బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ అక్షరంతో మీ పేరు ప్రారంభమైనవారి పూర్తి భవిష్యత్తు బయటపడింది.
ఏ అక్షరంతో పేరు ప్రారంభమైనవారి పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీకూడా మనం తెలుసుకుందాం.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఏ అక్షరంతో పేరు ప్రారంభమైన జాతకులయొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
మరి మీ పేరు ప్రారంభంలో ఏ అక్షరం ఉంటే, అది మీ వ్యక్తిత్వంగురించి ఏం చెబుతోంది, ఏ అక్షరంతో పేరు ప్రారంభమైనవారి వంద సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి స్వభావం, భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, ఇది వారి జీవితంలోని అనేక పార్శ్వాలను ఆవిష్కరించగలదు. ఎవరి పేరు అయినా అ లేదా ఏ అనే అక్షరంతో మొదలైతే, వారి జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో రూపుదిద్దుకుంటుంది, ఈ అక్షరం సౌరసెక్తికి, నాయకత్వానికి, ప్రారంభానికి ప్రతీకగా నిలుస్తుంది, ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల గురించి మనం ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం.
ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులలో ప్రప్రథమంగా కనిపించే లక్షణం అపారమైన ఆత్మవిశ్వాసం, వీరు ఏదైనా కార్యాన్ని తలపెడితే, దానిని సాధించగలమనే నమ్మకం వారిలో బలంగా ఉంటుంది, ఈ ఆత్మవిశ్వాసమే వారిని అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది. వీరిలో సూర్యుని వంటి తేజస్సు, ప్రకాశం ఉట్టిపడుతూ ఉంటాయి, వీరు ఎక్కడున్నా తమ ఉనికిని చాటుకుంటారు, నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు, వీరి మాటల్లో, చేతల్లో ఒక రకమైన అధికార దర్పం కనిపిస్తుంది. ఇది ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది లేదా ప్రభావితం చేస్తుంది, నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే అబ్బుతాయి, ఒక సమూహాన్ని నడిపించాలన్నా, ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా వీరు ముందుంటారు, వీరిలో సృజనాత్మకత కూడా అధికంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో, వినూత్నమైన పద్ధతులతో పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు, ఏ రంగంలోనైనా తామే ప్రథమ స్థానంలో ఉండాలనే తపన, పోటీతత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి, ఇది వారిని నిరంతరం శ్రమించేలా, ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సహిస్తుంది.
వీరి స్వభావంలో జాలి, దయ, కరుణవంటి సున్నితమైన భావాలు కూడా అధికంగా ఉంటాయి, ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు, వారికి తమకు తోచిన సహాయం చేయడానికి వెనుకాడరు, మంచి మనసు, ఉదార స్వభావం కలిగీ ఉంటారు. అయితే, వీరి మంచితనాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకునే ప్రమాదం కూడా ఉంది, అందుకే, ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఎవరు నిజంగా అర్హులో తెలుసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే, ఆర్థికంగా, మానసికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వీరు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు, ఏ పని చేపట్టినా దానిని పూర్తి శ్రద్ధతో, అంకితభావంతో చేస్తారు, అడ్డదారులలో విజయం సాధించడం వీరికి నచ్చదు, నిజాయితీగా, ధర్మబద్ధంగా శ్రమించి గెలుపొందాలనేదే వీరి సిద్ధాంతం, ఈ లక్షణమే వీరికి సమాజంలో మంచి పేరు, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.
కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఏ అక్షరం పేరులో మొదటిదిగా ఉన్నవారు కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు, కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు, అయితే, కొన్నిసార్లు వీరిలోని అధికార స్వభావం లేదా ముక్కుసూటితనంవల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. వీరు తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తారు, ఇది కొన్నిసార్లు ఇతరులకు కటినంగా అనిపించవచ్చు, అయినప్పటికీ, వీరి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు, ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో వీరు ముందుంటారు, బంధువులు, స్నేహితుల నుంచి వీరికి సహాయ సహకారాలు ఆశించినంతగా లభించకపోవచ్చు, చాలా సందర్భాలలో వీరు ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ, వీరు నిరాశ చెందరు, తమ కాళ్లపై తాము నిలబడి, ఎవరి సహాయం లేకుండానే జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకుంటారు, అంతేకాదు, అవసరమైతే తమ బంధువులకు, స్నేహితులకు ఆర్థికంగా, ఇతరత్రా విధాలుగా సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు, ఇతరుల బాధ్యతలను కూడా స్వీకరించి, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు.
విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాలలో 'ఏ' అక్షరం పేరులో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు, వీరికి సహజంగానే గ్రహణసెక్తి ఎక్కువగా ఉంటుంది, ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకుంటారు. చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండాలనే పట్టుదల ఉంటుంది, ఉన్నత విద్యను అభ్యసించి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, ఉద్యోగంలో కూడా తమ ప్రతిభతో ఉన్నత పదవులను అలంకరిస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలనా విభాగాలు, రాజకీయాలు, యాజమాన్య పదవులు వీరికి బాగా సరిపోతాయి. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉండటంవల్ల, ఒక బృందాన్ని నడిపించే ఉద్యోగాలలో సులభంగా విజయం సాధిస్తారు, వ్యాపార రంగంలో కూడా వీరు తమదైన ముద్ర వేస్తారు, కొత్త వ్యాపారాలను ప్రారంభించాలనే ఉత్సాహం, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటాయి. రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు, అయితే, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక విషయాలలో మోసపోయే అవకాశం ఉన్నందున, ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. చాలా మంది ఏ అక్షరం కలవారు తమ జన్మస్థలాన్ని వదిలి, వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లి జీవనోపాధిని వెతుక్కోవడం, అక్కడ స్థిరపడి అఖండమైన విజయాన్ని సాధించడం జరుగుతుంది, సంఖ్యాశాస్త్రం ప్రకారం, పుట్టిన ఊరికి దూరంగా వెళ్లినప్పుడే వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పబడింది.
ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఏ అక్షరం వారు సాధారణంగా మంచి ఆర్థిక స్థితిని కలిగీ ఉంటారు, కష్టపడి పనిచేసే తత్వం, ధన సంపాదనపై ఆసక్తి ఉండటంవల్ల వీరికి డబ్బుకు లోటు ఉండదు, అయితే, వీరు ఎంత సంపాదించినా, దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇతరులకు సహాయం చేసే గుణంవల్ల, దానధర్మాలవల్ల ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టే అవకాశం ఉంది, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు, ఆర్థిక ప్రణాళిక విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. అనవసరమైన ఖర్చులను తగ్గీంచుకుని, పొదుపు చేయడంపై దృష్టి సారిస్తే, భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలంగా ఉంటారు, వీరు సమాజంలో ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. తాము చేసే పనుల ద్వారా, తమ వ్యక్తిత్వం ద్వారా అందరి మన్ననలను పొందుతారు, ఎవరూ సాధించలేని గొప్ప కార్యాలను సాధించాలనే తపన వీరిలో నిరంతరం రగులుతూ ఉంటుంది, అందుకోసం తీవ్రంగా శ్రమించి, అనుకున్నది సాధిస్తారు.
ఆరోగ్యం విషయంలో ఏ అక్షరం వారు సాధారణంగా మంచి శారీరక దారుఢ్యాన్ని కలిగీ ఉంటారు, వీరిలో జీవసెక్తి ఎక్కువగా ఉంటుంది, సూర్యునికి సంబంధించిన అక్షరం కాబట్టి, వీరిలో ఉష్ణతత్వం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, పిత్త సంబంధమైన సమస్యలు, గుండె, కడుపు, కంటికి సంబంధించిన సమస్యలు, అజీర్తి, అధిక రక్తపోటు వంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం వీరికి చాలా శ్రేయస్కరం, ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, ధ్యానం, యోగా వంటివి చేయడంవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి, సమయానికి భోజనం చేయడం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
కొన్నిసార్లు వీరి స్వభావంలో చంచలత్వం కనిపించవచ్చు, అంటే, ఒక విషయంపై ఎక్కువసేపు మనసు నిలపలేకపోవడం, త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోవడం వంటివి జరగవచ్చు, దీనిని ఫికల్ మైండ్ అని కూడా అంటారు, అయితే, ఈ చంచలత్వం ఉన్నప్పటికీ, ఇతరుల దుక్కాలును పంచుకోవడంలో వీరు ముందుంటారు. ఎదుటివారి బాధను తమ బాధగా భావించి, వారికి సాంత్వన చేకూర్చడానికి ప్రయత్నిస్తారు, సమాజంలో ప్రేమను, శాంతిని విస్తరింపజేయడానికి కృషి చేస్తారు, వీరి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. సద్గుణ సంపద, అంటే మంచి నడవడిక, మంచి భావాలు వీరి సొంతం, దీనివల్ల జీవితంలో అద్భుతమైన గౌరవ మర్యాదలను పొందుతారు, సమాజంలో అందరూ వీరిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది.
జ్యోతిష్యం ప్రకారం, ఏ అక్షరం సూర్య గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు, సూర్యుడు ఆత్మ, అధికారం, తేజస్సు, ఆరోగ్యం, తండ్రికి కారకుడు, అందువల్ల, ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ప్రతిరోజూ సూర్యారాధన చేయడం చాలా మంచిది. ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను పటించడంవల్ల వారి జీవితంలోని అడ్డంకులు తొలగీపోయి, విజయం వరిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఎరుపు, నారింజ రంగులు వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, ఆదివారం వీరికి అనుకూలమైన రోజు.
ముగీంపుగా చెప్పాలంటే, ‘ఏ’ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు అద్భుతమైన లక్షణాలను కలిగీ ఉంటారు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ పటిమ, కష్టపడి పనిచేసే తత్వం, దయాగుణం, ఉన్నత ఆశయాలు వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరవేస్తాయి. కొన్ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ, తమలోని పాజిటివ్ సెక్తులను సద్వినియోగం చేసుకుంటే, వీరు తాము ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజేతలుగా నిలుస్తారు, సమాజానికి మార్గదర్శకులుగా, స్ఫూర్తి ప్రదాతలుగా వెలుగొందుతారు. వీరు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతర కృషి, పట్టుదల అవసరం, ఇతరుల మాటలకు కుంగీపోకుండా, తమ అంతరాత్మ చెప్పినట్లు నడుచుకుంటే, వీరి జీవితం సకల సౌభాగ్యాలతో, యశస్సుతో విరాజిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని, ముందుకు సాగీపోయే సెక్తిని కలిగీ ఉంటారు, వీరి ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.
