Loading...
loading

వృషభరాశికి సంబంధించి 10 గుండె పగిలే నిజాలు .

  • Home
  • Blog
  • వృషభరాశికి సంబంధించి 10 గుండె పగిలే నిజాలు .

వృషభరాశికి సంబంధించి 10 గుండె పగిలే నిజాలు .

ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి. వృషభరాశికి సంబంధించి గుండె పగిలే నిజాలు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మీరు తప్పక ఆశ్చర్యపోతారు. మీరు వృషభరాశిలో పుట్టినవారైనా లేదా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ గాని, లేకపోతే మీ జీవిత భాగస్వామికానీ వృషభరాశికి చెందిన వారైతే, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా తప్పక చూడాలి. గుండె పగిలే నిజం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
అలాగే ఈ వీడియో చూసేముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.

వృషభం అంటే ఎద్దు అని అర్థం, రాశిచక్రంలో వృషభరాశి రెండవ రాశి. వృషభరాశికి చెందినవారు చాలా దృడంగా మంచి కార్యాచరణ, కష్టించే తత్వాన్ని కలిగి ఉంటారు. వృషభరాశిలో కృత్తిక నక్షత్రంలోని 2,3,4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1,2,3,4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1,2 పాదాలు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి వృషభరాశిగా చెబుతూ ఉంటారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. స్థిరత్వముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యము కలిగి ఉండుట, ధృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారికి మూల సూత్రములు. వృషభరాశికి చెందినవాళ్లు వృషభరాశివారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి వుంటారు. ఎవరైననుగాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చినవారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు.

వృషభరాశివారు మాటతీరులో మృదువుగా, మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు, వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు, సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం ఉంటుంది. అలాగే వృషభరాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు, వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పొచ్చు. అందాన్ని ఆరాధిస్తారు, రసజ్ఞత కలిగిన వ్యక్తులు, సంగీతాన్ని కూడా అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు. ప్రకృతిని ఆరాధిస్తారు, ఎటువంటి అందాన్నైనా ఆరాధించ గలిగినటువంటి గొప్ప శక్తి వృషభరాశివారికి ఉంటుంది. కళల్ని, సంగీతాన్ని, నాట్యాన్ని, ప్రకృతిని, అందాన్ని వీరు ఎంతో అద్భుతంగా ఆస్వాదించ గలుగుతారు. అలాగే తాము ఏ స్థాయిలో అయితే ఇతరుల్ని ప్రేమిస్తున్నామో, ఇష్టపడుతున్నామో, గౌరవిస్తున్నామో, అదేస్థాయిలో ఎదుటి వ్యక్తినుంచి కూడా అంతే ప్రేమని ఆశిస్తారు.

వృషభరాశిలో పుట్టినవారికి సహనం చాలా ఎక్కువ . 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే, అది వృషభరాశి మాత్రమే. ఈ ఒక్క గుణంవల్ల వీరు చాలా ప్రత్యేకంగా, అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, అందరికి నచ్చేస్తారు. అలాగే వీరికి కొన్ని అభిప్రాయాలుంటాయి. ఆ అభిప్రాయాలు అందరికీ నచ్చేలా ఉంటాయి. అలాగే మంచి గుణగణాలతో గొప్ప శక్తులు కలిగిన వ్యక్తులుగా వీరు కనిపిస్తుంటారు. వీరు ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నారు అంటే, దాన్ని కచ్చితంగా సాధిస్తారు. తమని తాము అందంగా తయారు కావడానికి అందంగా ఇతరులకు చూపించడానికి, నలుగురిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి ఎంతో జాగ్రత్త తీసుకుంటారు.

అలాగే వీరికి ప్రతి అంశంలోనూ అతిజాగ్రత్త ఎక్కువ. వీరు ఇష్టపడి ప్రేమించే వ్యక్తులపట్ల అతి జాగ్రత్తకు ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి భాగస్వామిని వీరు ఎంతో ప్రేమాభిమానాలతో ఆరాధిస్తారు. వీరికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా, ఒక మొండితనం అనేటువంటి లక్షణం వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కేవలం వీళ్ళని మాత్రమే కాదు, వీరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళని కూడా ఈ మొండితనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదైనా ఒక విషయంలో ఖరాఖండిగా ఒక మాట అన్నారనుకోండి, తర్వాత వాళ్ల మనసు కనిపించినా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గరు. మొండి స్వభావం కలిగినవారు. స్థిరమైన స్వభావాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కోపం కూడా ఎక్కువే, ఊరికే కోపం వచ్చేస్తుంటుంది, ఎంత తొందరగా కోపం వచ్చినా కూడా కోపం ఎక్కువసేపు ఉండదు. ముఖ్యంగా వారి మనసులో ఉన్న వ్యక్తులపట్ల, వారికి కావాల్సిన వ్యక్తులపట్ల, కోపం ప్రదర్శి స్తారు. కానీ దాన్ని ఎక్కువసేపు కొనసాగించలేకపోతారు. దాని నుంచి చాలా తొందరగానే బయటపడి, ఆ విషయాన్ని కూడా అంత తొందరగా మర్చిపోతారు. కొంత మంది ఉంటారు, ఏదైనా ఒక చెడ్డ విషయం జీవితంలో జరిగితే, దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు కానీ, భవిష్యత్తులో మళ్లీ సందర్భం వచ్చినప్పుడు దాన్ని ప్రస్తావించి, పాతవన్నీ తవ్వుతూ ఉంటారు. కానీ వృషభరాశివారు అలా కాదు, ఒక్కసారి ఏదైనా తప్పు క్షమించారు అంటే, ఇంకా జీవితంలో ఆ తప్పు గురించి ఆలోచించటం కాని, దాని గురించి కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. గతం గతః అనేటువంటి లక్షణం వృషభరాశివారిలో ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా చుట్టూ ఉన్న అత్యంత తెలివైన వ్యక్తుల్లో వృషభరాశివారు ముందు వరుసలో ఉంటారు. అన్ని విషయాల్లో కూడా చాలా కష్టపడి పని చేస్తారు. ఈ రాశిలో పుట్టినవారిని గనుక పెళ్లి చేసుకోవాలన్న, ప్రేమలో పడేయాలన్న, వీరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే మీకు ఇంకా జీవితం ఆనందంగా ఉంటుంది.

