ఈరోజు మనం మిధునరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన, ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించబోయే ఆగష్టు నెల గురించి తెలుసుకోబోతున్నాం, ఈ నెలలో మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది, ఏయే శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయో వివరంగా చెప్పుకుందాం,
మిధునరాశి వారికి ఆగష్టు నెలలో జరిగేది ఇదే, మీరు అక్షరాలా నక్కతోక తొక్కినట్లే, ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు, ఆగష్టు నెలలో మీరు మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు, ఈ విషయాలు మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి కాబట్టి, దయచేసి చుట్టూ ఎవరూలేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి,
ఇంతకీ ఈ మిధునరాశివారు ఆగష్టు నెలలో వినబోయేటువంటి ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే మిధునరాశి వారు ఈ ఆగష్టు నెలలో ఏ పరిహారాలు చేయడంవల్ల, వారికి ఇంకా మరిన్ని శుభఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా, క్షుణ్ణంగా తెలుసుకుందాం,
జ్యోతిషశాస్త్రంలో ఈ మిధునరాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది, అత్యంత సంక్లిష్టమైనది కూడా, రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులలోకెల్లా అత్యంత ఓర్పు, సహనం, మరియు కరుణ కలిగీన వారు ఈ రాశి జాతకులు,
వీరి మనస్తత్వం ఎప్పుడూ సర్వేజనా సుఖినోభవంతు అన్నట్లుగా, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది, తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి సంతోషాన్ని కోరుకునే గొప్ప మనసు వీరిది, ఇతరుల ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కునే నిస్వార్థ జీవులు వీరు,
మిధునరాశికి చెందినవారు తేజోవంతులుగానూ, సౌందర్యవంతులుగానూ ఉంటారు, వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక వర్చస్సు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ప్రతి విషయంలోనూ సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు,
వీరి మాటల్లో చమత్కారం, చేతల్లో చురుకుదనం ఉంటాయి, వీరితో సమయం గడపడం అంటే ఎవరికైనా ఇష్టమే, ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉంటుంది,
మిధునరాశివారికి చంచల స్వభావం, అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు, దానిలోని మంచి చెడులను, లాభనష్టాలను పూర్తిగా బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు,
వారి బుద్ధి చాలా పదునైనది, కానీ వారికున్న చంచల స్వభావంవల్ల కొన్నిసార్లు మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారని చెప్పుకోవచ్చు, ఒకేసారి పది పనుల గురించి ఆలోచించడంవల్ల, దేని మీదా పూర్తి ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు,
వీరిది చాలా మంచి మనసు, కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం, చిన్న మాటకే నొచ్చుకుంటారు, చిన్న విమర్శకే కుంగీపోతారు, వీరి మనసు అద్దం లాంటిది, ఒకసారి గాయపడితే ఆ పగులు జీవితాంతం గుర్తుండిపోతుంది,
వీరు చిన్నపిల్లల మనస్తత్వం కలిగీన వారు, ఇతరుల మాటలను, ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకుని, తమలో తామే మదనపడిపోతూ ఉంటారు, ఈ సున్నితత్వమే కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనతగా మారుతుంది,
మిధునరాశివారు చిన్నప్పటి నుంచి కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు, కానీ వారు వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తారు, వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది, దానితో పాటు పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు,
కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు, తట్టుకోలేరు, విపరీతంగా భయపడిపోతారు, ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది, నేను చేసిన పాపమేమిటి అని తమను తామే ప్రశ్నించుకుంటూ మదనపడిపోతారు,
ఒంటరిగా ఒక గదిలోకి వెళ్లి గంటల తరబడి కుమిలిపోతారు, ఎవరితోనూ తమ బాధను పంచుకోలేరు, తమ కన్నీళ్లను ఇతరులకు చూపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు, తమ బలహీనతను బయటపెడితే, ప్రపంచం మరింతగా గాయపరుస్తుందని వీరికి బాగా తెలుసు,
కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు, వారి ముఖంలో ఆ బాధను కానీ, ఆ కన్నీటి చారలను కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు, లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా, పైకి మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వును ప్రదర్శిస్తారు,
ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసే అద్భుతమైన కళ వీరికి పుట్టుకతోనే వస్తుంది, తమ బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనే గొప్ప సంస్కారం వీరిది, అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం,
ఎందుకంటే వీరికి జీవితం ఒక కటినమైన పాటం నేర్పింది, మన బాధలను నలుగురితో చెప్పుకోవడంవల్ల ఉపయోగం శూన్యం అని, అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాము తప్ప, మనకు ఒరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు,
జాలి చూపే వారి కన్నా, ఎగతాళి చేసేవారే ఎక్కువని వీరు ఎప్పుడో గ్రహించారు, తమ కష్టాలను చెప్పుకుంటే, కొందరు సానుభూతి చూపినట్టు నటించి, వెనకాల నవ్వుకుంటారని వీరికి అనుభవపూర్వకంగా తెలుసు, అందుకే తమ సమస్యలను తమలోనే దాచుకుంటారు,
అందుకే తమ జీవిత బండిని తమంతట తామే, ఎవరి సహాయం ఆశించకుండ ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, వీరు పడే కష్టం అంతా ఇంతా కాదు, ఇప్పటివరకు వంద శాతం కష్టపడితే, అందులో కేవలం నలభై శాతం ఫలితం మాత్రమే వారి చేతికి అందింది,
వీరి శ్రమకు, వీరి తెలివితేటలకు, వీరి నిజాయితీకి తగీన గుర్తింపు, సరైన ప్రతిఫలం ఎప్పుడూ లభించలేదు, ఎంతో కష్టపడినా, ఫలితం మాత్రం దక్కక నిరాశ చెందిన సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు,
మిగీలిన అరవై శాతం శ్రమ, ఆవేదన, కన్నీళ్లు బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి పాలయ్యారు,
చేతికి అందినట్టే అంది, జారిపోయిన అవకాశాలెన్నో, లక్ష్యం కళ్ళముందే కనిపిస్తున్నా, విధి ఆడిన వింత నాటకంలో వెనకడుగు వేయాల్సి వచ్చింది, అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా, శాశ్వతంగా మారబోతోంది, ఆ చీకటి రోజులు గతించిపోయాయి,
ఆ జగద్రక్షకుడైన భగవంతుని అనుగ్రహంవల్ల, మీరు వంద శాతం కష్టపడితే, కచ్చితంగా నూటొక్క శాతం లాభం మీ ఖాతాలో ఉంటుంది, ఈ మాటను మీరు బలంగా, అచంచలమైన విశ్వాసంతో నమ్మండి,
మీ ప్రతి కన్నీటి బొట్టుకు, మీ ప్రతి చెమట చుక్కకు ఇప్పుడు భగవంతుడు వెల కట్టబోతున్నాడు, మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు అంది తీరుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు, మీ జీవితంలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది,
ఈ మిధునరాశివారికి ఉన్న ఒకేఒక అతిపెద్ద బలహీనత ఏమిటంటే, వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు, బయటి వారిని, కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తారు,
కానీ తమ సొంత సామర్థ్యాన్ని, తమ సెక్తిని, తమ ప్రతిభను తాము నమ్మరు, ఆత్మన్యూనతా భావంతో సతమతమవుతూ ఉంటారు, నేను ఇది చేయగలనా, నావల్ల అవుతుందా, అనే సందేహాలతోనే సగం జీవితాన్ని గడిపేశారు,
ఈ ఒక్క కారణం వల్లే వీరు జీవితంలో ఎన్నో సువర్ణావకాశాలను చేజార్చుకున్నారు, ఎన్నో అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు, వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండి, భయంతో, సందేహంతో ఆగీపోయిన సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి,
ఆ ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే, ఈపాటికి వారి జీవితం మరో స్థాయిలో ఉండేది, కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలతవల్ల, మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది, మిధునరాశి జాతకులారా, ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ గతం, వాటిని ఒక పీడకలగా భావించి మర్చిపోండి,
రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి, ఒక ఉజ్వలమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి, గడిచిన కాలం మీకు నేర్పిన పాటాలను గుర్తుంచుకుని, భవిష్యత్తు వైపు దైర్యంగా అడుగులు వేయండి, మీ తలరాతను మీరే తిరగరాసుకునే సమయం ఆసన్నమైంది,
ఇన్ని ఇబ్బందులు ఎదురైనా, ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగారు, ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగీంచి, మీకు విజయాన్ని ఒక గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు,
మీ ఓర్పుకు, మీ మంచితనానికి, మీ నిస్వార్థానికి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు, అందుకే ఇప్పుడు మీకు అంతా మంచే జరగబోతోంది, మీ జీవితంలోకి అదృష్టం ప్రవేశించబోతోంది,
మీకున్న కష్టాలన్నీ వేసవిలో మంచులా కరిగీపోతాయి, మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన ఆనందం చోటు చేసుకుంటుంది, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి, ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తాయి, ఊహించని విధంగా ధనం చేతికి అంది, రుణ విముక్తులు అవుతారు, ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు,
మిధునరాశివారు తమ కుటుంబం కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు, కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం, వారి క్షేమమే వీరి క్షేమం, తమ పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువులు, వారి ఎదుగుదల గురించి నిరంతరం తపన పడుతూ ఉంటారు, దానికోసం ఎంత కష్టపడటానికైనా, ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకాడరు, తమ సంతోషాలను, తమ కోరికలను కూడా పిల్లల కోసం వదులుకుంటారు,
తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు, వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారు, తల్లిదండ్రుల సేవలో, వారి ఆశీర్వాదాలను పొందడంలో ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటారు,
అయితే ఇంతటి ఓర్పు సహనం ఉన్న ఈ రాశివారు ఒకసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం, వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది, ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరమూ కాదు, వారిలోని మరో రూపం బయటపడుతుంది,
పాపం ఈ మిధునరాశివారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి, కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు, కానీ వీరికి మాత్రం కష్టాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి, ఒక సమస్య తీరింది అని ఊపిరి పీల్చుకునే లోపే, మరో సమస్య వచ్చి మీద పడుతుంది, జీవితం వీరికి ఎప్పుడూ ఒక యుద్ధంలాగే ఉంటుంది, నిరంతరం పోరాడుతూనే ఉండాలి,
ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి, దెబ్బలు తిని, మళ్ళీ సొంతంగా పైకి లేచినటువంటి వ్యక్తులు, వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి మంచితనం, వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే, ఈ మిధునరాశివారు పాట్యాపుస్తకాలలో నేర్చుకున్నటువంటి పాటాల కన్నా కూడా, వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాటాలే ఎక్కువ, నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిచిన సందర్భాలు వీరి జీవితంలో లెక్కలేనన్ని,
మీ గుండె వెన్నలాంటిది, చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది, చిన్న వయసునుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు, కొన్ని అయితే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు శూలాల్లా బలంగా తగీలాయి, ఆ గాయాల తాలూకు మచ్చలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి,
ఎంతగా అంటే, నలుగురిలో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడింది, మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగీల్లింది, ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని, నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదనపడతారు, ఆ ఒంటరితనం, ఆ నిస్సహాయత వీరిని మరింత కుంగదీస్తుంది, కానీ వీటన్నింటికీ ఇప్పుడు తెరపడబోతోంది,
వీళ్ళు ఎక్కువ శాతంగా దేవుడ్ని నమ్ముతారు, దేవుడ్ని స్మరించుకుంటూ ఉంటారు, కాబట్టే ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు, దేవుడు ఏది చేసినా మన మంచికోసమే చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తుంటారు, వీరికున్న ఈ భక్తే, ఈ నమ్మకమే వీరిని ఇన్ని కష్టాలలో కూడా నిలబెట్టింది, ఆ భగవంతుడే ఇప్పుడు వీరి చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు,
మిధునరాశివారికి చాలా తెలివితేటలు ఉంటాయి, ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే ఉంటారు, వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూనే ఉంటారు, అంటే ఇతరులయొక్క అవకాశాలను, అవసరాలను కూడా వీరు, వీరికి అనుగుణంగా మార్చుకుని లాభపడడంలో మంచి తెలివితేటలు కలిగీనవారుగా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు, వీరి బుద్ధిబలంతో సాధించలేనిది ఏదీ ఉండదు, ఇప్పటివరకు ఆ బుద్ధిబలాన్ని సరైన దిశలో ఉపయోగీంచుకోలేకపోయారు,
ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన ఆగష్టు నెల రాశి ఫలాల గురించి వివరంగా తెలుసుకుందాం, ఈ ఆగష్టు నెల మిధునరాశి జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది, ప్రతి క్షణం మీకు అనుకూలంగా మారబోతోంది, గ్రహాల సంచారం మీకు అద్భుతమైన యోగాలను తీసుకురాబోతోంది, మీ దశ తిరగబోతోంది, మీ తలరాత మారబోతోంది, ఈ నెలలో మీరు ఊహించని విజయాలను అందుకుంటారు,
ఈ ఆగష్టు నెల రోజుల పాటు మీ రాశ్యాధిపతి అయిన బుధుడు, వాక్కు, కుటుంబం, ధన స్థానమైన రెండవ ఇంట్లో సంచరించడం అనేది ఒక అద్భుతమైన యోగం, దీనితో పాటు, శుభ గ్రహాల అనుకూల సంచారంవల్ల ఈ నెల రోజుల పాటు జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగీపోతుంది, ముఖ్యంగా, దేవ గురువైన బృహస్పతి, మరియు భోగకారకుడైన శుక్రుడు మీ రాశిలోనే యుతి చెందడం అనేది శతాబ్దానికొకసారి వచ్చే గొప్ప రాజయోగం,
ఈ గురు-శుక్రుల కలయికవల్ల, అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది, మీరు ఏ పని పట్టినా అది బంగారమే అవుతుంది, ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభిస్తాయి,
ఎక్కడైనా పెట్టుబడులు పెడితే, అవి రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి, ఎప్పటినుండో రావలసిన సొమ్మును సులభంగా రాబట్టుకుంటారు, మొండి బకాయిలు కూడా వసూలవుతాయి, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి, మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది,
ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి, మీ పనితీరుకు ప్రారంభం అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి, ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఈ నెలలో మీకు లభించడం ఖాయం,
ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది, పని వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది, సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది, వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా బాగా అవకాశం ఉంది,
వృత్తి, వ్యాపారాల్లో రాబడి మీ అంచనాలను మించుతుంది, వ్యాపారాలు లాభాల బాట పడతాయి, కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు, వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం, ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి, ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో బంధుమిత్రుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది,
ఈ నెల మొత్తం మీరు శుభ వార్తలు ఎక్కువగా వింటారు, మొదటి శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది, ఊహించని ధనలాభం, లేదా ఆస్తి లాభం మీకు కలగబోతోంది, రెండవ శుభవార్త మీ కెరీర్ కు సంబంధించింది, నిరుద్యోగులకు చాలా మంచి ఆఫర్ తో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది, ఇక మూడవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించింది,
పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి, మీ మనసుకు నచ్చిన, మీకు తగీన జీవిత భాగస్వామి లభిస్తారు, వివాహ నిశ్చయం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవ కార్యాల మీద, పుణ్యక్షేత్రాల సందర్శన మీద భారీగా ఖర్చు చేస్తారు, ఈ ఖర్చు మీకు మానసిక ప్రశాంతతను, పుణ్యాన్ని ఇస్తుంది, కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం,
ఆస్తి వివాదాల్లో చిక్కుకున్న వారికి, ఈ నెలలో ఒక పరిష్కారం లభిస్తుంది, రాజీ మార్గాలను అనుసరించడం ద్వారా, మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది, సమాజంలో మీ పలుకుబడి బాగా పెరుగుతుంది, ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి,
ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి, నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది, విద్యార్థులు తాము ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు, పోటీ పరీక్షలలో విజయం సాధించి, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెస్తారు,
అయితే కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం, ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వడం, హామీలు ఉండటం మంచిది కాదు, డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి,
ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు, మీ ఆరోగ్యం, మీ సామాను రెండింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది,
వివాహ జీవితంలో ఈ నెల మీ భాగస్వామితో మీ అనుబంధం మునుపటి కంటే ఎంతో గాడంగా, బలంగా మారుతుంది, ఇద్దరి మధ్యా ఉన్న అపార్థాలు, మనస్పర్థలు తొలగీపోయి, ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు,
మీ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా సాగీపోతుంది, కానీ కొందరు అసూయపరులైన బంధుమిత్రులవల్ల ఇబ్బంది పడతారు, కుటుంబంలో కొద్దిగా బంధుమిత్రులవల్ల టెన్షన్లు ఉండే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది, అందరినీ గుడ్డిగా నమ్మవద్దు,
కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక రక్షణ కవచంగా మారతారు, వారి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి, వారి మద్దతుతో మీరు ఎలాంటి సమస్యనైనా దైర్యంగా ఎదుర్కోగలుగుతారు, ఈ నెలాఖరులో, మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందొచ్చు, వారి చదువులో, లేదా కెరీర్ లో వారు సాధించిన విజయాలు మీకు ఎంతో గర్వాన్ని, ఆనందాన్ని కలిగీస్తాయి,
ఈ నెల రెండో వారంలో మీకు హాని కలిగీంచాలని చూసే మీ ప్రత్యర్థులు, రహస్య సెత్రువులపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ విజయాలను చూసి ఓర్వలేని వారు, మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు, అయితే దైవానుగ్రహంవల్ల వారి ప్రయత్నాలు ఫలించవు, అయినప్పటికీ, మీరు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం, మీ వ్యక్తిగత విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకపోవడమే ఉత్తమం,
ప్రేమ సంబంధాలలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, మీ బంధంలో మూడో వ్యక్తి ప్రమేయంవల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది, మీ సంబంధంలో పూర్తిగా నిజాయితీగా ఉండండి, మీ భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకోండి, అప్పుడే మీ ప్రేమ బంధం బలంగా ఉంటుంది, లేనిచో, చిన్న చిన్న విషయాలకే బంధం తెగీపోయే ప్రమాదం ఉంది,
ఇక మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే, తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పటనం చేయడం లేదా వినడంవల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి, ప్రతి గురువారం నాడు శ్రీ మహావిష్ణువుకు లేదా సాయిబాబాకు పసుపు రంగు పువ్వులు సమర్పించి, సెనగలు నైవేద్యంగా పెట్టడంవల్ల గురు గ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది, దీనివల్ల మీ గ్నానం, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి,
మీ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి, ప్రతి బుధవారంనాడు శ్రీ గణపతి స్తోత్రం చదువుకోవడంవల్ల మీ జీవితం నల్లేరు మీద బండిలా సాగీపోతుంది, అన్ని విగ్నాలు తొలగీపోయి, మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు, గణపతికి గరిక సమర్పించడం, బెల్లంతో చేసిన ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది, అలాగే, ఆవులకు పచ్చగడ్డి తినిపించడంవల్ల బుధ గ్రహ దోషాలు తొలగీపోయి, మీ వాక్చాతుర్యం, మీ వ్యాపార దక్షత పెరుగుతాయి,
ఇక శుక్ర గ్రహ అనుగ్రహం కోసం, ప్రతి శుక్రవారంనాడు మహాలక్ష్మీ అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి, పూజించడంవల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు, పేదవారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు తీపి పదార్థాలు, బట్టలు దానం చేయడంవల్ల శుక్రుడు ప్రసన్నుడై, మీకు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు, ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధతో, భక్తితో ఆచరించడంవల్ల, ఆగష్టు నెలలో మీకు కలగబోయే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి,
