వృశ్చికరాశివారికి రెండువేల ఇరవై ఐదవ సంవత్సరములో ఈ దేవత అతిథిగా రాబోతున్నది, అయితే ఈ రాశివారికి గోచారఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో, ఏ దేవత వీరి ఇంటికి అతిథిగా రాబోతుంది, ఆ దేవతయొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈరాశివారు ఏం చేయాలి, ఆ దేవతయొక్క అనుగ్రహంతో వృశ్చికరాశివారి జీవితం ఏవిధంగా మలుపు తిరుగుతుందో, ఈ పూర్తి అంశాలన్నీకూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం,
జ్యోతిష్య శాస్త్రంప్రకారం ద్వాదశ రాశులలో ఈ వృశ్చికరాశి, రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి, విశాఖ నక్షత్రం 4 వ పాదం, జ్యేష్ఠా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వ్యక్తులు వృశ్చికరాశి పరిధిలోకి వస్తారు.
ఈ రాశియొక్క అధిపతి కుజుడు, ఈ వృశ్చికరాశివారియొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లైతేగనక రహస్య స్వభావులు అని చెప్పుకోవాలి, అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వారు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాలుగురించి కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. తమ విషయాలు ఏవిధంగా అయితే గోప్యంగా ఉంచుతారో, అలాగే వేరే వారి పర్సనల్ విషయాలుకూడా ఇతరులకు చెప్పకుండా అంతే గోప్యంగా ఉంచుతారు.
వృశ్చికరాశివారు అత్యంత స్నేహశీలురు మరియు విశ్వసనీయులు. తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారు, వీరి నాయకత్వ లక్షణాలు అసామాన్యమైనవి, ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధతో, నిబద్ధతతో పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పరిశోధనా దృక్పథం, లోతైన విశ్లేషణాసెక్తివీరిని విజేతలుగా నిలబెడుతుంది.
వీరు మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు, వీరి కళాదృష్టి సృజనాత్మకత అద్భుతమైనది, వీరు తమ భావోద్వేగాలను లోతుగా అనుభూతి చెందగలరు, ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు.
సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతిలో ఈ వృశ్చికరాశివారు అవలంభిస్తుంటారు. వీరిదగ్గర అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం, ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు వీరు చాలా తేలిక గా ఈజీగా గ్రహించగలుగుతారు. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి,వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి, ఉద్యోగపరంగా వీరు చాలా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.
వృశ్చికరాశివారు తమ లక్ష్యాలపై దృఢ నిశ్చయంతో ఉంటారు, వీరి ఆత్మవిశ్వాసం, ధైర్యం అనితర సాధారణం. కష్ట పరిస్థితులలో కూడా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు, వీరి అంతర్ జ్ఞానం చాలా బలమైనది, దీని వల్ల సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
అలాగే వీరియొక్క జాతకాన్ని చూసినట్లైతేగనక చాడీలు చెప్పే వారివల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు నమ్మే సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మార్చుకునే వ్యక్తిత్వం అనేది వీరికి అస్సలు ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణము ఔతుంది, జీవితములో ఎదగక పోవడానికి కారణంకూడా ఇదే అవుతుంది. మంచితనం పట్టుదలగా ఉండటానికి కూడా ఇదే కారణం అవుతుంది, అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరియొక్క జీవితానికి మంచి మలుపును దారి తీస్తాయి.
అయితే ఈ వృశ్చికరాశివారి జాతకం చూసుకున్నట్లయితేగనుక రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో వీరియొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు, ఎందుకంటే వీరి ఇంటికి ఒక దేవత రాబోతున్నారు, మీరు ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం రానే వచ్చింది. ఎందుకంటే మీరు చాలా రోజులనుండి అనేకరకాల సమస్యలతో సతమతమవుతూ మీ జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయో, ఎప్పుడు మీ జీవితంలో అభివృద్ధిని చూస్తారో, ఈ కష్టాల సుడిగుండంలోనుండి ఎప్పుడు బయటపడతామో అని మీరు ఎదురుచూస్తున్నట్లయితేగనుక, మీరు ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం రానే వచ్చిందని చెప్పాలి.
రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో మీ జీవితంలో మీరు ఊహించని అనుకూల పరిణామాలు అయితే ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే ఆ శ్రీమహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు, మీయొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి, మీ ఇంటికి ఆ శ్రీమహాలక్ష్మీదేవి స్వయంగా వస్తున్నారు, మీరు పడుతున్న కష్టాలనుండి విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికి, మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు, కాబట్టి మీరు సిద్ధం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆ యొక్క శ్రీమహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే మీకు పెట్టదలచారో, ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అయితేగనక మీ జీవితంలో కష్టాలనేవి ఉండవు, మీరు అనుభవిస్తున్న ప్రత్యేక బాధలకి సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది, మీకున్న సమస్యలనుండి విముక్తులు కాగలరు, అలాగే ఆ శ్రీమహాలక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ఆర్థికంగాకూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు, కాబట్టి ఈ రాశివారు రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో మీ జీవితంలో సానుకూల ఫలితాలను చూడాలని అనుకుంటేగనుక, మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే, ఆ దేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులవ్వాలి, ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెబుతూనే ఉంటారు కదండీ, ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు పరీక్షలు పెడుతుంటాడు, అంటే కష్టాలు ఎక్కువగా రావడం, కష్టాల్లో ఉన్నవారికీ మనం సహాయం చేస్తామా లేదా, ఇటువంటి అనేకరకాల పరీక్షలు భగవంతుడు పెడుతూ ఉంటాడు. అయితే ఈసమయంలో ఆ శ్రీమహాలక్ష్మీదేవి మీకు ఎటువంటి పరీక్షలు పెట్టబోతున్నారు జాగ్రత్తగా ఉండండి, ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వండి, అప్పుడే ఆ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్ధిస్తుంవి, ముఖ్యంగా మీయొక్క జీవితంలో మీకు చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, పేదలు, అభాగ్యులు, అనాధలు కావచ్చు, ఇలా ఎవరైనా ఏ ఒక్కరు కనిపించినాకానీ వారికి తోచిన సహాయం చేయండి, అంటే మీ సెక్తిమేరకు మాత్రమే సహాయం చేయండి, సెక్తికి మించి మీరు బాధపడి వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదండి, ఎప్పుడుకూడా భగవంతుడు ఈ విధంగా అసలు చెప్పనే చెప్పడు, ఎందుకంటే సెక్తికి మించి ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలను కొనితెచ్చుకోకండి, సెక్తి ఎంతవరకైతే ఉంటుందో, అంతవరకుమాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది. మీకంటే పేదవాళ్ళు మీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకున్నవారికి సహాయం చేయండి, అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన ఆ శ్రీమహాలక్ష్మీదేవి మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి అనుగ్రహిస్తుంది, అలాగే ఇంటికి ఒక వ్యక్తి సహాయం కోసం వచ్చినగాని లేకపోతే తాను ఏ రూపంలో ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థించినకానీ వారికి తోచినంత సహాయం చేయండి, ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తులరూపంలో మాత్రమే కాదు, సుపరిచితులరూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని కోరవచ్చు, బంధువులుగా కానీ, ఆత్మీయులుగాకానీ, మీ స్నేహితులరూపంలోకానీ ఇరుగుపొరుగు వ్యక్తులురూపంలోకానీ, మీ ఇంటికి వచ్చి మీ సహాయాన్ని కోరవచ్చు, మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని చేస్తేగనక ఆ మహాలక్ష్మీదేవియొక్క అనుగ్రహాన్ని కచ్చితంగా పొందుతుంటారు, మీ జీవితంలో సుఖసంతోషాలకు లోటు అనేది ఉండదు, మీ జీవితంలో మీరు మునుపెన్నడూ లేనటువంటి అష్టైశ్వర్యాలు సకల శుభాలను మీరు పంచుకోగలుగుతారు.
వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా, వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశకు లోనవుతున్నారు, ఉద్యోగ జీవితంపై అధికారుల ప్రశంసలు దక్కడంలేదని, మీయొక్క శ్రమను ఎవరూ గుర్తించడంలేదని, మీకు చాలాకాలంగా ఉద్యోగం రావడంలేదని, కొంతమంది ఆశించిన మార్పు రావడంలేదని, ప్రమోషన్లు దొరకడంలేదని ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని, మీయొక్క కుటుంబ జీవితం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని ఈవిధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి, ఇక మీ సమస్య ఏదైనాసరే ఆ శ్రీమహాలక్ష్మీదేవియొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగితే మీరు అదృష్ట ఫలితాలు కచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సకలశుభాలనుకూడా మీరు పొందుతారు. ఆర్థికంగా కూడా మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరే చూస్తారు, ఘననీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు.
ఉద్యోగవిషయంలో వ్యాపారవిషయంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటిని అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలుమాత్రమే కాదు, అనారోగ్య సమస్యలకుకూడా మీకు విముక్తి అయితే లభిస్తోంది, ఎందుకంటే ఆ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకుగనక కలిగితే కేవలం మీకు డబ్బుపరమైన సమస్యలుమాత్రమే తొలగిపోతాయని చాలామంది అపోహ పడుతుంటారు, కానీ అది నిజం కాదు, ఆ శ్రీమహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతినే కాదు, కుటుంబంలో ప్రశాంతతను కలగచేస్తుంది, అలాగే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాటినుండి విముక్తులుకూడా చేస్తోంది, ఆ శ్రీమహాలక్ష్మీ దేవియొక్క అనుగ్రహాన్ని మీరు అందుకోగలిగితే అతిథిగా వచ్చిన ఆ శ్రీమహాలక్ష్మీదేవిని సంతృప్తి పరిచినట్లయితే, మీ జీవితంలో దేనికి డోకా అనేది ఉండదు, అదృష్ట ఫలితాలైతే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
అలాగే ప్రాణం పోయినాసరే వృశ్చికరాశివారు రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకూడదు, ఒకవేళ ఇచ్చారంటేమాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొనితెచ్చుకున్నట్లు అవుతుంది, కాబట్టి ఈ ఒక్క వస్తువుని ఎవరికికూడా ఇవ్వకూడదు, అదే దానంగా కావచ్చు, ఎవరికైనా సహాయం చేయడానికి కావచ్చు, బదులుగా కావచ్చు, ఎవరికీకూడా ఈ ఒక్క వస్తువుని ఇవ్వకూడదు, ఆ వస్తువు ఏమిటి అలాగే వృశ్చికరాశివారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించ బోతున్నారు, ముఖ్యంగా రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినాసరే బదులుగా ఇచ్చినాసరే, అపారమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది, లక్ష్మీదేవియొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది, అయితే ఈయొక్క గ్రహస్థితి అనేది ఈ రాశివారికి కొన్ని అంశాలు అనుకూలం, కొన్ని అంశాలలో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.
రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో ఈ రాశివారు అనుకూల ఫలితాలను కొన్నింటిని చూడబోతున్నారు, ముఖ్యంగా వ్యాపారంలో వృద్ధినైతే చూస్తారు, వ్యాపారం జీవితంలో మునుపు మీరు ఎటువంటి సమస్య అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో, ఆ సమస్యలన్నింటికికూడా పరిష్కారాన్ని, ఈ సమయంలో మీరు అన్వేషించబోతున్నారు, భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికీ కొంచెం ప్రతికూలతే ఉంది, భాగస్వాములతో విభేదాలు వస్తాయి, అయినప్పటికీ వాటిని నియంత్రించుకోగలిగితే, జాగ్రత్తపడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి ఢోకా కనిపించడం లేదు, వినియోగదారులతో మీకు కొంచం విభేదాలున్నాయి, కాబట్టి మీయొక్క మాట కటినంగా ఉండకుండా జాగ్రత్త పడండి, ఉద్యోగస్థుల వివరాలు చూస్తేగనక అనుకూల ఫలితాలున్నాయి, ముఖ్యంగా మీ ఉద్యోగజీవితంలో పై అధికారుల ప్రశంసలు మీకు ఈ మాసంలో దక్కుతాయి, పనిలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలుకూడా లభిస్తాయి, ఆర్థిక పెరుగుదలకోసం ఎదురుచూస్తున్నవారికి దానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరినుంచి ఇరుగు పొరుగువారు కావచ్చు, మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కావచ్చు, మీకు విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి ఈ అంశంలోమాత్రం అత్యంత జాగ్రత్త పడడం చాలా అవసరం.
ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ముఖ్యంగా జీర్ణసంబంధిత సమస్యలతో మీరు కొంత బాధకు గురయ్యే అవకాశాలున్నాయి, కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం, కెరీర్ పరంగా అవకాశాలకోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో, వారికి కాస్త ఆలస్యం జరిగినాకానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది, ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ రాశివారికి అందించబోతున్నాయి.
ముఖ్యంగా విషయంలోకి వస్తే, రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో ఈ ఒక్క వస్తువు ఎవరికైనాసరే బదులుగా ఇచ్చిన దానంగా ఇచ్చినకాని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది, కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోకూడా మీరు ఈ ఒక్క వస్తువు ఎవరికీ ఇవ్వకూడదు, ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు, పసుపు చాలా మంగళకరమైన పదార్థం. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనదని మనకు తెలుసు, పసుపు బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కదా, పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యంకూడా జరగదు, ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకు చాలా అంటే చాలా ప్రాధాన్యతకూడా ఉంటుంది, అయితే మనం దీన్ని ఆధ్యాత్మికపరంగా అంటే పూజలు, వ్రతాలు, నోములు వినియోగించడంతోపాటుగా వంటల్లో కూడా కచ్చితంగా వాడుతూ ఉంటాం, ఇది వంటలకు రుచితోపాటు రంగునుకూడా అందిస్తూ ఉంటుంది, ఇలా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, అలాంటి పసుపును రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో ఎవరికి ఇవ్వకూడదు, అంటే కొంతమంది ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనాసరే ఇంట్లో వంటలకోసం కొంచెం పసుపు అయినసరే కొన్నికొన్ని సందర్భాల్లో వారి ఇంట్లోకనుక నిండుకుంటే అడుగుతుంటారు, ఈవిధంగా ఎవరైనా అడిగారంటే నిర్మొహమాటంగా లేదని చెప్పడం లేదా ఇవ్వమని చెప్పడంకానీ చేయండి, ఒకవేళ ఇచ్చారంటేమాత్రం మీరు లేనిపోని కష్టాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది, మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది, ఏవిధంగా అయితే పసుపుని ఇంట్లోనుంచి బయటకు వెళ్లిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవికూడా మీ ఇంట్లోనుండి అడుగు బయటకి వెళ్లిపోతుంది, కాబట్టి మీరు లక్ష్మీదేవియొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో పసుపుని ఎవరికీ ఇవ్వకూడదు, పసుపును బంగారంతో సమానంగా మనం భావిస్తుంటాం. ముఖ్యంగా వీరియొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రెండువేల ఇరవైఐదవ సంవత్సరములో పసుపుని ఎవరికైనాసరే సహాయంకోసం అంటే బదులుగా ఇచ్చినాసరే దానంగా ఇచ్చినాకాని, మీరు కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్లవుతుంది, కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరంకూడా ఈ సమయంలో వీరి జీవితంలో కనిపిస్తోంది, అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా కొంత మందికిస్తూ ఉంటారు కదండీ, ఆ విధంగాకూడా అస్సలు చేయకూడదండి, మీరు పసుపు ఎవరికైనా ఇచ్చారంటేమాత్రం లేనిపోని కష్టాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది, కాబట్టి ఎవరికీ పసుపు అనేది బదులుగాకూడా ఇవ్వకూడదు, ఈ ఒక్క విషయంలోమాత్రం మీరు జాగ్రత్త వహించాలి, అయితే మిగతా విషయాలన్నీ కొంచం అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎన్నో శుభఫలితాలను పొందడానికి ఈ రాశివారు ఎప్పుడుకూడా దానధర్మాలు చేయాలి, ముఖ్యంగా శ్రావణమాసం కార్తిక మాసంలో మీరు చేసే దానధర్మాలకు విశేషమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు, శివారాధనకూడా మీకు మేలు చేస్తుంది, విష్ణు సహస్రనామ పారాయణంకూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, ఆర్థికంగా పురోగతిని సాధించడంకోసం ప్రతిశుక్రవారం రోజూ ఆ శ్రీమహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించన కచ్చితంగా లక్ష్మీదేవియొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది, ఆర్థికపరమైన అంశాల్లో ఖచ్చితంగా ఊహించని పురోగతిని చూస్తారు.
