Loading...
loading

వృశ్చికరాశివారి లక్షణాలు, గుణగణాలు

  • Home
  • Blog
  • వృశ్చికరాశివారి లక్షణాలు, గుణగణాలు

వృశ్చికరాశివారి లక్షణాలు, గుణగణాలు

వృశ్చికరాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!

విశాఖ నక్షత్రం 4 వ పాదం, జ్యేష్ఠా నక్షత్రం 1,2,3,4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1,2,3,4 పాదములలో జన్మించినవారు వృశ్చికరాశికి చెందుతారు. 

వృశ్చికరాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చికరాశి ఎనిమిదవది. లక్షణ రీత్యా ఈ వృశ్చికరాశి స్థిరమైనది. అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు.

వృశ్చికరాశివారిది జల స్వభావము అయినందువల్ల బయటపడకుండా పనులు చక్క బెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చికరాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్క బెడతారు. ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు.

వృశ్చికరాశివారి గురించి ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు.  అంటే దానియొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకుదెబ్బ తీస్తారు.  కావున ఈ రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.

వృశ్చికరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు.  చూడటానికి అందంగా ఉండటమే కాదు,  ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు.  వృశ్చికరాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికరాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు.

వృశ్చికరాశివారికీ భూమి,వాహనము,యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారివలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు. జీవితములో మంచిస్థితికి రావడానికి ఇది కారణము ఔతుంది. జీవితములో ఎదగక పోవడానికి ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికముగా ఉండడానికి ఇదే కారణము.

వృశ్చికరాశివారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితములో మంచికి దారి తీస్తాయి. సహోదర, సహోదరీ వర్గము ఎదుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరిపట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు ఔతారు.

వృశ్చికరాశివారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచిపోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి.

వృశ్చికరాశివారు దూరప్రాంత వ్యాపార వ్యవహారాలమీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడము వలన జీవితములో చక్కని మలుపుకు దారి తీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు.

వృశ్చికరాశివారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితులవలన ఎదురుచూసిన సహాయము అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవాకార్యక్రమాలు పేరుని, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజాసంబంధాలు వృత్తిఉద్యోగాలకు ఉపకరిస్తాయి.

వృశ్చికరాశివారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులవుతో వైరము, స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి.

వృశ్చికరాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు.  దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది.  వృశ్చికరాశిలో జన్మించినవారు  స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు.  స్నేహితులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్టసుఖాలనుకూడా పంచుకుంటారు.

వృశ్చికరాశిలో జన్మించినవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం.  అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు.

వృశ్చికరాశివారికి అధిక మైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీళ్లది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వృశ్చికరాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది.

వృశ్చికరాశివారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజములో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చికరాశివారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావము వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికరాశివారికి కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరటంవల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించినవారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించి  పోయే మనస్తత్వాన్ని వీళ్లు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయటాన్ని, సంచరించటాన్ని ఇష్టపడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

వృశ్చికరాశివారిని ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే, వృశ్చికరాశివారు స్వార్ధపరులు కారు, పరోపకారం చేయువారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది.

వృశ్చికరాశివారు అన్నివేళలా పనిచేయడానికి సిద్ధంగా వుంటారు.  జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు,విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి.

వృశ్చికరాశివారు జీవితభాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం.  ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు.

వృశ్చికరాశివారికి దేవుడిమీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణంవలన ఎలాంటి పరిస్థితులలోనైనా నిరుత్సాహ పడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. 

వృశ్చికరాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు.  వృశ్చికరాశివారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువలన కొందరు వృశ్చికరాశివారిని ద్వేషిస్తారు.

వృశ్చికరాశివారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చికరాశివారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు.  వృశ్చికరాశివారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు.

వృశ్చికరాశివారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్యపెట్టకుండా అభిప్రాయాలను అమలు చెయ్యడము నష్టాన్ని కలిగిస్తుంది. సంఘవ్యతిరేక శక్తులతో సంబంధాలవలన ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబసభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగి పోతుంది.

వృశ్చికరాశివారు గురు మౌడ్యమి, శుక్ర మౌడ్యమి,గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము. వృశ్చికరాశివారు సుబ్రహ్మణ్యస్వామని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానము చేసిన చాలా మంచి ఫలితాలు లభిస్తుంది.

శరీరం & ఆరోగ్యం: వృశ్చికరాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసులోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది.

విద్య: ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువుపైనా ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు.

ప్రేమ సంబంధం: వృశ్చికరాశికి చెందినవారు తమ మనస్తత్వానికి అనుకూలమైనవారితో పరిచయం పెంచుకుంటారు. ముఖ్యంగా మేష,కన్యారాశివారు వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు.

ఆర్థిక స్థితి: వ్యాపారంలో రాణించటంవల్ల ఆర్ధిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. కొత్తవాహనాలు,నగలు, ఇంటి స్థలాలు కొనుగోళ్లపై దృష్టిపెడతారు. వీటి కొనుగోళ్లవల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది.

ఆదాయం మరియు అదృష్టం: ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ది సాధించటానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తుంది.

వ్యాపారం: సాఫ్ట్‌వేర్ వ్యాపారరంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్తవ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎపుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు.

గుణగణాలు: ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరినీ తమవారిగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు.

దాంపత్య జీవితం: ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడంవల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తటానికి కృషి చేస్తుంటారు.

గృహం మరియు కుటుంబం: కుటుంబసభ్యులకు ఈ రాశివారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్దనుంచి సరైన సహాయసహకారాలు అందవు. ఒకానొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకమన్నట్లు గడుపుతారు.

వ్యక్తిత్వం: వృశ్చికరాశికి చెందినవారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజజ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు.

సహజమైన బలహీనతలు: వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనతా లక్షణాలు అసూయా ద్వేషాలు. దీనికితోడు కక్షసాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరమవుతాయి. అన్నిటికీ మించి దుందుడుకు స్వభావం ఉండటం వీరి వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.

ఆరోగ్యం: గ్రహరాశుల అననుకూలతవల్ల చిన్నపాటి అనారోగ్యానికి గురవుతారు. అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం దరికి చేరదు. అయితే ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవలసి ఉంటుంది. వ్యాయామంవంటి కార్యక్రమాలను చేపట్టాలి. లేదంటే అధిక బరువు,మధుమేహంవంటి సమస్యలు ఎదురవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X