సింహరాశివారికీ ఆగష్టు నెలలో 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు, జరగబోయేది తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు, ముఖ్యంగా ఈ సింహరాశిలో పుట్టినవారు ఆగష్టు నెలలో మిటాయిలు పంచిపెట్టేటువంటి మూడు మహత్తరమైన శుభవార్తలను అందుకోబోతున్నారు, ఈ వార్తలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంబించబోతున్నాయి,
ఈ ఆగష్టు మాసం మీకు పట్టిందల్లా బంగారం కాబోతోంది, మీ ఇంట్లో ధనవర్షం కురవబోతోంది, ఇప్పటివరకు మూసుకుపోయి ఉన్నటువంటి ధనద్వారాలు బార్లా తెరుచుకోబోతున్నాయి, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ తలుపు తట్టబోతోంది, మీరు ఊహించని ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు, మీ ప్రతి అడుగులో విజయం దాగీ ఉంటుంది, మీ ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చుతుంది,
అలాగే ఈ సింహరాశివారు ఏయే సెక్తివంతమైన పరిహారాలు ఆచరించడంవల్ల వారికి ఇంకా మరిన్ని శుభఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయో కూడా వివరంగా తెలుసుకుందాం, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా, క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం,
చాలా మందికి ఉన్న ఒక పెద్ద అపోహ ఏమిటంటే సింహం అనగానే వాళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది, పొగరు ఉంటుంది, వాళ్ళు అస్సలు ఎవరి మాట వినరు అని అనుకుంటారు, కానీ అది పూర్తిగా తప్పు, సింహం అంటే ఒక లాయల్టీ, ఒక విశ్వసనీయత ఉంటుంది వాళ్లలో, సింహ లగ్నం కానివ్వండి, సింహ రాశి కానివ్వండి, వారికి ఉదార స్వభావం, దానగుణం చాలా ఎక్కువగా ఉంటుంది,
అయితే వీరికి పాపం గత ఆరు నెలలుగా ప్రతీది చిరాకు చిరాకుగా ఉండటం, ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాకపోవడం, నిరంతరం ఆటంకాలు, ఇబ్బందులు, అనవసరమైన గొడవలు, చాలా చిరాకుగా ఉండటం జరుగుతున్నాయి, కానీ ఆగస్టు మాసంలో మాత్రం గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉండబోతోంది, మీకు చాలా ఉపశమనం, రిలీఫ్ వచ్చిందని అనిపిస్తుంది, ఇన్నాళ్ల కష్టానికి ఒక తెర పడుతుంది,
ఇక్కడ చాలా మటుకు మీ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అనేది తగ్గుతుంది, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడున్న గ్రహస్థితివలన అది అదుపులోకి వస్తుంది, కాకపోతే వీళ్ళకి ఏంటంటే, ప్రతి దానిలో ఒక ప్రత్యేకత అంటే యూనిక్యూనెస్ కావాలి, అందరిలా గొర్రెల మందలో వెళ్ళడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు, ఏదైనా బిన్నంగా, ప్రత్యేకంగా ఉండాలి, సింహం అడవిలో ఎప్పుడూ సింహంగానే ఉంటుంది, మందలో కలవదు,
సింహరాశి మన రాశి చక్రంలో ఐదవ రాశిగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఈ రాశికి అధిపతి గ్రహరాజైన రవి, అంటే సూర్యభగవానుడు, సూర్య భగవానుడియొక్క తేజస్సు, సెక్తి, అధికారం, అనుగ్రహం ఈ సింహరాశి వారి మీద పుష్కలంగా ఉంటాయి, ఆ సూర్యభగవానుడియొక్క అపారమైన ఆశీర్వాదంవలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది,
అయితే వీరి జాతక పరంగా గమనిస్తే, వీరికి వచ్చే కష్టాలు కూడా చాలా తీవ్రంగా, గట్టిగానే వస్తూ ఉంటాయి, ఎంతటి కటినమైన కష్టాలు ఎదురైనప్పటికీ, వీరి మీద ఆ సూర్యునియొక్క అనుగ్రహం బలంగా ఉండటంవలన, ఆ సమస్యలు వీరిని పెద్దగా ఏమీ చేయలేవు, ఇబ్బంది పెట్టలేవని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు, జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడేసినా, అంతకు రెట్టింపైన పట్టుదలతో సింహంలాగా మళ్ళీ పైకి లేస్తారు,
పడి లేవడం, మళ్ళీ పడినా తిరిగీ రెట్టించిన వేగంతో లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగం అయిపోతుంది, ఈ అనుభవాలే వారిని కాలంతో పాటు రాటుదేలిన ఒక వజ్రంలా మారుస్తాయి, భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కటినమైన కష్టాన్నైనా సరే తట్టుకునే అమోగమైన సెక్తిని, దైర్యాన్ని వీరికి అందిస్తాయి, వీరి జీవితాన్ని చూస్తే ఎవరైనా స్ఫూర్తి పొందాల్సిందే,
వీరి జీవితంలో కష్టానికి, అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన, విడదీయరాని సంబంధం ఉంటుంది, ఒకవైపు కష్టాలు వీరిని పరీక్షిస్తున్నా, మరోవైపు అదృష్టం నీడలా వీరి వెంటే నడుస్తుంటుంది, అందుకే వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితులలో చిక్కుకున్నా, ఏదో ఒక రూపంలో దైవిక సహాయం అంది అద్భుతంగా ఆ సమస్యల నుంచి సురక్షితంగా బయటపడతారు, ఆ భగవంతుడే వీరి చేయి పట్టుకుని నడిపిస్తాడు,
పాపం ఈ సింహరాశి వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా ఆషామాషీగా ఉండవండి, కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు, ఇది వాస్తవం, అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా వారి స్థాయికి తగ్గట్టుగానే కష్టాలు చాలా బలంగా ఉంటాయి, ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి, దెబ్బలు తిని, మళ్ళీ పైకి లేచినటువంటి ధీర వనితలు, ధీరులు వీరు,
ఈ క్లిష్ట పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం బయటివారు కాదు, వారి చుట్టూ ఉన్న మనుషులే, ఈ సింహరాశి వారు జీవితంలో పాటాలు నేర్చుకున్న దానికన్నా, తమ చుట్టూ ఉన్నవారే, తాము నమ్మినవారే వీరికి గుణపాటాలు ఎక్కువగా నేర్పించారు, ఈ గుణపాటాలే వీరిని జీవితంలో మరింత జాగ్రత్తగా, దృడంగా ఉండేలా చేశాయి, అందుకే ఇప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేస్తారు,
సింహం ఏ విధంగా అయితే అడవికి రారాజుగా వెలుగొందుతుందో, ఈ రాశి వారు కూడా తాము ఉన్న చోట ఒక రాజులాగే, రాణిలాగే బ్రతకాలని మనస్పూర్తిగా కోరుకుంటారు, నాయకత్వం వహించడం అనేది వీరికి పుట్టుకతో వచ్చిన ఒక గొప్ప వరం, పది మందిలో ఉన్నా కూడా ప్రత్యేకంగా, కేంద్ర బిందువుగా కనిపించాలనే తపన, అందరినీ ఒక సరైన మార్గంలో నడిపించాలనే బలమైన ఆకాంక్ష వీరిలో ఎప్పుడూ ఉంటుంది,
ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి అపారమైన దైర్యం గాని, సింహానికి ఉన్నటువంటి అద్భుతమైన తెలివితేటలు గాని, సింహానికి ఉన్నటువంటి సహజమైన గర్వము, పొగరువంటి లక్షణాలు ప్రతిదీ కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలుగా ఉంటాయి, అన్నింటికీ మించి దైర్యం ఉంటుంది చూడండి, అది అమోగం, ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండ అడుగులు ముందుకు వేయడమే తప్ప, వెనక్కి తగ్గటం అనేది సింహంయొక్క చరిత్రలోనే లేదు,
అదేవిధంగా, ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా దైర్యవంతులు, ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి సొంతం, వీరి దగ్గర పొగరు, అహంకారము, గర్వము, అందము, ముక్కుసూటితనం, తీవ్రమైన కోపంవంటి లక్షణాలను గనక మనం పోల్చుకుంటే, ఇవి అడవిలోని సింహాలకు ఏమాత్రం కూడా తక్కువ కాదనిపిస్తుంది, ఈ లక్షణాలే వీరిని ప్రత్యేకం చేస్తాయి, కానీ కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి,
సింహరాశిలో జన్మించినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎక్కడా కూడా, ఏ విషయంలోనూ తగ్గరు, ఆఖరికి సింహరాశిలో పుట్టినటువంటి చిన్న పిల్లలు కూడా సింహం పిల్లల్లాగే ఎంతో దైర్యంగా, చురుకుగా ఉంటారు, ఇలా ప్రతి లక్షణం కూడా వారికి వారి రక్తంలోనే, వారి జన్మలోనే ఉంటుంది, అన్ని రకాలైనటువంటి దైర్యాలు, ఆత్మాబిమానం, పొగరువంటివి ప్రతిదీ కూడా ఈ సింహరాశివారికి సహజంగానే అబ్బుతాయి,
ఏదైనా ఒక పెద్ద సమస్య ఎదురైతే, పక్కకు తప్పుకోవడం లేదా పారిపోవడం వీరికి అస్సలు తెలియదు, ముందుండి ఆ సమస్యను పరిష్కరించే పూర్తి బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు, అందుకే కుటుంబంలో కానీ, స్నేహితుల బృందంలో కానీ, వారు పనిచేసే కార్యాలయంలో కానీ అందరూ వీరిపైనే ఎక్కువగా ఆధారపడతారు, వీరి మాటకు తిరుగుండదు, వీరి నిర్ణయానికి తిరుగుండదు,
క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీపడరు, ఇది వీరి విజయానికి పునాది, సమయపాలన పాటించడం, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనిలో అత్యున్నత నాణ్యతను పాటించడంవంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు, ఈ గొప్ప లక్షణాలే వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తాయి, వీరి జీవనశైలి ఎంతో పద్ధతిగా, ఒక ప్రణాళికాబద్ధంగా, ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది,
అయితే, నిరంతరం అబివృద్ధి సాధించాలనే బలమైన తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది, విశ్రాంతి లేకుండ రాత్రింబవళ్ళు శ్రమించడంవల్ల కుటుంబంతో, ప్రాణ స్నేహితులతో గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు, ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించడం, పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం పాటించడం చాలా అవసరం,
అలాగే ఈ సింహరాశివారు, మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి, మేము అందరికన్నా ఉన్నతంగా ఎదగాలి అనేటటువంటి ఒక బలమైన తపన, తాపత్రయంతో ఉంటారు, అందుకోసం ఎంత కష్టపడటానికైనా సరే వెనుకాడరు, ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తారు, వారి లక్ష్యం కోసం వారు ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు,
మేము జీవితంలో బాగా సంపాదించాలి, మాకు డబ్బు అనేది చాలా అవసరము, మా తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తిపాస్తులు, సంపద మాకు కావాలి అని కోరుకుంటారు, మా కుటుంబం, మేము ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలి,
మా తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి, వారి శ్రేయస్సు, సంతోషం, మరియు అవసరాలను ఎంతో శ్రద్ధగా చూసుకోవాలి, వారి ఆరోగ్యానికి అవసరమైన ప్రతి సహాయం అందించాలి అని బలంగా ఆకాంక్షిస్తారు,
మేము పదిమందిలో ఎక్కడో ఒక మూలన కాకుండ, ఆ పదిమందిలో మేము ముందుండాలి, అందరినీ నడిపించాలి అనే భావన ఉంటుంది, ఫలానా వారు అంటే సమాజంలో ఒక మంచి పేరు, ప్రతిష్టలు, ఒక ఉన్నతమైన హోదా, గౌరవము, ఒక మంచి స్టేటస్ ఉండాలి అని బలంగా కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వారిని మనం చెప్పుకోవచ్చు, ఈ కోరికలే వారిని ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తాయి,
వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి, కొన్ని అయితే దగ్గరి మనుషులు సృష్టించినటువంటి బాధలు, నమ్మినవారు చేసినటువంటి అవమానాలు అనేవి గట్టిగా వీరి గుండెకు బాణాల్లా తగీలాయి అని చెప్పుకోవచ్చు, ఆ గాయాలు అంత సులభంగా మానవు,
అలాంటి బాధాకరమైన అనుభవాల వల్లే వీరు, జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అనే నిర్ణయానికి వస్తారు, కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించాలి అని తీర్మానించుకుంటారు, ఏదైనా సరే ప్రతిదీ కూడా మనం డబ్బుతో శాసించగలము, ఏదైనా కొనగలము, కొండమీద కోతినైనా సరే తీసుకువచ్చేటటువంటి సెక్తి ఒక డబ్బుకు మాత్రమే ఉంటుందని వీరు బలంగా భావిస్తారు,
అందుకే వీళ్ళు అలాంటి ఆ హోదాతనం, ఆ హుందాతనం మాకు కూడా రావాలి, జనం మమ్మల్ని ఎంతో అవమానించారు, వారికి మనం మన ఎదుగుదలతోనే గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకుంటారు, వీరు చిన్న వయసులో ఎదుర్కొన్న ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల వల్లే ఇవ్వాళ్టి రోజున వాళ్ళు అంత స్ట్రాంగ్ గా, ఉక్కు మనుషుల్లా తయారయ్యారన్నమాట, అలాగే, అంతటి పట్టుదలతో ధనాన్ని సంపాదిస్తారు,
ఒక మాటలో చెప్పాలంటే, వీరి జీవితంలో 30 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది, వీరియొక్క ప్లానింగ్ గాని, వీరి ప్రణాళిక గాని, ఇన్నేళ్లుగా వీళ్ళు చేసిన కష్టానికి తగీనటువంటి ఆ అసలైన ఫలితం ఈ వయసు నుండే వీరికి దక్కడం ప్రారంభమవుతుంది, అప్పటి నుండి వీరు వెనక్కి తిరిగీ చూసుకోవాల్సిన అవసరం రాదు,
అయితే, వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే ఉంటుంది, ఇది సూర్యుడి ప్రభావం, సింహం గర్జించినట్లు, వీరికి కోపం వస్తే ఆపడం ఎవరితరం కాదు, చాలా కష్టం, ఆ ఆవేశంలో, ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాలవల్ల అనేకసార్లు భారీగా నష్టపోతారు, అనవసరమైన చిక్కులను తామే కొని తెచ్చుకుంటారు, వీరు తమ కోపాన్ని గనక అదుపులో ఉంచుకుంటే, వీరికి ఈ ప్రపంచంలో తిరుగుండదు,
ఇతరుల బాధ్యతలను, వారి కష్టాలను తమవిగా భావించి అనవసరంగా నెత్తిన వేసుకుంటారు, సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసినా, చివరికి ఆ బరువు మోయలేక చాలా కాలం పాటు మానసికంగా, ఆర్థికంగా బాధపడాల్సి వస్తుంది, అబిమానం వేరు, దురబిమానం వేరు అని గ్రహించి, ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేసి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది,
సమాజంలో వీరికి మంచి పలుకుబడి, గౌరవం ఉంటాయి, వీరి మాటతీరు, ప్రవర్తన ఎంతో ఆకర్షణీయంగా, హుందాగా ఉంటాయి, అనవసరమైన విషయాలలో ఎప్పుడూ తలదూర్చరు, కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని తెలిస్తే మాత్రం, అక్కడ సింహంలా గర్జించి ఆ అన్యాయాన్ని ఎదిరిస్తారు, వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలను, ప్రశంసలను పొందుతుంది,
దానగుణం వీరిలో సహజంగానే, పుట్టుకతోనే ఉంటుంది, కష్టాల్లో ఉన్నవారిని చూస్తే వీరి హృదయం వెంటనే చలించిపోతుంది, తమ దగ్గర డబ్బు లేకపోయినా సరే, అవసరమైతే అప్పు చేసైనా ఇతరులకు సహాయం చేసే గొప్ప గుణం వీరిది, ఈ గొప్ప గుణంవల్ల ఎంతోమంది పేదల, బాధితుల దీవెనలను పొందుతారు, ఆ పుణ్యమే వీరిని ఎన్నోసార్లు కాపాడుతుంది,
వీరి స్నేహం కూడా ఎంతో గొప్పగా, ఆదర్శంగా ఉంటుంది, స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు, స్నేహితుడికి కష్టం వస్తే, నేనున్నానంటూ అందరికన్నా ముందుండేది సింహరాశి వారే, కానీ, ఎవరైనా స్నేహం పేరుతో నమ్మకద్రోహం చేస్తే మాత్రం, వారిని జీవితంలో ఎప్పటికీ క్షమించలేరు, వారిని తమ జీవితంలోంచి శాశ్వతంగా తొలగీస్తారు,
ఈ సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడి లేచి, పడి లేచి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి చూడండి, ఆ అనుభవాలు, జనాలు నేర్పించినటువంటి గుణపాటాలు, అవన్నీ వాళ్ళు ఒక బలమైన పట్టుదలతో తీసుకొని, వాటినే ఇంధనంగా మార్చుకొని కష్టపడి ఒక మంచి ఉన్నతమైన స్టేజ్ కి వచ్చారు, వారి విజయం వెనుక ఎన్నో కన్నీటి చుక్కలు, నిద్రలేని రాత్రులు ఉంటాయి,
అంటే మంచి సక్సెస్ లో ఉంటారు, అసలు అంతకు ముందు ఏమీ లేని వాళ్ళు కూడా, ఏంట్రా బాబు వీరు ఇంత ఎలా సంపాదించారు, ఏం వ్యాపారం చేశారు, అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా వరించింది, ఇంత టాలెంట్ గా ఎలా ఎదిగారు అని చెప్పేసి జనం కూడా ఆశ్చర్యంతో ముక్కు మీద వేలు వేసుకునేటట్లుగా వీరియొక్క సంపాదన కానివ్వండి, వీరి ఎదుగుదల కానివ్వండి, ప్రతిదీ కూడా బాగా కలిసి వచ్చి ఒక మంచి స్థాయిలో ఉంటారు,
ఎవరైతే ఒకప్పుడు వీరిని అవమానించారో, చిన్నచూపు చూశారో, అలాంటి వారే వీరి దగ్గరకు వచ్చి వీరియొక్క సెక్తి సామర్థ్యాలను, వీరి పట్టుదలతో జీవితంలో ఎదిగీనటువంటి ఆ ఎదుగుదలని, వీటన్నింటినీ కూడా గుర్తించి, వీరి సహాయ సహకారాల కోసం చేతులు కట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు, కాలం అలా సమాధానం చెబుతుంది,
అంటే వీరిని మంచిగా పొగడటము, వీరి చుట్టూ తిరగడంవంటివి చేసి వీరి దగ్గరకు చేరేటటువంటి అవకాశం అనేది స్పష్టంగా ఉంది, కాబట్టి మీరేంటంటే, అలా ఎవరైతే మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు అవమానించారో, అలాంటి వారు ఈరోజు మీ దగ్గరకు వచ్చారు కదా అని చెప్పేసి వెంటనే వారిని అక్కున చేర్చుకోకండి, వారిని ఎంత దూరంలో ఉంచాలో, అంతలోనే ఉంచేసేయండి,
అలాంటి అవకాశవాద వ్యక్తులను మీ జీవితం నుంచి, మీ ఆలోచనల నుంచి పూర్తిగా పక్కన పెట్టేసేయండి, ఇప్పటికైనా సరే, అంటే చిన్న వయసులో తెలిసీ తెలియక ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మి ఉండవచ్చు, అలాంటి గుడ్డి నమ్మకం వల్లే మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, నష్టాలను ఫేస్ చేశారు, కానీ ఇప్పుడు పొరపాటున కూడా మళ్ళీ అలాంటి పొరపాటు అనేది పునరావృతం చేయవద్దు,
ఇప్పుడైనా సరే ఎవరిని ఎంతలో ఉంచాలో, వారి యోగ్యత ఏమిటో గ్రహించి, ఎవరిని ఎక్కడ ఉంచాలో వారిని అక్కడే ఉంచేసేయండి, ఏదైనా కష్టం కానీ, ఏదైనా చెప్పుకోలేని బాధలు కానీ ప్రతి మనిషికి ఉంటాయి, చెట్టుకింద ఉండే నిరుపేద దగ్గర నుంచి, ఖరీదైన కార్లలో తిరిగే కోటీశ్వరుడి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉంటూనే ఉంటాయి,
అలాగే సింహరాశి వారు తమ కుటుంబాన్ని ఎంతో గాడంగా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, వారు తమ కుటుంబాన్ని, పిల్లలను, జీవిత భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు, వీరు తమ ప్రియమైన వారిని చూసుకోవడంలో ఒక రాజులాగా లేదా ఒక మహారాణిలాగా ఉంటారు, అంటే వారికి కావలసిన అన్ని సుఖాలు, సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి త్యాగానికైనా సరే వెనుకాడరు, సిద్ధపడతారు,
అలాగే కుటుంబ వ్యవస్థకు, సంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు, సింహరాశివారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను, కుటుంబ విలువలను గౌరవించి నిలబెట్టేవారిగా ఉంటారు, ప్రేమ విషయంలో సింహరాశి వారు ఎంతో నమ్మకస్తులుగా, అంకితభావం కలిగీన వారుగా ఉంటారు, పేదరికంలో అయినా, ఐశ్వర్యంలో అయినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా సరే తమ ప్రియమైన వారిని, తమ భాగస్వామిని ఎప్పటికీ వదిలిపెట్టరు,
ఇక ఈ ఆగస్టు నెలలో గ్రహ సంచారాన్ని పరిశీలిస్తే, ఈ రాశివారికి నెలంతా లాభస్థానమైన 11వ ఇంట్లో గురు, శుక్రులు, ధన స్థానమైన 2వ ఇంట్లో కుజుడి సంచారంవల్ల ఆదాయం అద్భుతంగా వృద్ధి చెందే అవకాశం ఉంది, ఆదాయ వృద్ధికి మీరు ఎంత ప్రయత్నిస్తే అంతకు రెట్టింపు ఫలితం లబిస్తుంది, ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఇతరులకు సహాయం చేసే విషయంలో, హామీలు ఉండే విషయంలో జాగ్రత్త వహించకపోతే ఇబ్బంది పడతారు,
ముఖ్యమైన వ్యవహారాల్లో, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి ఆచి తూచి అడుగేయాలి, ఆహార విషయాలలో తగీన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది, లేకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది, వ్యాపారపరంగా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది, కొత్త ఒప్పందాలు కుదురుతాయి, బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండ చూసుకోవాలి,
పిల్లల చదువులు చాలా అనుకూలంగా, విజయవంతంగా సాగీపోతాయి, వారు మీకు మంచి పేరు తీసుకువస్తారు, ఉద్యోగంలో మీ ప్రాధాన్యం, ప్రాభవం గణనీయంగా పెరుగుతాయి, మీకు ఆకస్మిక ధన లాభానికి బలమైన అవకాశం ఉంది, అది వ్యాపార రూపంలో కావచ్చు, వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు, కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా, సంతోషంగా సాగీపోతుంది, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లబిస్తుంది,
ఇక మొదటి శుభవార్త విషయానికి వస్తే, ఈ ఆగస్టు నెలలో కేతువు మీ లగ్నంలో, అంటే మీ రాశిలోనే ఉండటంవలన, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మీకు గొప్ప పురోగతి లబిస్తుంది, ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని ప్రశ్నలకు, మీరు వెతుకుతున్న కొన్ని గూడమైన విషయాలకు మంచి స్పష్టత వస్తుంది, ఇది మీకు అపారమైన మానసిక శాంతిని ఇస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు,
ఇక రెండవ శుభవార్త, ఇది మీ ఆర్థిక విషయాలకు సంబంధించింది, మీ రాశికి వ్యయస్థానమైన పన్నెండవ ఇంట్లో బుధుడు ఉన్నాడు, అయితే ఈ నెలలో కొంతకాలం వక్రిస్తున్నాడు, బుధుడు వక్రించడంవలన, ఎప్పటి నుంచో వ్యాపారంలో లాభాలు రాక, కలిసి రావట్లేదని బాధపడేటువంటి వారికి ఇప్పుడు అదృష్టం పట్టబోతోంది,
ముఖ్యంగా స్కూల్స్ మరియు కాలేజీలు నడిపేవాళ్ళు, చిట్ ఫండ్ వ్యాపారులు, బంగారు వ్యాపారస్థులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది, వీరికి అనుకూలమైన వాతావరణం ఏర్పడి, లాభాలు వెల్లువెత్తుతాయి,
అలాగే విద్యార్థులకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, చదువులో, క్రీడలలో రాణించి మెడల్స్, కీర్తి, కొన్ని ట్రోఫీస్ గెలుచుకుంటారు, తద్వారా తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకువస్తారు, ఇక ఫైనాన్షియల్ గా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మంచి ఎదుగుదల ఉంటుంది, వ్యయంలో ఉండే బుధుడు వక్రించి లాభం వైపు చూడటంవలన, మీరు ఊహించని విధంగా డబ్బును ఆదా చేసుకోగలుగుతారు,
వ్యాపారంలో తిరుగులేని ధనయోగం అనేది ఉంది వీరికి, ఇందులో ఎటువంటి సందేహం లేదు, ముఖ్యంగా ఫ్యాషన్, టెక్స్టైల్స్, కాస్మెటిక్స్ కు సంబంధించిన వ్యాపారాల్లో లాభాలు చాలా బాగుంటాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడానికి, వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాసం మీకు నూటికి నూరు శాతం అనుకూలంగా ఉంటుంది, మీ కష్టానికి తగీన ప్రతిఫలం దక్కే సమయం ఇది,
కాకపోతే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి, ధన విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి తర్వాత ఇబ్బంది పడటం, నష్టపోవడం జరగవచ్చు, ధన విషయంలో కొంతవరకు అనవసర గొడవలు అయ్యే అవకాశం ఉంది, ఉదాహరణకు, మీ భూమి అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తా అంటారు, కానీ సమయానికి ఇవ్వక వారి చుట్టూ తిరగాల్సి వస్తుంది, కాబట్టి ఇటువంటి భూమికి సంబంధించిన డీల్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి,
డబ్బు విషయంలో ఎవరికీ హామీ ఉండకూడదు, అలా ఇస్తే మీరే వారి బదులు ఇరుక్కోవాల్సి వస్తుంది, అందుకని ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అయితే అన్నదమ్ములతో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంబించడానికి, కొత్త డీల్స్ చేసుకోవడానికి, కొత్త అగ్రిమెంట్స్ అవ్వడానికి మాత్రం సమయం చాలా చాలా అనుకూలంగా ఉంది, ఇందులో ఎటువంటి సందేహం గాని సంకోచం గాని మీకు అక్కర్లేదు,
ఇక మూడవ శుభవార్త, ఇది శుభకార్యాలకు సంబంధించింది, ఈ ఆగష్టు మాసంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం ఖాయం, ఇన్నాళ్లుగా ఏవో ఆటంకాలవల్ల వాయిదా పడుతున్న శుభకార్యాలన్నీ ఇప్పుడు చకచకా జరిగీపోతాయి, ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులకు ఇది ఒక అద్భుతమైన సమయం, బృహస్పతియొక్క సంపూర్ణ అనుగ్రహం మీపై ఉండటంవల్ల, మీ పెళ్లి ప్రయత్నాలు కచ్చితంగా ఫలిస్తాయి, మీ మనసుకు నచ్చిన, మీ ఇంటికి తగీన మంచి జీవిత భాగస్వామి మీకు లబిస్తారు,
చూపులు, మాటలువంటివి వేగంగా పూర్తయి, నిశ్చితార్థం వరకు వెళ్తాయి, విదేశాల నుంచి కూడా అద్భుతమైన సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, పెద్దల అంగీకారంతో, బంధుమిత్రుల ఆశీస్సులతో మీ వివాహం అత్యంత వైభవంగా జరగబోతోంది,
ఇక గృహయోగం గురించి చెప్పుకుంటే, ప్రతి మనిషికి ఉండే సొంతింటి కల ఈ ఆగష్టు నెలలో మీకు నెరవేరబోతోంది, గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉండటంవల్ల, భూమి లేదా గృహం కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది, ఇప్పటివరకు ఉన్న ఆటంకాలన్నీ తొలగీపోతాయి,
మీరు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం బలంగా ఉంది, లేదా మీరు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న ఫ్లాట్ మీకు ఇప్పుడు అనుకూలమైన ధరకు లబిస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం,
