Loading...
loading

వృషభరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు

  • Home
  • Blog
  • వృషభరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు

వృషభరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు

వృషభరాశిలో జన్మించినవారికి జ్యోతిష పరిహారాలు.

కృత్తిక 2,3,4 పాదాలు,  రోహిణి 1,2 ,3,4 పాదాలు మరియు మృగశిర 1,2 పాదాలలో జన్మించినవారు వృషభ రాశికి చెందుతారు.

వృషభరాశిలో జన్మించినవారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి, మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి, శుక్రుని అనుగ్రహంకొరకు వృషభరాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహరాలను క్రమం తప్పకుండా పాటించండి.

వృషభరాశివారికి అధిపతి శుక్రుడు. కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభరాశివారు లక్ష్మీ అనుగ్రహంకోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలామంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్రము,దుఃఖము తొలగిపోతుంది. అంతే కాకుండా శ్రీలలితా సహస్రనామం చదవటం వీరికి చాలా మంచిది.  ఆధ్యాత్మిక విషయాలు సేవాకార్యక్రమాలు జీవితములో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరికి శనిదశ యోగిస్తుంది.

వృషభరాశి కృత్తికా నక్షత్రంలో జన్మించినవారు, ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించినవారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి.

వృషభరాశికి చెందినవారికి అదృష్టరంగు నీలం,గులాబీ మరియు ఆకుపచ్చ. ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలంరంగు అన్నివిధాలా శుభాన్ని చేకూర్చుతుంది.

ఈ రాశివారికి అదృష్టసంఖ్య 2,8,5. వృషభరాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరీకి కలిసివచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీనితోపాటు బుధవారం,శనివారం కూడా వీరికి కలిసివచ్చే రోజులే అవుతాయి.

ఎల్లప్పుడూ మంచి సెంటు వాడటంవలన అనేక విషయాలలో మీకు మంచి అనుకూలత లభిస్తుంది. మరియు మీ విజయావకాశాలు మెరుగుపడటం కోసం, బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే, మీ దుస్తులకు పెర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారుచేసిన బట్టలు ధరించడంవలన మీకు మంచి అదృష్టం లభిస్తుంది.

మీరు జనవరి,ఫిబ్రవరి నెలల్లో పాదరక్షలు కొనుగోలు చేస్తే, అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఎప్పుడూ పాదరక్షలు కొనకండి లేదా కొత్త పాదరక్షలు వాడకండి.

మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు. లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు. తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యం పై దుష్ప్రభావాన్ని చూపుతుంది. 

మీ ఆర్థికస్థితి అనుమతిస్తే, ఒక దేశీయ ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడంవల్ల, మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది.

మీ ఆర్థికస్థితి అనుమతించినట్లయితే, మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ, నిరుపేదలకు కానీ అప్పుడప్పుడూ అన్నదానం చేయమని చెప్పండి.

మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను,కష్టాలను,దురదృష్టాలను తెస్తాయి.

మంగళవారం పెద్ద వయస్సులో వున్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి, తాంబూలం,దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి.

భవనం లేదా నిర్మాణస్థలంలో పని చేసే మేస్త్రీలకు,  కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి.

శుక్రవారంనాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపురంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడంవల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది.

ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలనుండి ఆశీర్వచనాలను తీసుకోండి.

అమావాస్య తిథిరోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి.

మీ ఇంటి పైకప్పు పై, బరువైన మట్టి పాత్రలలో, పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడంకొరకు నీటిని ఉంచండి. మీ ఇంటి బయట, నేలపై సంచరించే జంతువులకొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెట్టండి. 

అదేవిధంగా, మీ ఇంటి పైకప్పు పై, పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలలో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట, శుభ్రమైన ప్రదేశంలో, జంతువులకొరకు ఆహారాన్ని ఉంచండి.  మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి.  చీమలు మరియు కీటకాలకోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ వుండండి. 

మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే, మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది.  జంతువులకు,పక్షులకు,క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు,కష్టాలు ఇలా భూతబలివలన లభించిన పుణ్య కర్మతో తొలగిపోతుంది.

శుక్రుని అనుగ్రహంకొరకు శుక్రునియొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. 

శుక్రగ్రహంయొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు.  శుక్రునియొక్క అనుగ్రహంకొరకు శుక్రవారంరోజులలో, అమావాస్య తిథులలో శ్రీమహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి.  శుక్రవారంరోజులలో శ్రీమహావిష్ణు సమేత మహాలక్ష్మీ ఆలయాలను,పుణ్యక్షేత్రాలను దర్శించాలి.  ఆలయంలో కొబ్బరికాయ,అరటిపళ్ళు,పూలు,అగరబత్తి, కర్పూరమువంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహంకొరకు ప్రార్ధన చేయాలి. శుక్రవారం,అమావాస్య తిథులలో శ్రీమహాలక్ష్మీ మంత్రాలను, శ్రీ కనకధారా స్తోత్రాన్ని, శ్రీసూక్తాన్ని పఠించాలి. 

వివాహంకానీ అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి.  బొబ్బర్లుతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి.  గోవుకు బొబ్బర్లును నీటిలో నానపెట్టి తినిపించాలి.  శుక్రవారంనాడు నియమంగా ఉండాలి.  శుక్రవారంరోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు.

శుక్రుని అనుగ్రహంకొరకు, శుభతిథి వున్న శుక్రవారాలలో కుంకుమపువ్వు,యాలుకలు,మణిశిల,శౌవర్చ లవణము, గోరోచనము,గజమదము,శక్తిపుష్పము,శతావరి, వీటిలో మీకు లభించిన వాటిని, నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి. శుక్రవారాలలో తెలుపురంగు బట్టలు ధరించాలి. 

శుక్రుని అనుగ్రహంకొరకు, శుభతిథి వున్న శుక్రవారాలలో బొబ్బర్లు,తెల్లని సన్న బియ్యము, తెలుపురంగు వస్త్రము, వెండి, వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి, తమలపాకులు,వక్కలు,అరటి పండ్లు, దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి.

ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే శుక్రవారంరోజున వీలైనంతవరకు శుభ్రమైన తెలుపురంగు దుస్తులను ధరించాలి.

శుక్రుడి శుభాలను ఇవ్వడానికి శుక్రవారం కొన్ని వస్తువులను దానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు వీలైతే తెల్లని వస్త్రాలు, పంచదార మిఠాయి,అన్నం మొదలైనవాటిని అవసరమైన వారికి దానం చేయండి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే, గోధుమ పిండిలో పంచదార కలిపి శుక్రవారంరోజు చీమలకు ఆహారం అందించాలి. ఈ పరిహారం చేయడంద్వారా శుక్రగ్రహం శుభదృష్టితో ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు.

ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని మీరు కోరుకుంటే శుక్రవారం రోజున పులుపును తినకూడదు.

అదేవిధంగా శుక్రవారాల్లో నలుపు లేదా మురికి బట్టలు ధరించ వద్దు. అంతేకాదు ఇంటిని శుభ్ర పరుచుకోవాలి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారంరోజున ఏ అమ్మాయిని లేదా స్త్రీని బాధించకూడదు. ఈ రోజున అప్పు ఇవ్వవద్దు. అదే సమయంలో ఎవరి దగ్గరా డబ్బు అప్పుగా తీసుకోవద్దు.

అదేవిధంగా ఈరోజున ధర చెల్లించకుండా ఎవరినుండి ఏ వస్తువులను తీసుకోరాదు.

మీరు ఇతరులనుండి బహుమతులు లేదా ఏదైనా ఉచితంగా తీసుకోకుండా ఉండాలి.

వితంతువులు లేదా చిన్నారులకు స్వీట్లు అందించడం కూడా శుక్రగ్రహానికి శక్తివంతమైన పరిహారం.

మీరు ఏదైనా మతపరమైన ప్రదేశానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని దానం చేసి, దానిని మీ వంటగదిలో క్రమం తప్పకుండా ఉపయోగించడం ప్రారంభించినట్లయితే, అది నిజంగా శుక్రుడి ప్రభావాలను శాంతపరచడానికి సహాయపడుతుంది.

మీరు పరిమళ ద్రవ్యాలు మరియు వెండి ఆభరణాలను ఉపయోగించాలి.

మీరు శుక్రగ్రహంయొక్క మంత్రం ఓం శుం శుక్రాయ నమః ప్రతిరోజూ 108 సార్లు జపించవచ్చు.

శుక్రవారం, మీరు అవసరమైన యువతులకు తెల్లటి ఆహారం లేదా ఆభరణాలు ఇవ్వాలి.

నదిలో తెల్లటి పువ్వులు పోయడంవల్ల శుక్రుడు శాంతంగా ఉంటాడు.

జాతకంలో బలహీనమైన శుక్రుడి ప్రభావంలో ఉన్నవారు, తమ దుస్తులను ఉతకకుండా ఎప్పుడూ ధరించరాదు. ఉతకని బట్టలు ధరించడం ప్రతికూల ఫలితాలను తీవ్రతరం చేస్తుంది.

ప్రతికూలతను తొలగించడానికి మీరు ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం కర్పూర దీపాన్నికూడా వెలిగించవచ్చు.

మీ వాలెట్ లేదా పర్సులో వెండి వస్తువును ఉంచుకోవడం కూడా  శుక్రుడి ప్రతికూలతను తగ్గించడానికి సహాయపడుతుంది.

జాతకంలో బలహీనమైన శుక్రుడు ఉన్నవారు ఇంటినుండి బయలుదేరినప్పుడల్లా వారి తల్లి ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలి.

శుక్రుడుకోసం మరొక ప్రభావవంతమైన పరిహారం మీ జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉండటం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు యాలకలను ఆకర్షిస్తాడని నమ్ముతారు. కాబట్టి శుక్రుడుని సంతోషపెట్టడానికి యాలకులు అత్యంత ప్రభావంతమైన మార్గంగా భావిస్తారు. స్నానపు చేసే నీటిలో కొన్ని యాలకులు వేసి, ఉడకబెట్టి ఆపై వడపోసి స్నానం చేయాలి. ఇలా చేసేటప్పుడు శుక్రుడు యొక్క బీజమంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా మీ సమస్యలన్నీ తొలిగిపోతాయి.

శుక్రవారంనాడు మీరు తినేటప్పుడు, తాగేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రతి శుక్రవారం పాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు శుక్రవారంనాడు ఉప్పు తినవద్దు. అంతేకాకుండా పుల్లని వస్తువులకుకూడా దూరంగా ఉండాలి. పుల్లని ఆహారాలను శుక్రుడిని బలహీన పరుస్తాయి. అంతేకాకుండా మీ వైవాహిక జీవితంలో ఇది చేదును మిగులుస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

ప్రకాశవంతమైన లోహాల్లో వెండిపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెండి ఆభరణాలను ధరించడంవల్ల, మీరు శుక్రుడిని బలపరచవచ్చు. ఒకవేళ మీవద్ద డబ్బు అధికంగా ఉంటే ప్లాటినం కూడా ధరించవచ్చు. వెండి ఆభరణాలు ధరించడంవల్ల చర్మపు చికాకులు తొలుగుతాయి. ఇదే సమయంలో వెండి ధరించడంవల్ల జలుబు సమస్య తగ్గుతుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.

ఎవరి జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే, ఆ వ్యక్తి గాయత్రీ మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఈ మంత్రాన్ని పఠించడంవల్ల ఇంట్లో స్థిరత్వం,ఆనందం,శ్రేయస్సు మాత్రమే కాకుండా ఏదైనా ఆరోగ్య సంబంధిత ఇబ్బందులుంటే అది కూడా పోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X