సింహరాశి వారికి 2024 మే నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు ..!!
గోచార ఫలితాలు:
సింహరాశివారికి ఈ నెల స్థానికులకు మిశ్రమముగా ఉంటుంది. మీ జీవితంలోని వివిధ అంశాలపై చాలా శ్రద్ధ అవసరం. సమస్యలపై దృష్టి సారించాలి. ఆరోగ్య సమస్యలువచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలుపట్ల జాగ్రత్తగా ఉండాలి. గాయాలు లేదా శస్త్రచికిత్సలు లేదా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో సమస్యలునుండి బయటపడటానికి ప్రయత్నించండి. ఇబ్బంది ఎక్కువ కాలం ఉండదు. ఈ మాసంలో దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈ నెల వ్యాపారాలకు చాలా లాభిస్తుంది. మీ ఉద్యోగంలో ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడికైనా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో చాలా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కానీ సభ్యులు మీకు సహకరిస్తారు. ప్రేమ జీవితంలో, మీరు అనుకూలమైన సమయాన్ని గడపగలుగుతారు. మీ ప్రియమైనవ్యక్తితో చాలా లోతుగా కనెక్ట్ అవుతారు. అసోసియేషన్‌తో సంబంధం మెరుగుపడుతుంది. వివాహితులకు ఇది క్రమశిక్షణతో కూడిన కాలంగా చెప్పవచ్చు. వైవాహిక జీవితం చాలా చక్కగా సాగుతుంది. విదేశాలకు వెళ్లడానికి ఇది అనుకూలమైన సమయంకాదు. కొంత సమయంవరకు ప్రయాణాలను వాయిదా వేయండి. మీకు లాభనష్టాల గురించి తెలియని వాటిలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండండి.
మీరు మీ కెరీర్,ఆర్థిక అభివృద్ధికి సహాయపడే అధునాతన సాంకేతికతలను నేర్చుకోవచ్చు. మే 2వ భాగంలో, మీరు మీ ఇబ్బందులను అధిగమిస్తారు. ఇళ్లు,భూములు,వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేయకుండా ఉండండి. ఇది ఆర్థిక నష్టాలను మరియు న్యాయపరమైన సమస్యలను నివారించవచ్చు. ఆస్తులను విక్రయించడానికి మరియు డబ్బు స్వీకరించడానికి ఇది మంచి సమయం. తోబుట్టువులు,రక్త సంబంధాలు, కుటుంబసభ్యులతో సంబంధ సమస్యలు ఉండవచ్చు. కాబట్టి, మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. ఇది సాఫీగా సంబంధాలను కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది. మీకు,మీ జీవిత భాగస్వామికి మధ్య ఈగో సమస్యలు ఉండవచ్చు. కాబట్టి, మీ జీవిత భాగస్వామితో సర్దుబాటు చేయడానికి ప్రయత్నించండి. ఈ నెలలో ప్రేమ సంబంధాలలో వైఫల్యాలు విడిపోవడానికి అవకాశం ఉంది. విద్యార్థులు విజయం సాధించేందుకు అంకితభావంతో పాటు కష్టపడి పనిచేయాలి. తాత్కాలిక ఇబ్బందులు విద్యలో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. వాటిని అధిగమించడానికి మీ తల్లిదండ్రుల నుండి మద్దతుకోసం అడగండి.
కుటుంబ జీవితం:
సింహరాశివారికి ఈ మాసంలో కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మాసం ప్రారంభంనుండి, రెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు, కుజరాహువుల మధ్య బాధాకరమైన స్థితిలో ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తాడు. దీనికారణంగా కుటుంబ సభ్యులమధ్య, పరస్పర తగాదాలు కూడా ఏర్పడతాయి. రెండవ ఇంట్లో కేతువు ఉండటంవల్ల డబల్ మీనింగ్ మాటలు, మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. అలాంటి మాటలతో అపార్థం ఏర్పడి, కుటుంబ వాతావరణాన్ని పాడుచేసే అవకాశాలు ఉన్నాయి. నాల్గవ ఇంటికి అధిపతి అయిన కుజుడు, ఎనిమిదవ ఇంట్లో రాహువుతో కలవడంవల్ల, అంగారక దోషం ఏర్పడుతుంది. దీనికారణంగా మొత్తం కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది. ఈ కాలంలో మీ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ తల్లి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ తండ్రి పదవ ఇంటికి అధిపతి యొక్క బలమైన స్థానం కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అలాగే, మీ తోబుట్టువులతో మీ సంబంధానికి ఇది చాలా ముఖ్యమైన కాలంగా చెప్పవచ్చు. తీర్థయాత్ర లేదా కుటుంబ సభ్యులతో సుదూర ప్రయాణం చేసే అవకాశాలు పెరుగుతాయి.
