Loading...
loading

తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు.

  • Home
  • Blog
  • తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు.

తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు.

ఓం శ్రీ మాత్రే నమః, అందరికీ నమస్కారమండి, ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశివారియొక్క జీవితంగురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు, మీ లైఫ్ సెటిల్ చేయడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, వారు ఎవరు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం, కాబట్టి వీడియోని ఎక్కడాకూడా స్కిప్ చేయకుండా చివరివరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్ధం అవుతుంది, అలాగే జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి.

ఇక వివరాల్లోకి వెళ్తేకనక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలులో జన్మించినవారు తులారాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు, ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరియొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తేగనక తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగీ ఉంటారు. అలాగే అలంకార ప్రియులు, అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, అందంగా రెడీ అవ్వడం కోసం అంటే అలంకరించుకోవడం కోసం ఎక్కువగా టైమ్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దంముందు గంటల తరబడి నిల్చుని ఉంటారు. అయితే తులారాశివారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంది కదా, వీరికి తెలివితేటలు లేవు అనుకుంటేమాత్రం పొరపాటే, ఎందుకంటే తెలివితేటలుకూడా వీరికి అంత అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆలోచన సెక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యతను కూడా వీరు కలిగీ ఉంటారు. అలాగే వీరు జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే సెక్తి సామర్థ్యాలుకూడా కలిగీ ఉంటారు, అంటే నిరాశ పడుతున్నట్లుగా కనిపిస్తోంది, కానీ కచ్చితంగా వాటిని అధిగమించే సెక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి. అయితే నేర్పరితనంతో చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకో గలుగుతారు. అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు, అంటే వీరియొక్క విశాల భావాలు చూసి కావచ్చు, సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనలు చూసి కావచ్చు, చాలామంది వీరిపట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే ఈయొక్క తులారాశివారు అపజయాలు చూసి కుంగీపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశివారియొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ లైఫ్ సెటిల్ చేయడానికి చాలా చాలా వారు ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిపైన కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటామో మనకి అర్ధం కాదు. అంటే వారు బాగుండాలని అలాగే ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగీపోవాలని భావిస్తుంటాం. అంటే అది ఆకర్షణ అని చెప్పాలి అంటే అది ప్రేమ అని చెప్పలేము, ఇష్టం అని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము, ఏంటో తెలియదు, కాని వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటాం. అలాగే మీపైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. మీరు జీవితంలో మీకు ఎప్పుడుకూడా మంచి జరగాలని వారు ఆరాట పడుతుంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకి కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీయొక్క లైఫ్ లో స్త్రీకానీ పురుషుడుకానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులవచ్చు, లేకపోతే వేరే వ్యక్తులవచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు. మీ సన్నిహితులుకానీ స్నేహితులుకానీ, మీయొక్క బందువులుకాని ఇలా ఎవరైనాసరే మీపైన చాలా అభిమానాన్ని చూపిస్తుంటారు. కానీ దాన్ని మీరు చాలా లైట్‌గా తీసుకుంటారు, అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీయొక్క లైఫ్ సెటిల్ చేయడానికి కూడా వారు చాలాచాలా ప్రయత్నాలు చేస్తుంటారు, అంటే మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈవిధంగా కొన్నికొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వటాన్ని చూసి మీకు విసుగుకూడా వస్తూ ఉంటుంది, అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటంమాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తుంటారు. అంటే అది మీ కుటుంబ సభ్యులైనాసరే లేకపోతే బంధువులు, ఆత్మీయులు ఇలా ఎవరైనా ఉండొచ్చు, కానీ మీ మంచి కోరుకునే వ్యక్తి మీయొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు, కానీ మీరుమాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగీస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప, వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్ధం చేసుకోవడం లేదు. కాబట్టి మీయొక్క లైఫ్ లో అటువంటి వ్యక్తి ఎవరున్నారో, అంటే పదేపదే మీకు సలహాలు ఇవ్వడం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవడం, అలాగే పదేపదే మీకు ఫోన్లు చేసి విసిగీంచడం, అలాగే పదేపదే మీకు ఇలా చేయండి అలా చేయండని చెప్పడం, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారివల్ల మీకు మంచి తప్ప, చెడు జరిగే అవకాశాలు ఉండవు, కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని వారు మీపైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకుని వారిచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీయొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలు కూడా కచ్చితంగా పొందుతుంటారు, అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టిపరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మనయొక్క లైఫ్ లో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి తులరాశివారు వారితో మీయొక్క బంధాన్ని మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్నచిన్నవి ఏవైనా వచ్చినా కానీ, వారితో బంధాన్ని విచ్చిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తులవల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు, కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు జాగ్రత్త పడండి, అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగీంచండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులపట్ల స్నేహితులుగా ఉన్న వ్యక్తులపట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి, అంటే కొన్నికొన్ని సందర్భాల్లో ఆలోచన లేకుండా ఎవరు ఏం చెబితే అది వింటూ ఉంటాం. అంటే ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మనం మంచికా చెడుకా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీయొక్క లైఫ్ లో మీ మంచి కోరుకునే ఒక వ్యక్తితో పాటు, మీ చెడును కోరుకునే వ్యక్తులుకూడా ఉంటారు, అంటే ప్రతి మనిషియొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది కచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులుమాత్రమే మనయొక్క లైఫ్ లో ఉండరు, మన చెడును కోరుకునే వ్యక్తులుకూడా మనయొక్క లైఫ్ లో ఉంటారు, కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మనకీడు కోరుకునే వ్యక్తులను ఎప్పుడుకూడా స్నేహితులుగా కానీ, సన్నిహితులు కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తులవల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తులారాశివారు నిజాయితీ పరులతోమాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయతీపరులనుమాత్రమే మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి. మీకు చెడు జరగాలని కోరుకునే వ్యక్తులతో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో, నీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో, మీరు సహవాసం చేయకూడదు. అలాంటి వ్యక్తులతో జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తులారాశివారు తగీన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశివారికి ప్రేమలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వీరి తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ, వాటిని అధిగమించి ముందుకు సాగుతుంటారు. సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగీన మార్గాన్ని అన్వేషించండి. అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీవల్ల మీ కుటుంబంకూడా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగీన జాగ్రత్త అయితే కచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశివారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగీ ఉండాలి, ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకంటే కూడా బయటి వ్యక్తులను అమితంగా అభిమానిస్తుంటారు, ఈవిధంగా చేయడంద్వార కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తుంటాయి, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయితే గొడవ తీవ్రత పెరిగీతే మీయొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదంకూడా ఉంటుంది. దాన్ని తగ్గీంచుకోవడం, బంధాలను నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అది మీ చేతుల్లోనే ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశపూరితంగా మాట్లాడ కుండా మీయొక్క లైఫ్ పార్ట్నర్ మనసు నొప్పించకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీది రైట్ తన ది రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితేగనుక అతన్ని మెల్లిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకానీ గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్లినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది, బంధాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి అంటే అది స్త్రీలు కానీ, పురుషులుకానీ గమనించాల్సి ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్నికొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో ఎటువంటి తప్పులేదు, కాబట్టి ఈ విషయంలో తులారాశివారు వైవాహిక జీవితం విషయంలో అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తులారాశివారు ఆర్థిక పురోగతికోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి, అలాగే కనకధారాస్తోత్ర పారాయణ చేయండి. దత్తాత్రేయుడిని ఆరాధించండి, అలాగే శుభతిధి ఉన్న మంగళవారంరోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి, మీ సెక్తి మేరకు దానధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతుంటారు.
తులారాశివారిగురించి తెలుసుకున్నారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకొని మమ్మలిని సపోర్ట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్నీ ప్రెస్ చేయండి ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *