కానీ అవతల వ్యక్తి మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు. అది కుటుంబపరంగా దెబ్బతీయవచ్చు, వ్యాపారపరంగా దెబ్బతీయవచ్చు, ఆర్థికంగా కూడా దెబ్బ తీయొచ్చు, ఇలా ఏదో ఒక రకంగావల్ల కక్ష తీర్చుకోవడానికి మీద పగ తీర్చుకోవడానికి వాళ్లు శత్రువులుగా తయారవుతారు అన్నమాట. ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించగలిగితే, గుడ్. కానీ మీరు గ్రహించలేకపోతే ఏమౌతుంది అంటే, వాళ్ళు మీ దగ్గరే చేరుతారు. మీ ఇంట్లోనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీ వ్యాపారంలో మీతో పాటే ఉంటారు, లేదా మీ ఉద్యోగంలో మీతో పాటే ఉంటారు. అది ఎలాగంటే బాబాయ్ నాకు జాబ్ లేదు కదా కొంచం జాబ్ ఇప్పించ అనో, లేకపోతే పెద్దనాన్న వ్యాపారంలో నన్నుకూడా చేర్చుకోండి, కొంచం వ్యాపార మెలకువ లు నేర్చుకుంటాను అని ఎలాగైనా సరే మీ దగ్గరికి వస్తారు, మీతోనే ఉంటారు. మీకు చాపకింద నీరులా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. మీరు పతనమయ్యేవరకు నిద్ర పట్టదు. మీ శత్రువులు ఇలా ఉంటారు అన్నమాట. కాబట్టి మేషరాశివారి దుందుడుకుతనాన్ని తగ్గించుకొని కోపాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తులతో గొడవ పడడాన్ని తగ్గించు కున్నారు అంటే, అప్పుడు శత్రువులు మీకు తక్కువగా ఉంటారు. ఒక వేళ శత్రువులు ఉన్న కూడా మీరు నిధానంగా మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుంటారు, కాబట్టి ఆ ప్రాబ్లం అంత పెద్దదిగా పరిగణించదు అన్నమాట. ఒక వేళ మీకు గనక పెద్ద పెద్ద గొడవలు జరిగి, శత్రువులు తయారయ్యారంటే మాత్రం, మీరు బయటపడడం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉండి మీకు రహస్య శత్రువులుగా ఉంటూ, మీ పతనానికి దారి తీసే విధంగా వీళ్లు చాలా వరకు కృషి చేస్తారన్నమాట. సో ఇలాంటి రహస్య శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయవలసిన చిన్న పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అసలు ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే, ఎవరికైనా సరే పరిహారం అనేది కచ్చితంగా ఉంటుంది. ఈ మేషరాశివారికి చెప్పబోతున్న పరిహారాలు ఏంటి అంటే, ఆడంబరం లేకుండా పూజలు, గుప్తదానాలు మనోధైర్యమే వీరికి మేలు చేస్తాయి. అమ్మో రహస్య శత్రువులు ఉన్నారు కదా, మనకు ఏమైపోతుందో ఏంటో అని భయపడాల్సిన పనిలేదు. మిమ్మల్ని మీరు మానసికంగా, మెంటల్గా బాగా ప్రిపేర్ చేసుకోండి. నాకు ఏం కాదు అని చెప్పి. తర్వాత ఓ ఆడంబరాలు చేసి పూజారి గారిని పిలిచి 10 మందిని పిలిచి కాకుండా చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజారి గారిని పిలిచి పూజలు చేసుకోండి. గుప్తదానాలు చేయండి, తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు కలిసి వస్తాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణించడం మొదలుపెట్టండి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన లక్ష్మీపూజవల్ల సమస్యలను అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజలు మీకు బాగా మేలు చేస్తాయి. శత్రువుల్ని బాగా తగ్గించేస్తాయి. మేషరాశివారు మేము చెప్పినవి చేయడానికి ప్రయత్నించండి. గురువారం ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు, మిఠాయిలు, భక్తులకు పంచండి.

గురువారం ఉపవాసం పాటించడానికికూడా ప్రయత్నించండి. మేషరాశివారు మంగళ,శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ను మరియు సింధూరాన్ని సమర్పించండి. అలాగే ఎరుపురంగు రుమాలు ఉపయోగించడం మంచిది, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంద, ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి, వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. తల్లిదండ్రులకు మీరు సేవా, ఎలా చేయాలంటే వాళ్ల కాళ్లు మొక్కడం వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని సంతోషపెట్టడం, వారితో సంతోషంగా మాట్లాడడం. ఇవాళ రేపు తల్లిదండ్రుల తో మాట్లాడే సమయంకూడా లేనటువంటి పుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. సో మీరు ఆ టైమ్ ని వాళ్ళతో స్పెండ్ చేసి, వాళ్ళని సంతోషంగా ఉంచితే అంతకంటే సేవా మరొకటి ఉండదు. వీలైతే వాళ్ళని మీ దగ్గర పెట్టుకుని వాళ్ళతో నిత్యం అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా మనం ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక పావుగంట వాళ్ళతో కేటాయిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు, ఈ ప్రపంచంలో కాబట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోండి. అలాగే మేషరాశివారు ప్రతి నెలా సుందరకాండ పారాయణం చేస్తే ,మీ జీవితంలో ఆరోగ్యంతోపాటు శ్రేయస్సు కూడా మీకు లభిస్తుంది.

శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. ఇలా చేయడంద్వారా మీ రహస్య శత్రువులనుకూడా మీరు అధిగమించ గలుగుతారు. మీ రహస్య శత్రువులు, ఎవరైనా ఉంటే, అది మీకు తెలుస్తుంది. వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *