Loading...
loading

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశిలో జన్మించిన స్త్రీలయొక్క పూర్తిజాతకం బయటపడింది

  • Home
  • Blog
  • బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశిలో జన్మించిన స్త్రీలయొక్క పూర్తిజాతకం బయటపడింది

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశిలో జన్మించిన స్త్రీలయొక్క పూర్తిజాతకం బయటపడింది

బ్రమ్మంగారు కాల gnanam ప్రకారం తులారాశి స్త్రీలయొక్క జాతకముప్రకారం మనం చూసుకున్నట్లైతేగనక ఇక ఈ తులారాశి రాశిచక్రంలో ఏడో స్థానంలో ఉంటుంది, ఈ రాశి పరిధిలోకి చిత్త నక్షత్రం 3,4 పాదాలు, స్వాతి నక్షత్రం 1,2,3,4 పాదాలు, మరియు విశాఖ నక్షత్రం 1,2,3 పాదాలలో జన్మించినవారు వస్తారు.

ఈ నక్షత్రలోని పాదాలో జన్మించినవారిని తులారాశిగా అభివర్ణించటం జరుగుతూ ఉంటుంది, సాధారణంగా మహిళల వ్యక్తిగత లక్షణాలను గుర్తించగలిగీతే ఎవరైనా వారిని బాగా అర్థం చేసుకోవచ్చు, మహిళల లక్షణాలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత వారితో మనం మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎంతో మంచి వాతావరణం ఉంటుంది.

ఎప్పుడైతే మహిళల లక్షణాలను అర్థం చేసుకుంటామో అప్పుడు వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు, 12 రకాల రాశుల్లో పుట్టినటువంటి స్త్రీలయొక్క ప్రవర్తన 12 రకాలుగా ఉంటుంది, అంతేకాదు ఒకేరాశిలో పుట్టిన వివిధ నక్షత్రాల్లో పుట్టినటువంటి స్త్రీల ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది.

రాశిచక్రాలలో వారి ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది, అలాగే వారి జీవిత కాలాన్ని కూడా అది రాసి, వారి పుట్టినటువంటి నక్షత్రం ప్రకారం అంచనా వేస్తూ ఉంటారు, గ్రహాల మార్పులు అలాగే జన్మరాశి ఆధారంగా ఒక స్త్రీని అర్థం చేసుకోవడం ఐతే అంత సులభం కాదు, కానీ ఒక వ్యక్తి పాత్రని వారి లక్షణాలని ఎటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు లాంటి వాటిని మాత్రం అంచనా వేయొచ్చు.

మన ప్రాచీన వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, స్వభావాలు ఉంటాయి, ఆయా రాశులలో జన్మించిన వ్యక్తులపై ఆ రాశి అధిపతి, వారు జన్మించిన నక్షత్ర పాదాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది, రాశిచక్రంలో ఏడవ స్థానాన్ని అలంకరించే తులారాశికి శుక్రుడు అధిపతి, శుక్రగ్రహం అంటేనే అందం, ప్రేమ, కళలు, సుఖసంతోషాలు, విలాసాలకు ప్రతీక, అందువల్ల తులారాశిలో జన్మించిన స్త్రీలు ఈ లక్షణాలను సహజంగానే కలిగీ ఉంటారు.

ఈ తులారాశి స్త్రీలు కేవలం బాహ్య సౌందర్య ప్రియులే కాదు, అంతర్గత సౌందర్యానికి, సమతుల్యతకు, న్యాయబుద్ధికి, సహృదయతకు కూడా మారుపేరుగా నిలుస్తారు, వారి వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను, వారి అద్భుతమైన గుణగణాలను ఇప్పుడు మరింత లోతుగా పరిశీలిద్దాం.

తులారాశి స్త్రీలగురించి మాట్లాడగానే మొదటగా స్ఫురించేది వారి అనిర్వచనీయమైన ఆకర్షణ, సౌందర్యంపట్ల వారికున్న మక్కువ, శుక్రుడి శుభ ప్రభావంవల్ల వీరు పుట్టుకతోనే కళాత్మక దృష్టిని, అందాన్ని ఆరాధించే స్వభావాన్ని కలిగీ ఉంటారు, తమను తాము అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవడంలో వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

ఇది కేవలం ఇతరులను ఆకట్టుకోవడానికే కాదు, తమను తాము ప్రేమించుకునే, తమ వ్యక్తిత్వాన్ని గౌరవించుకునే విధానం కూడా, వీరి అలంకరణ ఎప్పుడూ హుందాగా, సందర్భానుసారంగా, అతి లేకుండా ఉంటుంది.