వృత్తి ఉద్యోగాలు :
సింహరాశివారికి వృత్తి పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో, పదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు, ఉచ్ఛమైన సూర్యుడు గురువుతోపాటు తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తాడు. దీనివల్ల మీకు కావాల్సినచోటుకు బదిలీలు జరుగుతాయి. మీరు ఉద్యోగాన్ని మారాలనుకుంటే, కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం విషయంలో బదిలీలకు బలమైన అవకాశం ఉంటుంది. అందువలన, ఇది మీకు అనుకూలమైన సమయాన్ని కలిగిస్తుంది. దీని తరువాత, మే 14న, సూర్యుడు తొమ్మిదవ ఇంటిని విడిచిపెట్టి, నెల రెండవ భాగంలో పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో, ప్రభుత్వ ఉద్యోగాలను పొందడంద్వారా ఉన్నత ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కార్యాలయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మే 19న పదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన సొంత గృహంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో, ఆఫీసులో వివిధ సమస్యలతో పోరాడటం కంటే, మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఆరవ,ఏడవ ఇంటికి అధిపతి అయిన శని, ఈ నెల మొత్తం ఏడవ ఇంటిలో సంచారం చేస్తాడు. ఇది మీ ఉద్యోగంలో ఉన్నతమైన ప్రమోషన్లను కలిగిస్తుంది.
వ్యాపారం:
సింహరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా, వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. సప్తమ స్థానానికి అధిపతి అయిన శని సప్తమంలో ఉండడంవల్ల వ్యాపారానికి బలం చేకూరుతుంది. మీ వ్యాపారంలో విదేశీ పరిచయాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది స్థిరత్వానికి సమయం అవుతుంది. మీరు వ్యాపార పురోగతితో సంతోషంగా ఉంటారు.
ఆర్థిక స్థితి :
సింహరాశివారికి, మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే, నెల మొత్తం మిశ్రమముగా ఉంటుంది. ఎనిమిదవ స్థానంలో రాహువు,కుజుడు,బుధుడు ఉండటంవల్ల, మీకు జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరియు అనవసరమైన ప్రయాణాలకు ఖర్చులు ఉంటాయి. ఇది ఆరోగ్య ఒడిదుడుకులను కూడా కలిగిస్తుంది. పనిచేసే నిపుణులు ప్రయోజనాలను పొందేందుకు మంచి అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, ప్రభుత్వ నిధులనుండి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంనుండి ప్రయోజనాలు కూడా పొందుతారు. వ్యాపారాలలో మంచి డబ్బు సంపాదించడానికి ఇది ఉత్తమ సమయం. సరైన సమయములో ఇన్కమ్ టాక్స్ కట్టకుండా ఉండటం, టాక్స్ ఎగ్గొట్టడంలాంటి పనులు చేస్తే, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలుకూడా ఉన్నాయి. ఈ సమయములో పెట్టుబడికి మంచి సమయం కాదు. అయితే గత పెట్టుబడులనుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన, ప్రభుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోవడంవల్ల ఆశించిన ప్రయోజనాలు, సరైన గౌరవం లభిస్తాయి.
ఆరోగ్యం :
సింహరాశివారికి ఆరోగ్య పరంగా చూస్తే, ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. మీ రాశి అధిపతి రవి బలమైన స్థానంలో ఉంటాడు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కానీ రాహువు,కుజుడుయొక్క అంగారక దోషం, మెర్క్యురీతో ఉండటంవల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల శారీరక ఇబ్బందులు, కొన్ని రకాల శస్త్రచికిత్సలు లేదా నష్టాలు ఉంటాయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నడపండి. ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ఇతరుల వాహనం అడిగి తీసుకుని నడపడం చెయ్యకూడదు. త్రాగే మంచినీళ్లు, నిత్యమూ తీసుకునే పదార్థాలపై శ్రద్ధ వహించండి. వీలైనంతవరకు బయటి ఆహారం మానేసి ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. సరైన ద్రవపదార్థాల వినియోగం మీ ఆరోగ్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది.
ప్రేమ,వివాహం,వ్యక్తిగత సంబంధాలు:
మీ ప్రేమ జీవిత విషయానికొస్తే, మీ ప్రియమైనవారితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఇది ప్రేమ సంబంధాలలో సమస్యలను కలిగిస్తుంది. విడిపోవడానికి కారణమవుతుంది. ఇబ్బందులను నివారించడానికి, మీ ప్రేమ సంబంధంలో ఇతరులను జోక్యం చేసుకోవడానికి అనుమతించవద్దు. మధ్యవర్తులు, స్నేహితులు మరియు బంధువుల ద్వారా ఇబ్బందులు ఉండవచ్చు. ఇది సంబంధాలలో విచ్ఛిన్నానికి కారణమవుతుంది. కాబట్టి, మీ ప్రియమైన వ్యక్తితో కమ్యూనికేట్ చేసేటప్పుడు సహనంతో ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధాలలో మీ గోప్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. బహిరంగ ప్రదేశాల్లో కలవకండి. మీ ప్రేమ సంబంధం గురించి ఇతరులతో చెప్పకండి. మధ్యవర్తులు మీరు మీ ప్రియమైన వారిని పరీక్షించాలని కోరుకోవచ్చు. ఇది మీ భాగస్వామికి చికాకు కలిగించవచ్చు. మీ భాగస్వామిపై నమ్మకం ఉంచండి. ఇతరులు వారిగురించి చెప్పే వాటిని నమ్మవద్దు. మీరు ప్రమాదకర కార్యకలాపాల్లో పాల్గొనడం మానుకోండి. మీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది మంచి మాసం కాదు. ఈ నెలలో అవమానం జరిగే అవకాశం ఉంది.
ఈ సమయంలో, మీ భాగస్వామికి వివిధ శారీరక సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. వివాహితుల గురించి, ఏడవ ఇంటికి అధిపతి అయిన శని, ఏడవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. తద్వారా మీ భాగస్వామితో సామరస్యం ఉంటుంది. జీవిత భాగస్వామి అనుకున్న విధంగా కమ్యూనికేట్ చేస్తారు. కానీ, ఎనిమిదవ ఇంట్లో రాహు,కుజుడు ఉండటంవల్ల కోపం కూడా ఉండవచ్చు. బుధుడు వారితోపాటుగా ఎఫ్లిక్ట్టెడ్ అయ్యి ఉంటాడు. దీనివల్ల భాగస్వాముల మధ్య వివిధ రకాల తగాదాలు ఏర్పడతాయి. వాగ్వివాదాలు నియంత్రించడం, భాగస్వామి ఆరోగ్యంపట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
విద్యార్థులకు:
సింహరాశి విద్యార్థులుకు ఈ మాసం విద్యలో ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి, కుటుంబ కార్యక్రమాలు, వినోదం,స్నేహితులతో పర్యటనలువంటి వాటిని తగ్గించుకోవాలి. వీలైనంతవరకు చదువులపై దృష్టి పెట్టండి. ఉన్నత చదువుల కోసం కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందడం మీకు కష్టంగా అనిపించవచ్చు. ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషుల మద్దతు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడవచ్చు.
పాటించవలసిన పరిహారములు :
శ్రీ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం క్రమం తప్పకుండా చేయండి.
కుంకుమ రాగిపాత్రలో తీసుకుని నీటిలో కలిపి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇది క్రమం తప్పకుండా చేయాలి.
సమస్యలునుండి బయటపడటానికి, చీమలకు చక్కెర,పిండి మిశ్రమాన్ని అందించండి.