శ్రీమాత్రేనమః, అందరికి నమస్కారం. మిథునరాశివారి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. రానున్న రోజుల్లో మిధునరాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వచ్చేరోజుల్లో మిధునరాశివారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎలాంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి. వృత్తి, విద్య, ఆరోగ్యం, ఆర్థిక, కుటుంబం, వ్యాపారం ఇలాంటి అనేక అంశాల్లో మిధునరాశివారికి ఏవిధంగా ఉండబోతుంది. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఏ దేవుడ్ని ఆరాధించాలో, ఎలాంటి పరిహారం చేయాలో ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా, ఈ రోజు ఈ వీడియోలో మీరందరూ తెలుసుకోబోతున్నారు. ముందుగా మాది ఒక చిన్న విన్నపం. ఈ వీడియోకి ఒక like వేసి, మీ friends కి share చేయండి. అలాగే “జై శ్రీకృష్ణ” అని ఒక చిన్న కామెంట్ చేయండి.
మిధునరాశి, ఇది రాశి చక్రంలో మూడవ రాశి. ఇందులో మృగశిర నక్షత్రం 3,4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 1,2,3,4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1,2,3,4 పాదాలుంటాయి. అలాగే మిధునరాశికి అధిపతి బుధుడు. సాధారణంగా మిథునరాశిలో పుట్టినటువంటి వారి గుణగణాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. వీరు ఎంతో ఆశా ప్రియులని చెప్పవచ్చు. తమ అనుకున్న సామరస్యంగా అంటే తమ అనుకున్న పని సామరస్యంగా సాధించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఎలాంటి వ్యవహారాలు అయినాసరే ఎంత కష్టమైన పనులైనా సరే, తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైనా చాలా తెలివిగా వేస్తారు. సమయానుకూలముగా మాట్లాడేటువంటి నేర్పు వీరి సొంతం. అంతేకాకుండా ఉన్నతమైన స్థానంలో ఉండేవారు వీరికి స్నేహితులుగా ఉంటారు. చిన్నప్పటినుంచి కూడా ఎక్కువగా కష్టాలు పడతారు. జీవితంలో అనేక పాఠాలు తెలుసుకుని, అనేక రంగాలమీద అవగాహన పెంచుకోవడంవల్ల, వీరికి భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అనేక సందర్భాల్లో బాగా దగ్గరి వ్యక్తులవల్లే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువగా జాగ్రత్తలు పాటిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, వీరు నైపుణ్యం వీరి సొంతం అని చెప్పాలి. వీరిని మోసం చేయడం అంత ఈజీ అయితే కాదు. స్నేహానికి, ప్రేమకి, బంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలవల్ల పురుషులకు, ఈ రాశిలో పుట్టినటువంటి పురుషులవల్ల, స్త్రీలకి ఉపకారం జరుగుతుంది. ఇక బంధువులకు ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తేమాత్రం, వెంటనే ఆదుకుంటారు. స్నేహితులకు అలాగే స్నేహానికి, ప్రేమకి ఇచ్చినటువంటి విలువ, జీవితంలో దేనికి ఇవ్వరు. అలాగే కోరుకున్న వ్యక్తులయొక్క ఇష్టాన్ని తీర్చడానికి, ఏదైనా చేయడానికి వెనకాడరు. వివాదాలకి దూరంగా ఉంటారు, సమస్యల జోలికి పోరు. అలాగే నాయకుడిగా ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా బాగా రాణించగలుగుతారు. భవిష్యత్తులో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి, వీరు ఎక్కువగా కృషి చేస్తారు.
ఇలా మిథునరాశిలో పుట్టినటువంటివారికి రానున్న రోజుల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయని చెప్పాలి. సూర్యచంద్ర గ్రహణాలయొక్క ప్రభావం, గ్రహస్థితులులో వచ్చినటువంటి మార్పువల్ల, పౌర్ణమి అమావాస్య ఘడియలవల్ల వచ్చినటువంటి ప్రభావం, మిథునరాశి వారిమీద ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఏం అవుతుందంటే, మిథునరాశివారి జీవితంలో, ఆసక్తికర అంశాలు చోటుచేసుకుంటాయి. జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంటుంది ఈ మిథునరాశివారు. ఎందుకంటే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్నివేల మార్పులు రాబోతున్నాయి. ఇక ఉద్యోగ ఆర్థికస్థితి పరంగా, కుటుంబ సంబంధాలపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా, మిధునరాశివారికి సామాన్యమైన ఫలితాలు దక్కుతాయి. పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. అలాగే పోటీపరీక్షలలో కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలలో పాల్గొనే వారికిమాత్రమే, అతికష్టంమీద విజయాన్ని సాధిస్తారు. ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే పై స్థాయి అధికారులతో కానీ, మీతో పాటు పనిచేసే ఉద్యోగులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అనవసర మైనటువంటి వాటికి దూరంగా ఉండాలి. మిధునరాశిలో పుట్టినటువంటివారు, మీకు ఉన్నటువంటి దూకుడు స్వభావాన్ని, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే నిరాశా నిస్పృహల జోలికి పోకండి. భవిష్యత్ మీద ఒక మంచి ఆలోచనమీద ముందుకు వెళ్లండి. మీరు తప్పకుండా మీరు చేసినటువంటి అంటే, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయరూపంలో వరిస్తుంది. మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే, మీకు ఉండేటువంటి ఉద్యోగ సమస్యలు ఇట్టే తీరిపోతాయి. ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే, మిథునరాశివారు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా డబ్బు కొంత మీరు అందుకుంటారు. అలాగే ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి, మీరు మీ వ్యాపార నిమిత్తం కానీ, ఇతర ఆర్థిక వ్యవహారాల నిమిత్తం కానీ, ప్రయాణాలు చేస్తుంటే వాటివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేయడం, అమ్మడం, గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంటాయి. బంధువులకి సహాయం చేసే విషయంలో, స్నేహితులకు సహాయం చేసే విషయంలో మధ్యవర్తిత్వం వహించే విషయంలో, అత్యంత జాగ్రత్తగా ఉండండి. మిధునరాశిలో పుట్టినవారికి కుటుంబ సభ్యులు అండదండలు ఉంటాయి. మీ మాటని ఎప్పుడుకూడా కుటుంబంలో అందరూ గౌరవిస్తారు, అది కొనసాగుతూనే ఉంటుంది, దానిలో ఎటువంటి మార్పురాదు. ఇక మీ జీవిత భాగస్వామికి, మీకు ఉన్న చిన్నచిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా ఒకరు ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మీ జీవిత భాగస్వామికి లేదా మీ కొడుకైనా కోడలైన, మీ ఇంట్లో ఉన్నటువంటి మీరుకాకుండా ఇతర సభ్యులకి ఉద్యోగం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చదువు విషయంలో కూడా సంతాన విషయంలో కూడా మంచి మంచి విజయాలు సాధిస్తారు. సంతానం సాధించే విషయాలు ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తాయి. కోపంతో కుటుంబంలో ఉన్న ఏ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయకండి. ప్రశాంతంగా, మానసికంగా, సంతోషంగా ఉంటేనే కుటుంబ వాతావరణం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగాకూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆరోగ్యంపట్ల ప్రయాణాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో కూడా సాధారణ ఫలితాలు దక్కుతాయి. ఇక ఒక వ్యక్తి కారణంగా మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీకు ఇకమీదట పరిచయం కాబోతున్న నూతన వ్యక్తులతో జాగ్రత్త వహించండి. మిధునరాశివారికి ఉన్నటువంటి స్వతహా లక్షణం ఏమిటంటే, ఎవరినైనా ఇట్టే కలిపేసుకుని కలగలుపుగా మాట్లాడుతూ ఉంటారు. తమ జీవితానికి సంబంధించిన విషయాలను చెప్పేస్తూ ఉంటారు. ఇతరులు ఏదైతే చెప్తారో, అది ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. మీ ఈ లక్షణం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే సూచన ఎక్కువగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఒక వ్యక్తి ఇబ్బంది పెట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వాటంతటికి కూడా గ్రహస్థితిలో వచ్చిన మార్పులే ప్రధానమైనటువంటి మార్పులకు కారణం, మీరు ఆ వ్యక్తితో జాగ్రత్త వహించాలి. మీకు పరిచయమయ్యే వ్యక్తులగురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ వ్యక్తి మీకు బాగా కావాల్సిన వారే, ఆ వ్యక్తి మీయొక్క అధికారులుకు కూడా తెలిసినవారై ఉండవచ్చు. మీరు చెప్పిన విషయాలే, మీరు చెప్పే ఉద్దేశంతో కాకుండా ఇతర ఉద్దేశాలతో తప్పుగా వాటిని ప్రసారం చేయవచ్చు. అలాగే మీకు పరిచయమైన కొత్త వ్యక్తి ఒకవేళ స్త్రీ అయితే అతి జాగ్రత్త చాలా అవసరం. స్త్రీ వ్యామోహంగాని, స్త్రీ స్నేహంగాని, సమాజంలో ఇప్పటివరకు మీకున్నటువంటి మంచి పేరుని చెడ్డ పేరుగా మార్చేస్తుంది. కుటుంబంలో కూడా గొడవలు రావడానికి కూడా కారణం అవుతుంది. అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసే వ్యక్తులతో జాగ్రత్త పాటించండి. మరీ ముఖ్యంగా మిథునరాశిలో పుట్టినటువంటివారు, మీ నోటికి తాళం వేయండి. ముఖ్యంగా అపరిచితుల వ్యక్తులదగ్గర, మీయొక్క వ్యాపార రహస్యాలుగాని మీ వృత్తికి సంబంధించినటువంటి విషయాలుకానీ, మీ కుటుంబ రహస్యాలగానీ, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలుగానీ, ఏవైనా మీ అభిప్రాయాలగానీ, మీ పై స్థాయి అధికారులతో, మీతోపాటు మీరు పనిచేస్తున్న అభిప్రాయాలు కానీ, ఏదైనాసరే ఇతరులకు చెప్పేటప్పుడు అతి జాగ్రత్త అవసరం. మీ నోటి దురిసే మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా తెలివిగా మౌనంగా వ్యవహరించండి. అయితే మీరు గోధుమలు దానం ఇవ్వండి. శివాలయానికి వెళ్లినప్పుడు అభిషేకం చేయించండి. తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. మిధునరాశివారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చిన ట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రయిబ్, చేసుకొని మమ్మలిని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్నీ ప్రెస్ చేయండి ధన్యవాదములు.