నాణ్యమైన వస్త్రాలు, సరిపోయే ఆభరణాలు, తమ అందాన్ని ఇనుమడింపజేసే సౌందర్య సాధనాల ఎంపికలో వీరి అభిరుచి అమోఘం, తమ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, హెయిర్ స్టైల్ గానీ చాలా డిగ్నిఫైడ్‌గా, ఆకట్టుకునేలా ఉంటాయి.

నిలువెత్తు అద్దంముందు నిలబడి తమ ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోవడం, తమ అందాన్ని ఆస్వాదించడం వీరికి సహజం, ఇది వారి ఆత్మవిశ్వాసానికి, స్వీయ ప్రేమకు నిదర్శనం, శారీరకంగా కూడా వీరు ఆకర్షణీయంగా ఉంటారు.

చాలామంది గుండ్రని, అందమైన ముఖం, విశాలమైన, ఆకర్షణీయమైన కళ్ళు, చిరునవ్వులు చిందించే పెదాలు, మంచి సెరీర సౌష్టవంతో చూడగానే కట్టిపడేస్తారు, ఎక్కువమంది తులారాశి స్త్రీలు మంచి సెరీర ఛాయతో, సగటుకంటే ఎక్కువ ఎత్తుతో ఉంటారు.

వీరి నడకలో, నిలబడే తీరులో, ప్రవర్తనలో ఒక విధమైన హుందాతనం, ఆకర్షణ ఉట్టిపడుతూ ఉంటాయి, ఇది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, వారి అంతర్గత ప్రశాంతత, సానుకూల దృక్పథం నుంచి వెలువడే ఒక సెక్తి వంతమైన వైబ్రేషన్.

తులారాశి చిహ్నమైన త్రాసు, సమతుల్యతకు, న్యాయానికి ప్రతీక, ఈ లక్షణాలు తులారాశి స్త్రీల రక్తంలోనే కలిసిపోయి ఉంటాయి, వారు జీవితంలో ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటారు.

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, వారు తొందరపడి ఒక నిర్ణయానికి రారు, సమస్యను అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తారు, ఇరుపక్షాల వాదనలను ఓపిగ్గా వింటారు, మంచి,చెడులను నిష్పక్షపాతంగా బేరీజు వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన, న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనడంలో వీరు సిద్ధహస్తులు.

అందుకే, వీరిదగ్గరకు తగాదాల పరిష్కారం కోసం వచ్చేవారు ఎందరో ఉంటారు, వీరు తమ తీర్పుతో ఇరువర్గాలవారికీ న్యాయం చేస్తారు, సామరస్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తారు, వీరి ఆలోచనా విధానం చాలా స్పష్టంగా, తార్కికంగా ఉంటుంది.

భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోరు, క్లిష్ట పరిస్థితులలో కూడా సమయస్ఫూర్తితో, విచక్షణతో వ్యవహరించగలరు, వీరిది ప్రాక్టికల్ దృక్పథం, ఏ పనైనా మొదలుపెట్టే ముందు దానివల్ల కలిగే లాభనష్టాలను జాగ్రత్తగా అంచనా వేస్తారు.

పైకి కనిపించే మృదుత్వానికి, సున్నితత్వానికి మించి వీరిలో అపారమైన అంతర్గత బలం, మానసిక స్థైర్యం దాగీ ఉంటాయి, వీరిని తరచుగా ప్రశాంతంగా కనిపించే సముద్రంతో పోలుస్తారు, సముద్రం పైకి ఎంత నిశ్చలంగా ఉన్నా, దాని లోతుల్లో ఎన్నో అలజడులను, సుడిగుండాలను దాచుకుంటుంది.

అదేవిధంగా తులారాశి స్త్రీలు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఇబ్బందులను, మానసిక సంఘర్షణలను, ఒడిదుడుకులను తమలోనే దాచుకుని, బయటకు మాత్రం ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా కనిపిస్తారు, వారి ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ చెరగదు.

ఆ చిరునవ్వు వెనుక ఎంతటి వేదన, పోరాటం ఉన్నాయో ఇతరులు ఊహించడం కష్టం, సమస్యలతో సతమతమయ్యే వారు ఎవరైనా వీరితో కాసేపు గడిపితే చాలు, వారి సమస్యలను మర్చిపోయి, ఉపశమనం పొందుతారు, అంతటి ప్రశాంతత, సానుకూల సెక్తి వీరిలో ఉంటుంది.

ఇది వారి బలహీనత కాదు, వారి అసాధారణమైన మానసిక దృడత్వానికి, సంయమనానికి నిదర్శనం, వీరికి తమ మీద, తమ సామర్థ్యం మీద అపారమైన నమ్మకం ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ, జీవితానుభవాలు ఎదురయ్యే కొద్దీ, వీరిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.

జీవితంపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది, దానితో ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొని, సులభంగా అధిగమించగల సత్తా వీరికి వస్తుంది, అపజయాలను చూసి కృంగీపోరు, వాటిని విజయానికి సోపానాలుగా భావించి, పాటాలు నేర్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగుతారు.

తమ అంతర్గత ఆలోచనలను, బాధలను అందరితోనూ పంచుకోరు, కానీ నమ్మకమైన కొద్దిమందితో మాత్రమే తమ మనసు విప్పుతారు, సంభాషణా నైపుణ్యాలలో తులారాశి స్త్రీలు అందెవేసిన చేయి.

వీరి మాటల్లో ఆకర్షణ, స్పష్టత, తర్కం కలగలిసి ఉంటాయి, తమ వాక్చాతుర్యంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు, తమ వాదనను సమర్థవంతంగా వినిపించి ఎదుటివారిని సులభంగా కన్విన్స్ చేయగలరు, అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, ఏ విషయాన్నైనా సూటిగా, సంక్షిప్తంగా, పాయింట్ టు పాయింట్ వివరిస్తారు.

వీరిలో మంచి విషయ పరి gnanam ఉంటుంది, ఏ రంగం గురించైనా సరే, అవగాహన ఉన్నవారిలా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలరు, వీరి ఆలోచనలు, అభిప్రాయాలు ఎదుటివారికి సులభంగా నచ్చుతాయి, చెడు ఆలోచనలు ఉన్నవారు కూడా వీరి మాటలకు ప్రభావితులై మారే అవకాశం ఉంది.

వీరు ఎదుటివారితో చాలా ఆచితూచి, వారి మనసు నొప్పించకుండా మాట్లాడతారు, ఇతరుల భావాలను గౌరవిస్తారు, అయితే, వీరితో వాదించి గెలవడం అంత సులభం కాదు, ఎందుకంటే వీరి వాదనలో తర్కం, న్యాయం ఉంటాయి.

వీరు కేవలం గంభీరంగానే ఉంటారని అనుకుంటే పొరపాటే, వీరికి హాస్యం అంటే చాలా ఇష్టం, తాము సరదాగా మాట్లాడటమే కాకుండా, తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఎప్పుడూ ఆహ్లాదకరంగా, నవ్వులతో నిండి ఉండేలా చూసుకుంటారు.

వీరి సంభాషణలో సున్నితమైన, తెలివైన హాస్యం మిళితమై ఉంటుంది, వీరు మంచి మేధావులు, వ్యూహాత్మకంగా ఆలోచించగలరు, ఎదుటివారి ఎత్తులకు పైఎత్తులు వేయడంలో నేర్పరులు, కానీ తమ తెలివితేటలను సాధారణంగా మంచి పనులకే ఉపయోగీస్తారు.

ప్రేమ, మానవ సంబంధాలు తులారాశి స్త్రీల జీవితంలో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి, శుక్రుడి ప్రభావంవల్ల వీరు ప్రేమకు, సామరస్యానికి పెద్ద పీట వేస్తారు, తమ భాగస్వామిని గాడంగా, నిజాయితీగా ప్రేమిస్తారు, వారినుంచి కూడా అంతే స్థాయి ప్రేమను, గౌరవాన్ని, ఆప్యాయతను, ప్రశంసలను ఆశిస్తారు.

సంబంధాలలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని, సమతుల్యతను కోరుకుంటారు, తమను ప్రేమించేవారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు, చాలామంది తులారాశి స్త్రీలకు ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ, దీనివల్ల భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఏర్పడి, వైవాహిక జీవితం సజావుగా, సంతోషంగా సాగుతుంది.

సంసారంలో ఏవైనా ఒడిదుడుకులు ఎదురైనా, వాటిని ఓర్పుతో, సామరస్యంగా పరిష్కరించుకునే నేర్పు వీరికి ఉంటుంది, వీరు తమ ఇంటిని కేవలం నివాస స్థలంగా కాకుండా, ఒక అందమైన, ప్రశాంతమైన స్వర్గంగా తీర్చిదిద్దుకోవాలని ఆరాటపడతారు.

ఇంటి అలంకరణలో వీరి కళాత్మక దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది, పిల్లల పెంపకంలో వీరు అత్యంత శ్రద్ధ వహిస్తారు, చిన్నతనం నుంచే వారికి క్రమశిక్షణ, నీతి నిజాయితీలు, పెద్దలపట్ల గౌరవం, సామాజిక బాధ్యతవంటి విలువలను నేర్పిస్తారు.

వారిని ప్రేమగా చూసుకుంటూనే, తప్పు చేసినప్పుడు దండించడానికి కూడా వెనుకాడరు, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తారు, ఒక ఆదర్శవంతమైన గృహిణిగా, ప్రేమగల తల్లిగా వీరు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

కుటుంబానికే పరిమితం కాకుండా, తులారాశి స్త్రీలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోరుకుంటారు, వీరు చాలా ఆశావహులు, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షిస్తారు, దానికోసం నిరంతరం శ్రమిస్తారు.

జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుని, పోటీతత్వంతో ముందుకు సాగుతారు, తమ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలనే తపన వీరిలో ఉంటుంది, అయితే, వీరు ఒకే రకమైన ఉద్యోగానికి లేదా వృత్తికి కట్టుబడి ఉండటానికి ఇష్టపడరు, మార్పును కోరుకుంటారు.

అందువల్ల, వీరి వృత్తి జీవితంలో తరచుగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది, కళలు, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్, మీడియా, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్, న్యాయవాద వృత్తి, కౌన్సెలింగ్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి రంగాలలో వీరు రాణించే అవకాశాలు ఎక్కువ.

వీరు పనిచేసే చోట కూడా క్రమశిక్షణ, పద్ధతి ప్రకారం పనులు జరగాలని కోరుకుంటారు, క్రమశిక్షణ లోపించినా, అన్యాయం జరుగుతున్నా వీరు అక్కడ ఇమడలేరు, ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, వీరు మాత్రం ఎలాంటి హడావుడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా, పద్ధతిగా తమ పనులను పూర్తిచేస్తారు.

సామాజికంగా, తులారాశి స్త్రీలు చాలా చురుకుగా ఉంటారు, వీరికి సహజంగానే మంచి ప్రజాకర్షణ సెక్తి ఉంటుంది, వీరి స్నేహశీల స్వభావం, మృదువైన మాట తీరు, న్యాయబద్ధమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి.

వీరికి విస్తృతమైన స్నేహితుల బృందం ఉంటుంది, స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు, తమ స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు, సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలతో జీవించాలని బలంగా కోరుకుంటారు.

తమ ఆత్మగౌరవానికి భంగం కలిగీతే అస్సలు సహించలేరు, ఎవరైనా వీరిని చిన్నచూపు చూసినా, చులకనగా మాట్లాడినా తీవ్రంగా ప్రతిఘటిస్తారు, వీరి గురించి ఎవరైనా లేనిపోని పుకార్లు సృష్టిస్తే, వాటిని పెద్దగా పట్టించుకోరు, తమ గురించి తమకు పూర్తి స్పష్టత ఉంటుంది.

తమలోని మంచి లక్షణాలను ఎలా గుర్తిస్తారో, తమలోని లోపాలను కూడా అలాగే గుర్తించి, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇది వీరి పరిణితికి నిదర్శనం, మనసులోని భావాలను, ముఖ్యంగా తమ బలహీనతలను అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు, ఇతరుల కుయుక్తులకు, మోసపూరిత మాటలకు అంత సులభంగా లొంగరు.

శుక్రగ్రహ ప్రభావంవల్ల వీరికి కళలపట్ల, ప్రకృతిపట్ల అమితమైన అభిరుచి ఉంటుంది, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యంవంటి లలిత కళలంటే వీరికి ప్రాణం, ఈ రంగాలలో ప్రవేశం లేకపోయినా, వాటిని ఆస్వాదించడంలో ముందుంటారు.

వీరు ఉండే ప్రదేశాన్ని, తమ ఇంటిని అందంగా, కళాత్మకంగా అలంకరించుకుంటారు, ప్రతి వస్తువు అమరికలోనూ వీరి కళాత్మక దృష్టి కనిపిస్తుంది, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని ప్రదేశాలు, పూల తోటలు, ప్రశాంతమైన వాతావరణం అంటే వీరికి చాలా ఇష్టం, అలాంటి ప్రదేశాలలో గడపడంద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు, వీరికి దూర ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే కూడా ఆసక్తి ఎక్కువ.

తులారాశి స్త్రీలలో సహజంగానే దయాగుణం, పరోపకార చింతన ఎక్కువగా ఉంటాయి, ఇతరుల కష్టాలను చూసి సులభంగా చలించిపోతారు, ఆపదలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి తమకు తోచిన సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

తమవల్ల ఇతరులకు మేలు జరగాలని కోరుకుంటారు, అయితే, ఒక్కోసారి ఈ అతి మంచితనం, అందరినీ నమ్మే గుణంవల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, ఎవరికి సహాయం చేస్తున్నామో పూర్తిగా తెలుసుకోకుండా, గుడ్డిగా నమ్మి సహాయం చేయడంవల్ల మోసపోవచ్చు లేదా చిక్కుల్లో పడవచ్చు.

కొన్ని సందర్భాల్లో, వీరు చేసిన ఉపకారమే అపకారంగా మారి, అవమానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు, కాబట్టి పరోపకారం చేసేటప్పుడు కాస్త విచక్షణతో, ముందుచూపుతో వ్యవహరించడం చాలా ముఖ్యం.

తుదిగా చెప్పాలంటే, తులారాశిలో జన్మించిన స్త్రీ సౌందర్యం, సమతుల్యత, తెలివితేటలు, దౌత్య నైపుణ్యం, అంతర్గత బలం, ప్రేమించే హృదయం, న్యాయబుద్ధి కలగలిసిన ఒక అరుదైన వ్యక్తిత్వానికి ప్రతీక, వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో శాంతి, సామరస్యం, అందం, న్యాయం పరిడవిల్లాలని కోరుకుంటారు.

జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను తమదైన ప్రశాంతతతో, చెరగని చిరునవ్వుతో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు, వారు అద్భుతమైన స్నేహితులుగా, ఆదర్శవంతమైన జీవిత భాగస్వాములుగా, అనురాగం పంచే తల్లులుగా, సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా తమదైన ముద్ర వేస్తారు.

వారు తమకు అప్పగీంచిన పనులలో క్రమశిక్షణ లోపిస్తే సహించరు, అంత ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తారు, తమ ఇంట్లో వారైనా, బయటి వారైనా న్యాయం విషయంలో అందరినీ సమానంగా చూసే గొప్ప గుణం వీరిది. వేద జ్యోతిష్యం వర్ణించినట్లుగా, తులారాశి స్త్రీ నిజంగా ఒక పరిపూర్ణ స్త్రీమూర్తికి నిలువెత్తు నిదర్శనం, వారి సహజమైన ఆకర్షణ, కళాత్మక హృదయం, సమతుల్య స్వభావం, న్యాయపరాయణత్వం వారిని ఎల్లప్పుడూ ప్రత్యేకంగా, ఉన్నతంగా నిలుపుతాయి.

తులారాశిలో జన్మించిన స్త్రీలు తమ జీవితంలో మరింత సానుకూలతను, శుభ ఫలితాలను పొందడానికి, ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడానికి వేద జ్యోతిష్య శాస్త్రం సూచించే కొన్ని సాధారణ పరిహారాలు ఇక్కడ చెబుతున్నాను, ఇవి చాలా సరళమైనవి, సులభంగా ఆచరించదగీనవి.

తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి, ఈ పరిహారాలు ప్రధానంగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఉద్దేశించినవి, అలాగే, సమతుల్యతను కాపాడుకోవడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి కూడా ఇవి సహాయపడతాయి.

ప్రతి శుక్రవారంనాడు లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది, తెల్లని పువ్వులు, పాలు, పాయసం లేదా తెల్లని మిటాయిలను నైవేద్యంగా సమర్పించవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం లేదా లలితా సహస్రనామం చదవడం శుభప్రదం, ఇది శుక్రుడిని బలపరుస్తుంది, ఐశ్వర్యం, సౌభాగ్యం, సౌందర్యం వృద్ధి చెందుతాయి.

శుక్రవారంనాడు ఓం శుం శుక్రాయ నమః అనే శుక్ర మంత్రాన్ని 108 సార్లు జపించడంవల్ల శుక్రగ్రహం నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాలు తగ్గీ, సానుకూల సెక్తి పెరుగుతుంది, శుక్రవారాల్లో తెలుపు, క్రీమ్ లేదా లేత గులాబీరంగు దుస్తులు ధరించడంవల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది.

సుగంధ ద్రవ్యాలు సెంట్లు, అత్తర్లు వాడటం, ముఖ్యంగా మంచి గంధం లేదా మల్లెపూల వాసనలు శుక్రుడికి ప్రీతికరం, ఆవులకు ఆహారం పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం కూడా మంచి పరిహారం.

శుక్రవారాల్లో పేదవారికి లేదా అవసరమైన వారికి బియ్యం, తెల్లని వస్త్రాలు, నెయ్యివంటి వాటిని దానం చేయడం చాలా మంచిది, ముఖ్యంగా చిన్న ఆడపిల్లలకు లేదా సుమంగళి స్త్రీలకు వీటిని ఇవ్వడంవల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

తులారాశివారికి వజ్రం ప్రధాన రత్నం, ఇది శుక్రుడి సెక్తిని పెంచుతుంది, అయితే, వజ్రం చాలా ఖరీదైనది మరియు అందరికీ సరిపడకపోవచ్చు, దీనికి బదులుగా ఒపల్ లేదా వైట్ సఫైర్ వంటి ఉపరత్నాలను కూడా ధరించవచ్చు.

రత్నాన్ని ధరించేముందు తప్పనిసరిగా అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుడిని సంప్రదించి, మీ వ్యక్తిగత జాతకానికి సరిపోతుందో లేదో నిర్ధారించుకున్న తర్వాతే ధరించాలి, లేకపోతే ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉంది.

అలాగే మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడంవల్ల జీవితంలో మరింత సానుకూలతను పొందుతారు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, మీ ఇల్లు, పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవడం శుక్రుడికి ఇష్టం, ఇది మీ మానసిక స్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

సంగీతం వినడం, నృత్యం చేయడం, చిత్రలేఖనం లేదా ఏదైనా కళను అభ్యసించడంవంటివి చేయడంవల్ల మీలోని సృజనాత్మకత పెరగడమే కాకుండా, శుక్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.

సమతుల్యత మీ రాశి లక్షణం కాబట్టి, జీవితంలోని అన్ని విషయాలలో అంటే ఆహారం, నిద్ర, పని, విశ్రాంతి సమతుల్యత పాటించడానికి ప్రయత్నించండి.

ఇతరులతో వ్యవహరించేటప్పుడు సామరస్యంగా, మృదువుగా మాట్లాడండి, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి.

ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి, ఇది మీ రాశి స్వభావానికి అనుగుణంగా ఉంటుంది, మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది.

ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం, అనవసర ఖర్చులను తగ్గీంచుకోవడం మంచిది, స్త్రీలను గౌరవించడం, వారికి సహాయపడటంవల్ల శుక్రుడు ప్రసన్నుడవుతాడు.

ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో కొద్దిగా యాలకుల పొడి లేదా పన్నీరు కలుపుకుని స్నానం చేయడంవల్ల రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉంటారు.

మీ పడకగదిలో లేదా ఇంట్లో తెల్లని లేదా లేతరంగు పూల మొక్కలను పెంచుకోవడం మంచిది, శివారాధన చేయడంవల్ల కూడా గ్రహదోషాలు తొలగీ, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఈ పరిహారాలు చాలా సాధారణమైనవి, వీటిని శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించడంవల్ల తులారాశి స్త్రీలు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి, సుఖసంతోషాలతో, ప్రశాంతంగా జీవించడానికి సహాయపడతాయి, గుర్తుంచుకోండి, పరిహారాలతో పాటు మీ స్వసెక్తి , కృషి, మంచి నడవడిక కూడా చాలా ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *