మీరు నమ్మినా నమ్మకపోయినా ఆర్ అక్షరంతో ప్రారంభమైన తులారాశి జాతకులయొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం, తులారాశివారియొక్క జాతకం జీవితం ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది.
మీ పేరు ఆర్ అక్షరంతో ప్రారంభం అవుతుందా, అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాల్ని తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, ఆర్ అక్షరంతో ప్రారంభమైన తులారాశివారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరుశాతం ఇలానే ఉంటుంది.
మరి మీ పేరు ప్రారంభంలో ఆర్ అనే అక్షరం ఉంటే, అది మీ వ్యక్తిత్వంగురించి ఏం చెబుతోంది, ఆర్ అక్షరంతో ప్రారంభమైన తులారాశివారి 100 సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తియొక్క గుణగణాలు, లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి, పుట్టిన సమయంనుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది, పేరుయొక్క మొదటి అక్షరం వ్యక్తియొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇక తులారాశివారు ఆర్ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు నూటికి నూరుశాతం జరగబోయేది ఇదే, మరి తులారాశి జాతకులు ఆర్ అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతోంది, మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా తెలుసుకుందాం.
ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పొచ్చు, వీరు తెలివైనవారు, ఉదారస్వభావులు, చాలా స్వచ్చంగా ఉంటారు, ఆర్ అనే పేరున్న వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉంటారు.
వీరికి స్నేహితులు ఎక్కువమంది ఉంటారు, అలాగే శత్రువులు కూడా ఎక్కువే, వీరి మనస్సులో స్నేహితులకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది, అలాగే న్యూమరాలజీలో ఆర్ అనే అక్షరం 9 నెంబర్‌ను సూచిస్తుంది, జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశంకూడా ఉంది.
ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు మరియు వారి పుట్టిన తేదీగురించి మరియు వారి వ్యక్తిత్వంగురించి మనం చూడబోతున్నాం, ఈ జాతకంలో ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు వారియొక్క జీవితంలో అనేక రకాల మార్పులనేవి ఊహించనివిధంగా వస్తుంటాయి.
ఈయొక్క తులారాశిలో ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నవారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మంచి సంకేతాలనేవి ఉంటాయి, వారి జీవితంలో ఎప్పుడుకూడా ప్రయత్నాలు అనేవి చాలా ఉత్తమంగా చేస్తుంటారు, తద్వారా వీరికి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా వస్తాయి.
ఆర్ అక్షరంతో పేరు పెట్టుకోవడంవల్ల వీరి జీవితం చాలా చక్కగా దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు, ఆర్ అక్షరంతో పేరు గలవారు లేకుండా ప్రతీది అసాధ్యం అనిపించే అంతటి పెద్ద పదవిని మీరు కలిగి ఉంటారు.
మీరు అంటే ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో, వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు తప్ప ఎవరూ ఈ పని చెయ్యలేరు అనేవిధంగా వీరియొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తోంది, అలాంటి పెద్ద పదవుల్లోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు.
అయితే అది మీకు వ్యతిరేకతను కూడా తీసుకొచ్చే సూచనలున్నాయి, మీరు అహంనుండి దూరంగా ఉండాలి, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాన్ని మీరు చాలా ఈజీగా పొందుతారు.
కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, మీ కృషికి రివార్డ్ ని కార్యాలయంలో మీరు పొందాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది, మరియు ప్రమోషన్లకి మంచి అవకాశాలు కూడా వస్తాయి.
అలాగే వీరు ఏ ఒక్కరూ చేయలేని పనిని ఎంచుకుని దానిలో సఫలీకృతం అవ్వాలని భావిస్తుంటారు, ఆర్ తో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు శ్రమకు ఎప్పుడూ భయపడరు, అందుకే వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా తమ ఉద్యోగంలో స్థాయిని పెంచుకుంటూపోతారు.
పనిలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది, ఈ వ్యక్తులు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, ఈ వ్యక్తులు తమ లక్ష్యాలపట్ల అంకితభావంతో ఉంటారు.
ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు వ్యాపారపరంగా మంచి అభివృద్ధి అనేది చూస్తారు, అదేవిధంగా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంటారు, మీరు మీ వ్యాపారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు, మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నట్లుగా మీరు భావిస్తారు, అంతేకాకుండా అటువంటి పరిస్థితులలో ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి.
కాలక్రమేణా సమస్యలు తగ్గుముఖం పడతాయి, మీరు మీ వ్యాపారంలో పైకి వెళ్లే ధోరణిని చూస్తారు, ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది, అంతేకాకుండా మీ సామర్ధ్యం మరియు పనితీరుతో మీరు సంతోషంగా కనిపిస్తారు.
కొన్ని నెలల్లో మీ వ్యాపారాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది, అలా ఆలోచన చేసి మీరు చాల చక్కగా మీయొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వారియొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తేకనుక కొన్ని తేడాలు మీరు చూస్తారు, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉంటాయి.
అందువల్ల మీరు వాటిని జాగ్రత్తగా ఉండాలి, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాటికి తగ్గట్టుగా మీరు పరిష్కారం ఆలోచించాలి, వీరు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు, ఆ ప్రేమ వారి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే వీరు కొంచెం రొమాంటిక్ గా కూడా ఉంటారు.
ఇక అదేవిధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యలగురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారాలు కనుగొంటారు, కానీ మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మానసికంగా మీరు నెర్వస్ గా ఫీల్ అవ్వడం, చాలావరకు కృంగిపోవడం జరుగుతుందో, అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి.
కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, అంతేకాకుండా మీ ఇంట్లోవాళ్ళతో సంప్రదించిన తర్వాతే, మీ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసుకోండి, అలా చేసుకోవడంవల్ల మంచి చెడు అనేవి మీకు మీరుగా ఆలోచించగలుగుతారని చెప్పుకోవచ్చు.
ఇక అదేవిధంగా కార్యాలయంలో గొప్పగా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, మీ జీవితానికి అది ఆనందం తీసుకొస్తుంది అనుకున్నప్పుడు, దానికోసం మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండటం చాలా అవసరం అని చెప్పబడుతుంది, ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతగా ఉంటారో అప్పుడు కచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది.
అలా మంచి ఫలితం లభించడంద్వారా మీరు మీయొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు, అంతేకాకుండా మీ కార్యాలయంలో ఉన్నటువంటివాళ్ళతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు, ఆ సత్ సంబంధాలు బలోపేతం అవడంద్వారా మీకు అది బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.
మీరు అదృష్టవంతులు, ఆదర్శవంతమైనటువంటి భాగస్వామితో ఆశీర్వదించబడ్డారు, కాబట్టి ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటివారు వారి జీవిత భాగస్వామియొక్క సహకారం లభించడంవల్ల చాలా త్వరగా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు.
అలాగే మీరు ఎక్కువ శాతం మీ కుటుంబంతో బయటకు వెళ్లడానికి ఎక్కువగా వాళ్ళతో గడపడానికి మీరు ఇష్టపడతారు, వాళ్ళ విహారయాత్రకు తీసుకెళ్లడానికి లేదా తీర్థయాత్రలు తీసుకెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు, దానికోసం మీరు డబ్బు ఖర్చుపెడతారు.
అలాగే సంతానం పొందాలని కోరుకుంటే మీరు చాలావరకు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు, అంటే ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారికి సంతానయోగందగ్గర కొంతమందికి కాస్త చిన్నచిన్న చికాకులనేవి ఉంటాయి, కాబట్టి వాటిని దాటడానికి ప్రయత్నించండి, కానీ ప్రేమతోనే వాటిని దాటే ప్రయత్నం చేయండి, ఇలా చేయడంవల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు.
ఇక ఎవరైతే ఈ ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వారియొక్క ప్రేమజీవితంగురించి చూసుకున్నట్లయితే, వీరు ప్రేమలో చాలావరకు కూడా సఫలీకృతమౌడానికి ప్రయత్నాలు చేస్తారు, అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏ పనిమీద అయితే ఉన్నారో దానిమీదే ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు.
తక్కువ సమయంలోనే ఎక్కువ gnanaanni పొందాలని ఆసక్తిని కలిగి ఉండటంతోపాటు మీరు దృష్టి పెట్టిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు, అంటే మీరు మీ ప్రేమలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు, అనడానికి ఇది గొప్ప సూచన అని చెప్పుకోవచ్చు.
మీరు కష్టపడి ప్రయత్నించాల్సి ఉంటుంది, అంతేకాకుండా మీరు పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి, మీపై మీ భాగస్వామియొక్క నమ్మకాన్ని పెంచడానికి మీరు చేసే ప్రతిపనీ కూడా చాలావరకు దోహదపడుతుంది.
ఎందుకంటే మీరు వారితో మాట్లాడే తీరు, వారితో ప్రవర్తించే తీరు, వారిమీద నమ్మకాన్ని పెంచటంతో, వారు మీపట్ల సానుకూలమైనటువంటి దృక్పదాన్ని కలిగి ఉండడంతో పాటుగా, వారియొక్క కుటుంబ సభ్యులతోకూడా మీ గురించి మాట్లాడేటప్పుడుకాని, మీగురించి వారితో చర్చించి మీగురించి వారితో సంభాషించేటప్పుడుకాని, మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది.
కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు, కచ్చితంగా వారితో మీ ప్రేమను పంచుకునే విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కొలమానాలు చూడకండి, అంటే ఏముంది తనే పలకరించాలి, తానే మాట్లాడాలి అన్నట్టుగా ఉండకండి.
మీరు మీ ప్రేమని పూర్తిగా తనకు అందివ్వగలిగారంటే అప్పుడు మీకు మీ పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది, కుటుంబ విషయంలో కూడా అంతే, భాగస్వామితో చాలా సఖ్యతగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం అనేది ఉంటుంది.
ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారికి ఆర్థిక పరముగా చూసుకున్నట్లయితే ధన సమృద్ధి అంటే డబ్బు చాలా బాగుంటుంది, డబ్బు సమృద్ధిగా రావడంతోపాటు మీరు ఆర్థిక పరముగా చాలావరకు కూడా పైకి ఎదుగుతారని చెప్పవచ్చు.
అయితే ఖర్చులుకూడా పెరుగుతాయి, పరిస్థితి అదుపు తప్పకుండా మీరు చివరివరకు కూడా బ్యాలెన్స్ కొనసాగించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవాలి, అదేవిధంగా బ్యాంక్ లేదా ఇతర వనరులునుంచి రుణాలను సేకరించడంవంటి పనులు చేస్తారు.
మీరు సేకరించిన రుణాన్ని అంటే, మీరు తీసుకున్న లోన్ గాని లేకపోతే అప్పుకానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, అది కచ్చితంగా మీకు ఒకటికి రెండింతలు పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే అనూహ్యంగా నష్టపోతుంటారని చెప్పుకోవచ్చు.
ఈ విధంగా మీయొక్క జీవితంలో చాలా చక్కటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఇక ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి వారిగురించి చూసుకున్నట్లైతేగనుక, వాళ్ళయొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎదుగుదల అనే దాంట్లో ఎక్కడకూడా వెనకడుగు వేయడం అనేది ఉండదు.
ఎందుకంటే వారు ఎట్టిపరిస్థితుల్లోనూ జీవితమనే విషయంలో వారు ఎప్పుడూకూడా ముందుకు వెళ్లాలి అనే దృక్పదంతో ఉంటారు, అంతేకాకుండా వారు చేసే ప్రతి పనిలో కూడా విజయ పరంపర కొనసాగించాలనే దృక్పదంతో ఉంటారు.
వాళ్లయొక్క మానసిక స్థితి ఏదైతే కోరుకుంటూ ఉంటుందో, వారు మానసికంగా ఏ విషయమైతే చాలా హ్యాపీగా ఉండాలనుకుంటారో దానిని పొందగలుగుతారు, ఎందుకంటే మనసులో బలంగా అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకునే క్రమంలో వారు ఎక్కువ కష్టపడతారు, కష్టపడి దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు.
ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు, ఎప్పుడూ ఖరీదైన, ఆకర్షణీయమైన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు, ఆర్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు దయతో, ఉదార స్వభావంతో ఉంటారు, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వారికి సహాయం చేస్తారు.
ఇక ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి, వీరు ఎప్పుడుకూడా బయటకు వెళ్లేటప్పుడు అంటే ఇంట్లోనుంచి బయటకు ఏ పనిమీదైనా వెళ్లేటప్పుడైనా సరే, లేదు ఉదయాన్నే బయటకు వెళ్లేటప్పుడైనా నోట్లో చిన్న ఉప్పుగల్లు వేసుకుని వెళ్లండి, అలా వెళ్లడంద్వారా కార్యసిద్ధి జరుగుతుంది, మీరు వెళ్లేటప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి.
ఇక అదేవిధంగా ప్రతిరోజు ఇంటినుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు వీలైనంతవరకు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ దేవుడికి నమస్కారం చేసుకోకుండా బయటికి వెళ్ళకండి, ఉదయాన్నే లేచాక పూజ పూర్తి చేసుకుంటాం కదా, వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కరించుకుని బయటకు వెళ్ళండి.
ఇక అదేవిధంగా రెండు లవంగాలని జేబులో వేసుకుని వెళ్లడం, ఆడవాళ్లైతే హ్యాండ్ బాగ్ లో పెట్టడంద్వారా కార్యసిద్ధి కలుగుతుందని చెప్పొచ్చు, ఇక మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకొని వెళ్ళండి.
భగవత్ స్వరూపమైనటువంటి దేవుడిని తలుచుకోవచ్చు, లేదా ఎవరైనా గురువుని లేదా మీ తల్లిదండ్రులు లేదా మీకు ఇష్టమైనవారిని కుడా తలుచుకోవచ్చు, ఇలా మనసులో తలుచుకోవాడంద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు.
అదేవిధంగా చిన్నచిన్న పరిహారాలు ఉన్నాయి అవేంటంటే, మీరు అంటే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైనవారు కచ్చితంగా చేయాల్సిన పరిహారం ఒకటుంది, అదేంటంటే మీరు పటికని తెచ్చుకుని అమావాస్యరోజుకానీ పౌర్ణమిరోజుకాని, ఏ రోజు వీలైతే ఆ రోజు అండి, ఆ ముందురోజు పటికని తెచ్చుకోండి, ఎర్రని క్లాత్ తీసుకుని దాంట్లో పటికను వేసి మూటలాగా కట్టి, ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి.
అమావాస్యరోజున లేదా పౌర్ణమిరోజున ఇలా వేలాడదీయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తుల ప్రభావం రావడం అనేది తగ్గిపోవడంతోపాటు మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా అది గ్రహించేస్తుంది, ఇలా చేయడంద్వారా మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పబడుతుంది.
గోమాతను ఆరాధించడంవల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలితాలు అయితే మీరు పొందుతుంటారు, ఎందుకంటే సకలదేవతలయొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి, అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి, ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడంవల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి, అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి
కాబట్టి ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు కచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతోపాటుగా, వారియొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపథంలో నడిచేవంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.