గృహ నిర్మాణానికి లేదా ఫ్లాట్ కొనుగోలుకు కావలసిన ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాలువంటివి ఎటువంటి ఇబ్బంది లేకుండ సులభంగా మంజూరు అవుతాయి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి అన్ని దారులు తెరుచుకుంటాయి, ఇందులో ఎలాంటి సందేహం లేదు,
కొందరికైతే పెళ్లి చేసుకొని కొత్త ఇంట్లోనే గృహప్రవేశం చేసే అదృష్టం కూడా పట్టబోతోంది, ఒకేసారి రెండు శుభకార్యాలు జరగడంవల్ల మీ ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతుంది, మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంలో మునిగీ తేలుతారు,
మొత్తం మీద ఈ ఆగష్టు నెల మీ ఇంట్లో మేళతాళాలు, బంధువుల సందడితో పండుగ వాతావరణం నెలకొంటుంది, మీ చిరకాల స్వప్నాలైన పెళ్లి, సొంత ఇల్లు అనేవి నిజం కాబోతున్న శుభ తరుణం ఇది, ఈ ఆనందాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి,
అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి, వ్యవసాయం చేసేటువంటి వారికి, భూమి మీద ఆధారపడి బ్రతికేటువంటి వారికి, అంటే కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఈ నెల అమ్మకాలు చాలా బాగుంటాయి, వారి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, దీర్గకాలంగా ఆగీపోయిన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు ముందుకు కదులుతాయి,
వీళ్ళకే కాకుండ, వీళ్ళ సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు, పిల్లలకి ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, మీ జాతకంలో పంచమాధిపతి, దశమాధిపతి కలిసి లాభస్థానంలో ఉండటంవలన, మీ సంతానానికి ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయాల్లో అద్భుతమైన గ్రోత్ చూస్తారు, ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది,
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది, మీ వ్యక్తిగత జీవితంలో మూడో వ్యక్తియొక్క జోక్యంవల్ల మీ జీవిత భాగస్వామితో అపోహలు గాని, లేదా ప్రేమ జీవితంలో గాని విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటి వారి మాటలు విని మీ ఆప్తులను అపార్థం చేసుకోవద్దు, ఇది మీరు ఈ నెలలో ప్రధానంగా గమనించుకోవలసిన విషయం,
ఇక పరిహారాల విషయానికి వస్తే, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గాని, ఆంజనేయ స్వామిని గాని, లేదా నరసింహ స్వామిని గాని ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టకం పటించడంవలన కుజ దోషాలు తొలగీ, ధన సంబంధిత గొడవలు తగ్గుముఖం పడతాయి, ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే అంతా మంచే జరుగుతుంది,
వీళ్ళు నిత్యం చేయవలసినటువంటి మరో ముఖ్యమైన ఆరాధన, అమ్మవారియొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడియొక్క ఆరాధన, ఈ రెండు ఆరాధనలు మీరు ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే, అంత లాభదాయకంగాను, సంతోషంగాను ఉంటారు, మీ జీవితంలో విజయం అనేది తథ్యం, అమ్మవారి కరుణ, దత్తగురువుల ఆశీస్సులు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తాయి,
చక్కగా ప్రతిరోజూ లలితా సహస్రనామాల్లోని ఓం కామేశబద్ధమాంగల్య సూత్రశోబిత కంధరాయై నమః అనే నామాన్ని శ్రద్ధగా ఒక 40 నిమిషాల పాటు జపించుకుంటే, సాక్షాత్తు ఆ జగన్మాతయొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది, అష్టమ సెని, సప్తమ రాహువుకు సెక్తివంతమైన పరిహారంగా తరచూ శివాలయానికి వెళ్లి శివార్చన లేదా రుద్రాబిషేకం చేయించడంవలన మీకు చాలా మంచిది,