వృషభరాశివారు స్వతంత్రంగా ఉంటారు. వీరి కెరీర్ లో ఎంచుకున్న రంగంలో బాగా స్థిరపడతారు. మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు, వాస్తవంలో బతుకుతారు. ఊహా ప్రపంచంలో ఎక్కువ సమయాన్ని వృధా చేయరు. అనుకున్నది సాధించడం కోసం ఎప్పుడు ఏది ఎలా చేయాలనే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉంటారు.

వృషభరాశివారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దానికొరకు ఎంతో ధనవ్యయం చేస్తారు‌. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం.

వృషభరాశిలో పుట్టినవారు, వారిని వారు నిత్యం తర్ఫీదు ఇచ్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదో ఒక అంశాన్ని తెలుసుకుంటూనే నేర్చుకుంటూనే ఉంటారు. ఇతరులపట్లకూడా ఎంతో విశ్వాసంగా ఉంటారు. బాగా ఆలోచిస్తారు, ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి మంచి పరిష్కార మార్గాన్ని, వీరు చెప్ప గలుగుతారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా బాగా ఆలోచిస్తారు. అది జీవితానికి సంబంధించినది అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. కావాలంటే మీరే గమనించండి. ఎవరైనా వచ్చి మీతో జీవితాన్ని పంచుకోవాలి లేదా ఐ లవ్ యూ అనో, లేకపోతే మీరు అంటే ఇష్టం అని చెప్తే, దానికి రెస్పాండ్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు, నమ్మకస్తులనే చెప్పాలి.

అలాగే వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు. అయినవాళ్ళకైనా, స్నేహితులకైనా ఏ మాత్రం కొంత పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే, కష్టాల్లో ఉంటే వారికీ వెన్నుదన్నుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే, వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మోసం చేయడం గురించి కూడా ఎప్పుడు ఆలోచించరు, అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరివల్ల కాదు కూడా. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించేవారిపట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారిస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదు.

వీరు ఎక్కువగా సినీ రంగంలోనూ, కళారంగాలలోను బాగా స్థిరపడతారు. వ్యాపారంలో కూడా వీరు మంచి స్థాయికి వెళ్లేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఎంత సౌమ్యంగా ఉన్నా కూడా, ఒక సందర్భంలో వృషభరాశిలో పుట్టినవారు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది. దీనివల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వృషభంరాశి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వృషభరాశిలో అతికొద్దిమందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి. కొంతమందికి లైంగిక బలహీనతతో కూడా బాధపడుతుంటారు. కిడ్నీ, మెడ, గొంతు, ఇతర వ్యాధులు కూడా వీరికి వస్తూ ఉండొచ్చు. కానీ ఇవేమీ జీవితకాలం బాధపెట్టే వ్యాధులు అయితే కాదు. మంచి వ్యక్తిత్వం, మంచి ఆహారపు అలవాట్లు, వృషభరాశివారి సొంతం.

అలాగే వీరు సాంప్రదాయ అభిప్రాయాలు కలిగి ఉంటారు. దీనివల్ల ఎమౌతుందంటే జీవిత భాగస్వామికి ఎక్కువ స్వేచ్ఛనివ్వరు. అలాగే వృషభరాశివారికి చెడు అలవాట్లకి తొందరగా బానిసలైపోయేటువంటి ఒక బలహీనత ఉందని చెప్పాలి. దీని కారణంగా ఎవరినిపడితే వారిని స్నేహితులుగా చేసుకోవటానికి వీరు ఇష్టపడరు. మానసికంగా కూడా వీరు అనారోగ్యానికి గురయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభరాశివారు లెక్కల విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనే చందంగా వీరు వ్యాపారంలో మసలుకుంటారు. వీరిని కొన్నాళ్లపాటు కష్టాలు భయపెడతాయి. కానీ వీరు అస్సలు భయపడరు, అదృష్టానికి దగ్గరగా నడుస్తూ ఉంటుంది వీరి జీవితం.

వృషభరాశివారు అదృష్టపురంగు తెలుపు, అదృష్టసంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి, మంచి పదవులు, పొందే అవకాశం ఉంటుంది. మంచి ధనసంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది.

వృషభరాశిఆధ్యాత్మిక విషయాలు సేవాకార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాధిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే, ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు.

వివాహానంతర జీవితము బాగుంటుంది. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారము లభిస్తుంది. అనుకున్న పనిని సాధించే వరకూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు

చూసారు కదా, వృషభరాశివారి వ్యక్తిత్వం, వారి గుణగణాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ రామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ల్ని క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *