Loading...
loading

బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మకరరాశి వారికి పూర్తి జాతకం బయటపడింది, ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు

  • Home
  • Blog
  • బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మకరరాశి వారికి పూర్తి జాతకం బయటపడింది, ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు

బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మకరరాశి వారికి పూర్తి జాతకం బయటపడింది, ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు

జ్యోతిష్యశాస్త్రంప్రకారం మకరరాశి అనేది రాశిచక్రంలో పదవరాశి, ఉత్తరాషాడ నక్షత్రం రెండు,మూడు,నాలుగు పాదాలు, శ్రవణానక్షత్రం ఒకటి,రెండు,మూడు,నాలుగు పాదాలు, మరియు ధనిష్టానక్షత్రం ఒకటి,రెండు పాదాలలో జన్మించినవారు మకరరాశికి చెందుతారు.

మకరరాశి కాలపురుషునియొక్క కర్మ స్థానము, సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పుటినుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమౌతుంది, ఈ రాశివారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచనాపరులు, దానపరులై ఉంటారు.

ఈ మకరరాశివారిని చూస్తే ఎవరైనా లొంగీపోతారు, ఎందుకంటే వీరికి జింకపిల్లవంటి ఆకర్షణ ఉంటుంది, వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏపనైనా చేసి పెడతారు, ఈ మకరరాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ, అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు, కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు.

అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది, వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా, జీవితంలో స్థిరపడతారు, వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది.

మకరరాశికున్న ప్రత్యేకత ఏంటంటే ఆ వెంకటేశ్వరస్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణం, ఈ రాశిలోనే ఉంటుంది, ఈ రాశివారు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు, దాంతో వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు.

ఇతరులు మోసం చేయనంతవరకు ఇతరులను మోసం చేయాలి అన్న ఆలోచనకూడా ఈ రాశివారికి రాదు, వీరికి బంధుప్రీతి ఎక్కువ, నిత్యం బంధువులతో ఎక్కువ సమయం గడపాలని ఎవరైనా ఆపద లేదా సమస్యలో ఉన్నాము అని వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరు.

అంతేకాకుండా మకరరాశిలో పుట్టినవారు స్నేహితులపట్ల ఎంతో గొప్ప ప్రేమను పెంచుకుంటారు, వీరి బలమూ బలహీనతా కూడా ప్రేమే, పక్కవాళ్ళ మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా, అప్పుడప్పుడు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

దీనివల్ల కొన్నికొన్ని సందర్భాల్లో వీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తన లోపము తెలిసిన తర్వాత తన తప్పుని అంగీకరించడానికి మాత్రం వెనుకాడరు, చేసిన పొరపాటుని తిరిగీ చేయడానికి ఇష్టపడరు.

తనవల్ల తప్పు జరిగీతే, నా వల్ల తప్పు జరిగీంది, దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను, ఇలాంటి తప్పు మళ్లీ చేయనని క్షమాపణ అడగటానికి సిద్ధంగా ఉంటారు, అందరినీ ఒకే రకమైన భావనతో చూస్తారు, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసే లక్షణం, ఈ రాశిలో పుట్టిన వారికి ఉండదు.

ఈ రాశిలో పుట్టినవారు వీరిని ద్వేషించేవాళ్లనైనా సరే, ప్రేమించే వాళ్లతో సమానంగా చూస్తారు, ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత ప్రయోజనాలుకూడా దెబ్బతింటూ ఉంటాయి, సింపుల్ గా చెప్పాలంటే వీరిది సాత్వికమైన స్వభావం, మాటమీద నిలబడే తత్వం, వీరికి స్త్రీ సంతానంపట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది.

కూతురు అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు, నైతిక బాధ్యతలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లితండ్రుల చేతిని వదలరు, నమ్మినవాళ్ల కోసం వీరు అధికంగా శ్రమిస్తారు, చిన్నప్పటినుంచి అధికంగా శ్రమించడం ఏదైనా సాధించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేసి మోసపోవడం లేదా ఒడిదుడుకులు ఎదుర్కోవడంవల్ల వీరికి అనేక రంగాల్లో విపరీతమైన అనుభవం ఉంటుంది.

ఈ అనుభవంతో మధ్య వయసునుంచి చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు, వీరికి అపారమైన పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటాయి, అంతేకాదు మకరరాశిలో పుట్టినవారికి మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది.

వీరు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులై ఉంటారు, వీరికి సమానంగా వీరు చుట్టుపక్కల ఉన్నవారు పని చేయాలని ప్రయత్నం చేసినా వీరిని అందుకోలేరు, వీరి మేధస్సు ఆ స్థాయిలో ఉంటుంది, కులం,మతం,వర్గం అనే భేదం ఈ రాశిలో పుట్టినవారికి ఉండదు.

వీటికి అతీతంగా జీవిస్తూ ఉంటారు, ఈ రాశిలో పుట్టినవారికి వీరి జీవిత భాగస్వామివల్ల అదృష్టం కలిసొస్తుంది, చిన్నచిన్న కలహాలు,కోపాలు, ఇబ్బందులు జీవిత భాగస్వామితో వస్తున్నప్పటికీ అవి పెద్ద సమస్యగా మారవు, ఈ రాశిలో పుట్టిన చాలామందికి పిత్రార్జిత ఆస్తివల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి.

ప్రజాభిమానాన్ని ఎక్కువగా చూరగొనే అవకాశం ఉంటుంది, వీరి ఊహలు వీరి అంచనాలు ఎల్లవేళలా నిజమవుతాయి, సెని,శుక్ర, బుధదశలు ఈ రాశిలో పుట్టినవారికి బాగా కలిసొస్తాయి, ఎంత ప్రయత్నించినా ఇతరులకి మకరరాశిలో పుట్టినవారు పూర్తిగా అర్థంకారు, ఎంత ప్రయత్నించినాసరే, ఏదో అర్థం కాని ఒక అంశం ఇతరులకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

మకరరాశిలో పుట్టిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు, మకరరాశి ఆలోచన విధానం చాలా తార్కికంగా ఉంటుంది, వీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఆచరణాత్మకంగా ఉంటుంది, తెలివైనవారు ఈ రాశిలో పుట్టినవారు.

వీరు ఎల్లప్పుడూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తుంటారు, ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి, వీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు, మకరరాశివారికి స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎప్పుడు దేనిపైనా దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి, ఈ రాశి వారికి బాగా తెలుసు, ఈ రాశులవారికి చాలా మంది స్నేహితులుంటారు, స్నేహితులు ఎప్పుడు ఈ మకరరాశిలో పుట్టినవారికి బలమైన స్తంభాలుగా ఉంటారు.

మకరరాశిలో పుట్టినవారు స్వతంత్రంగా పనిచేయడానికి స్వతంత్రంగానే పైకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఇతరుల చేయూత లేకుండానే వీరి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు, ఈ రాశిలో పుట్టిన ప్రజలు నమ్మకంగా ఉంటారు, నిబద్ధత కలిగీ ఉంటారు.

మకరరాశిలో పుట్టినవారికి ఉన్నతస్థాయిలో చేరడానికి ఎక్కువగా కృషి చేయాలని బాగా తెలుసు, అందుకోసం కష్టపడి పనిచేస్తారు, క్రమశిక్షణతో మంచి సహనాన్ని కలిగీ ఉంటారు, అవసరమైనప్పుడు తమని తాము ముందుకు పెట్టుకునే సామర్థ్యంకూడా వీరికి బాగా ఉంటుంది.

వీరు ఎంతైతే నిబద్ధత, నిజాయితీ, ప్రేమ కలిగీ ఉంటారో, ఇతర వ్యక్తులనుంచి కూడా అంతే స్థాయిలో వాటిని ఆశిస్తారు, వీరికి ఉత్తమమైనది తప్ప మరేమీ అవసరం లేదు, ప్రతిదాంట్లోనూ బెస్ట్ కోరుకుంటారు, అది ఫ్రెండ్స్ అయినా, లైఫ్ పార్ట్‌నర్ అయిన, లేకపోతే కొలీగ్స్ అయినాసరే ఎదుటివారిలో అంకితభావం వీరికి బాగా నచ్చుతుంది.

ఒకసారి ఎవరైనా వీరికి నచ్చితే వారికి ఇచ్చిన స్నేహ హస్తాన్ని జీవితకాలం పట్టుకుంటారు, మకరరాశిలో పుట్టినవారు ప్రతి అంశాన్ని రహస్యంగా ఉంచుకుంటారు, ఎవరికీ ఏ విషయాన్ని చెప్పడానికి అంతగా ఇష్టపడరు, అది ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన, ఆర్థిక అంశాల అయిన సరే, ఎవ్వరికి చెప్పరు, చాలా గోప్యత పాటిస్తారు.

అంతే కాకుండా ఇతరుల్ని అవగాహన చేసుకునే క్వాలిటీ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ రాశిలో పుట్టినవారు మొండివారిగా చెప్పొచ్చు, ఏదైనా సరే పట్టుకున్నారంటే సాధించేవరకు వదిలిపెట్టరు, ఆలస్యం అనేది వీరికి నచ్చదు, ఒక్కసారి వీరి దృష్టి దేనిమీదైనా పడితే వారి మనసును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు.

ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవటం మకరరాశివారికి నచ్చని పని, భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది, మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు, అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు, చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, ఏదైనా పని ప్రారంభిస్తే, దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగీంచేస్తారు.

మకరరాశిలో జన్మించినవారికి గట్టి పట్టుదల,జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వంలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి, అందువలన వీరు జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది.

మకరరాశిలో జన్మించినవారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు, వీరికి 30 సంవత్సరాలవరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు, పేదరికాన్ని అనుభవిస్తారు, అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది, వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా, జీవితంలో స్థిరపడతారు, వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది.

చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటంవల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతుంటుంది, ఈ చంచల స్వభావంవల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు, అయితే కొన్ని ప్రత్యేక కారణాలవల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు, ఇక అప్పట్నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది.

మకరరాశికి అధిపతి సెనీశ్వరుడు ఈ రాశిలో పుట్టినవారు చాలా కష్టపడుతూ ఉంటారు, నిర్మలమైన మనస్సుతో ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు, ముక్కుసూటిగానే కాకుండా నిదానంగా కూడా ఉంటారు, మనసులో ఏదనుకుంటే అది బయటకు చెప్పేస్తూ ఇతరని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

అయితే వీరికి మనస్సులో ఒకటి బయట ఒకటి మాట్లాడటం చేతకాదు,నచ్చదుకూడా, ఎప్పుడూ నిజమే మాట్లాడతారు, అందుకే మకరరాశివారికి సెత్రువులు కూడా ఎక్కువ ఉంటారు, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

ఒకరకంగా చెప్పాలంటే మకరరాశిలో పుట్టినవారు పిసినారి అనొచ్చు, అయితే ఈ పిసినారితనంవల్ల వీరికి పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది, ఇది కష్ట సమయంలో వీరిని బాగా ఆదుకుంటుంది, వీరు ఎంతో శ్రమ పడితేకాని ఒక మంచి పొజిషన్ కి రాలేరు.

అందువల్ల చిన్న వయసులోనే, వీరికి మోకాళ్ల నొప్పులులాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆత్మాభిమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ మకరరాశిలో పుట్టినవారు, అంతేకాదు ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు.

మకరరాశికి చెందినవారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు, అయితే వారిని వాత, అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి, అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవటంవల్ల వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవు.

కుటుంబంలో సమాజంలో గౌరవాన్ని కోరుకుంటారు, ఒకవేళ మీరు కోరుకున్న గౌరవం దక్కకపోతే గొడవలకి కూడా దిగుతారు, ఇక మకరరాశిలో పుట్టినవారు ఏదైనా పని చేసేటప్పుడు ఏవైనా ఆటంకాలువస్తే ఇనుప వస్తువుని పారే నీటిలో వదలాలి అని చెబుతారు.

మకరరాశికి చెందినవారు తమ కుటుంబంపట్ల అత్యంత కటిన స్వభావులుగా ఉంటారు, అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తుంటారు, ఈ గుణంవల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా, వారి క్రమశిక్షణవల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది.

మకరరాశివారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం, వారి ఆలోచనలో నిరాశ తొంగీచూస్తుంటుంది, అదే సమయంలో ఏదైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు.

ఈ రాశివారు సెనివారంనాడు అట్లకాడ కానీ, పెనంవంటి ఇనుప వస్తువులుకానీ, దానం చేస్తే మంచి జరుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది.

అలాగే మకరరాశివారికి సెని,శుక్ర,బుధ దశలు యొగీస్తాయి, మకరరాశిలో జన్మించిన ఉత్తరాషాడ నక్షత్రంవారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణా నక్షత్రంవారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రంవారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి, ఇలా ధరించడంవల్ల మకరరాశివారు శుభఫలితాలు పొందుతారు.

మకరరాశికి చెందినవారికి నలుపు,నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి, ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది, అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు, నిండు బ్లూకలర్ వస్త్రాలను ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు, లేదా బ్లూకలర్ రుమాలును చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది.

మకరరాశికి చెందినవారికి 6,8 మరియు 9 అదృష్టసంఖ్యలు. మకరరాశివారి జాతకరీత్యా సెనిగ్రహా ప్రభావం వీరిపై ఉంటుంది, దీనికారణంగా వీరికి సెనివారం కలసివచ్చే రోజుగా ఉంటుంది, ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి, బుధవారంకుడా శుభదినమే అయితే గురువారం,మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి.

అలాగే మకరరాశిలో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రత్యేకమని చెప్పాలి, పట్టిన పట్టు వదలని అమ్మాయిలు మకరరాశిలో పుట్టిన అమ్మాయిలు, ఈ రాశిలో పుట్టి మంచి స్థాయిలో ఉన్న కొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారు.

తాము అడుగుపెట్టిన రంగంలో సాధించిన విజయాలు గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు ఎనర్జెటిక్‌గా ఉంటారు, ఆత్మవిశ్వాసంకూడా చాలా ఎక్కువ, మకరరాశికి సంబంధించిన అమ్మాయిలు సమర్థులు,కష్టపడతారు, మంచి విజయాన్ని కోరుకుంటారు,సాధిస్తారు.

మకరరాశికి సంబంధించిన వారు వారి పని చేస్తున్న ప్రదేశంలో బెస్ట్గా పేరు తెచ్చుకుంటారు, వీరికి జీవితంపై మంచి అవగాహన ఉంటుంది, ప్రేమలో కానీ వైవాహిక జీవితంలో కాని, ఉద్యోగ జీవితంలో కానీ ఎటువంటి వైఫల్యాలుచ్చినా సరే, మకరరాశి మహిళలు తట్టుకోలేరు, ఎందుకంటే వీరు బంధాలకి బాగా విలువిస్తారు, ఏదేమైనా మకరరాశిలో పుట్టిన మహిళలతో అంత ఈజీ కాదు, జాగ్రత్తగా ఉండాలి.

మకరరాశి స్త్రీలు తమ ప్రేమను ఎన్నుకునే విషయంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోరు, వీరు తమ ఇష్టాన్ని వ్యక్తం చేసే ముందు వారి మాటను నిలబెట్టుకుంటారా, అసలు అవి నిజమో కాదో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.

వారు తమ భాగస్వామిని ఎన్నుకోవడంలో చాలా కఠినంగా ఉంటారు, ఎటువంటి రిస్క్ తీసుకోరు, ప్రేమలో కూడా తమ భావాలతో కాకుండా ప్రాక్టికల్ విషయాలతో సహా దాని వెనుక గల కారణాలను పరిశీలించిన తర్వాతే అందులోకి ప్రవేశిస్తారు ఈ మకరరాశికి చెందిన స్త్రీలు.

మకరరాశి స్త్రీలను వివాహం చేసుకోవడంవల్ల అదృష్టము కలసి వస్తుంది, జీవిత భాగస్వామితో చిన్నచిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు, వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది, వీరు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు.

అలాగే ఈ మకరరాశివారికి నరదృష్టి, నరగోష ఎక్కువగా ఉంటుంది, నరగోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం లేక మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం.

అందరూ మనకి సెత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూఉండడం, ఏ పనికూడా విశేషంగా కలిసిరాకపోవడం, మీకు వందరూపాయలు రావలసినచోట పదిరూపాయలు మాత్రమే మీ చేతికి రావటం లేక మీ కష్టానికి తగీనటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీకూడా నరగోషకి మూలముగా చెప్పుకోవచ్చు.

ఈ నరగోష అనేటువంటిది దాదాపుగా ఈ మకరరాశివారి అందరికీ ఉంటుంది, ఎవరైనా పైన ఉదహరించినటువంటి భాదలు పడేవారు ఆంజనేయస్వామివారియొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మేడలో ఆంజనేయస్వామివారియొక్క లాకెట్ వేసుకోవాలి.

అదేవిధంగా ఏదైనా నరసింహస్వామివారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచం తెచ్చుకొని నాగాసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజూ పెట్టుకుంటూ ఉండాలి, అలాగే ఆంజనేయస్వామివారియొక్క సింధూరం ప్రతిరోజూ బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి.

అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి, మగవారైతేకనుక ఎరుపురంగు మొలతాడును నడుముకు ధరించండి, అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపుదారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ అరికాలుకు కాటుకబొట్టు పెడుతూఉండాలి, మగవారికి అయితే కుడివైపు అరికాలుకు కాటుక బొట్టు పెట్టాలి, కుంకుమబొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి.

ఈ విధంగా చేయటంవలన మీకున్నటువంటి ఈయొక్క నరగోష,నరపీడ అనేటటువంటివి తగ్గుముఖం పడుతుంది, అదేవిధంగా మనం బయట కిరాణా దుఖాణాల్లో స్పటిక అని ఒకటి దొరుకుతుంది, అది తెచ్చుకుని ఒక ఎరుపురంగు బట్టలో కొంచెం పసుపు,కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి, మీ ఇంటిగుమ్మానికి వేలాడదీయటంవలన నరగోష అనేది తగ్గుతుంది,

ఈ మకరరాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి, ఇలా దీపం వెలిగీంచి దేవుడిని ప్రార్థించడంవల్ల మీ కోరికలు త్వరగా నెరవేరతాయి, ఈ మకరరాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి, ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది, మెరిసే కాంతి దుష్టసెక్తులను దూరం చేస్తుంది, అలాగే తులసిముందు కూడా దీపం వెలిగీస్తే సకలశుభాలు కలుగుతాయి.

అలాగే మకరరాశివారు ఎప్పుడూకూడా గోమాతను ఆరాధించండి, ఎందుకంటే గోమాత అంటేగనక సకల దేవతా స్వరూపం, గోమాతను ఆరాధించడంవల్ల మీ జీవితంలో ఎన్నో శుభఫలితాలు అయితే మీరు పొందుతుంటారు, ఎందుకంటే సకలదేవతలయొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *