సింహరాశివారి శరీరం ఆరోగ్యం,ఆదాయం అదృష్టం,లక్షణాలు,గుణగణాలు, ప్రేమ,దాంపత్య జీవితం,కుటుంబం,బలహీనతలు,విద్య,ఉద్యోగం, వ్యాపారం..!!
మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుణి 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుణి 1వ పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు.
సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరమందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నము గా శాస్త్రములలో కీర్తించబడింది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతము నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతారు.
సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహ రాశి నందు జన్మించినవారు రాజకీయనాయకులుగా ఎదిగే అవకాశం కలదు.
ఏ రంగంలోనైనా వీరు నాయకులు గానే ఉంటారు. అందువలన వీరికి సహజసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు.
సింహరాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు.
సింహరాశివారు వంశ ప్రతిష్ఠ, కుల గౌరవాలకు ప్రాధానయత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము చేసుకోరు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి. సన్ని హితులు, సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు.
సింహరాశివారిని భయ పెట్తి లొంగదీసు కోవడము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మక పోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజము ఔతాయి. వైఫల్యము చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్తసంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు.
సింహరాశివారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాత వాసము, అల్పులను ఆశ్రయించుట తప్పక పోవచ్చు. రాజకీయ రంగములో ప్రారంభములోనే ఊన్నత స్థితి సాధిస్తారు. సాధారన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరము ఔతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరము చేసుకుంటారు. శిరో వేదన, పాఋశ్య వాయువు, కీళ్ళ నొప్పులు వేధిస్తాయి.
సింహరాశివారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్ట మైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురౌతాయి. స్వంత వారు వదిలి వేసిన బాధ్యతలన్ని వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత స్వంత వాళ్ళ వలన సమస్యలు ఎదురౌతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి పోతారు.
సింహరాశివారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించిన చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు.
సింహరాశివారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. సింహ రాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో నైనను నిరాశ చెందరు. ఎప్పుడు విజయపథంలో నడవటానికి ఇష్టపడతారు.
సింహరాశివారికి ఆవేశము అధికముగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకం గా మారుతుందని చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతురుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలము బాధపడుతుంటారు. కావున వీరు అభిమానము దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది.
సింహరాశివారికి శారీరక బలము తో పాటుగా మనో బలము కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తుంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది.
సింహరాశివారియొక్క చిత్రమైన గుణం ఏమంటే, వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతుంటారు. అందువలన ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో ఇతరులను నిందిస్తూ, గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహ రాశి వారికి మోసం చేసే గుణము వున్నవారంటే అసలు పడదు.
సింహరాశివారికి మానవత్వం పై, మంచితనము పై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలి పడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపై వేసుకొని సహాయము చేస్తారు. దీనిని అదునుగా చేసుకొని కొంతమంది వీరిని మోసము చేస్తారు.
సింహరాశివారి నచ్చనివి ఏమిటంటే, మోసము చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలెనని, వీరు అందరి కన్నా తెలివైనవారమని వీరి గట్టి నమ్మకము.
సింహరాశివారికి డబ్బు, ఆస్తిపాస్తులు అధికారము వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ సింహ రాశి వారు కీర్తి దాహము, ప్రచార కాంక్ష, అను రెండు విషయములకు మాత్రము లొంగిపోతారు. అతి డాంభికత్వము, ఇతరులతో తమని పొగిడించు కోవాలన్నటువంటి కోరిక, మరియు వీరిని వీరు స్లాగించుకొనుట అను లక్షణములు నిగ్రహించుకున్నచో, వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి, ఆమెను ప్రేమ దేవత లాగ ఆరాధించ వలననే ఆదర్శం ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహము చేసుకొని, వీరు ఆశించిన ప్రేమ తత్వము లభించినప్పుడు, జీవిత సౌధము కూలిపోయినట్లు వీరు బాధపడు అవకాశము కలదు. సింహ రాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభముగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశం కలదు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య.
సింహరాశివారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతుంది. బాధలలో ఉన్నవారిని రక్షించు వృత్తులలో, శాఖలలో, వీరు రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పని చేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్లు రాణిస్తారు. మొత్తం మీద సింహ రాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాల యందు బాగా రాణిస్తారు.
సింహరాశివారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యొగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరచి పోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకముగా ఆలోచించనంత కాలము మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యహారాలు లాభిస్తాయి. ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరనలో పెట్టదము కష్టము అని గుర్తించ వలసి ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది.
ఆర్థిక స్థితి: వీరు మొదటినుంచి కష్టపడే తత్వంగలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో ఒకటిరెండుసార్లు ఆలోచించి అడుగువేస్తారు. దీనివల్ల వీరికి ఆర్ధికంగా లాభాలు కురిపిస్తాయి.
ఆదాయం మరియు అదృష్టం: ఆత్మవిశ్వాసం అధికం. ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం.
ప్రేమ సంబంధం: వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వంగలవారు కావటంవల్ల కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల దగ్గర వీరి చెప్పిన విషయాన్ని వారు పాటించటానికి ముందుకువస్తారు. వీరికి ప్రేమంటే ప్రాణం. ప్రేమను ఆస్వాదించటానికి ఏమి చెయ్యటానికికైనా వెనుకాడరు.
వ్యాపారం: వీరు ఇనుము, సిమెంట్ రంగాలలో రాణిస్తారు. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు. అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది.
గుణగణాలు: అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు.
దాంపత్య జీవితం: వీరు ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు. వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తుంది. అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగిఉంటారు.
విద్య: వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవనగమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏదిఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం.
గృహం మరియు కుటుంబం: వీరు ఎప్పుడూ పిల్లా-పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లలు వలే బావించటంవల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం.
సహజమైన బలహీనతలు: వీరు ఇతరుల చెప్పే విషయాలను అమలు చేయటంవల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారినుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకుని వారినుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి.
వ్యక్తిత్వం: వీరు సాధు స్వభావం కలవారు. అందువల్ల పక్కనవారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు. పరాయివారిని ఎప్పుడూ దూషించటానికి దూరంగా ఉంటారు. దీని వల్ల వీరికి లాభిస్తుంది. కొత్త వారిని ఎప్పుడూ సొంత వారిలాగే చూస్తారు.
ఆరోగ్యం: వీరు కొత్త పరిస్థితులకు తగ్గటుగా కలిసిపోవటంవల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్దను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు.