Loading...
loading

కుంభరాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే.. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది.

  • Home
  • Blog
  • కుంభరాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే.. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది.

కుంభరాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే.. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది.

కుంభరాశివారికి త్వరలోనే జరిగేది ఇదే. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది, ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది. ఆ విషయం ఏమిటో తెలిస్తే మీ కాళ్లు చేతులు వణికిపోతాయి. ఒంటరిగా చూడండి. కుంభరాశివాళ్ళకి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఇప్పటికే మీ మీద కరుణాకటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంట్లోకి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. ఎప్పటినుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ, మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టూ పక్కనే తిరుగుతుంది. ఇక డిసెంబర్ 31 తర్వాత మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి, ఇక మీకు గొప్ప అదృష్టాన్నీ మరింత భాగ్యాన్ని తెస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలు కన్నీళ్లు అనేవి ఉండవు. అన్ని శుభ ఘడియలే అని చెప్పేసికూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది. అయితే దైవశక్తి సైలెంట్ గా మీ జీవితంలోకి ప్రవేశించినపుడు, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం, మీకు జీవితంలో వచ్చిన ఆ హ్యాపీనెస్ అంటే సైలెంట్ గా తిరిగి కూడా వెళ్లిపోవచ్చు.

అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసిందని చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఇప్పుడు  మనం తెలుసుకుందాం.

కుంభరాశివారికి రాబోయే టైమ్ లో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కన తిరుగబోతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదయినా ఎటువంటి కష్టాలైనసరే, ప్రతి ఒక్కదానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకున్న కష్టాలన్నింటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఈ దైవశక్తి ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది.

మొదటి సంకేతం ఏమిటంటే, మీ మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికతవైపు మళ్లుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండుకూడా ఎక్కువ శాతం దేవుడువైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్లడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు, నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుందనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది.

అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే, మీకు నిద్రలో మెలకువ రావడం, మీకు నిద్రలో మెలుకువ ఎప్పుడైతే వస్తుందో, అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలుకువ అనేది వచ్చేస్తుంది. ఉదయం 3:00 నుంచి ఐదు గంటలలోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలుకువ అనేది వచ్చేస్తుంది. అలాగే మీకు బ్రహ్మ ముహూర్తంలో ఏ సమయానికి మెలకువ వస్తుందో కామెంట్ చేయండి. దానికితోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం, వేరే వారిగురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం, వేరేవాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్న, అన్యాయం జరుగుతున్న మీరు వాటిని అస్సలు సహించరు, మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా ఎలా మాట్లాడతారు. దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం ఐతే లేదుకదా, అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువశాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్ గా ఉన్నవాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్లరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉంటూ, ఆ దేవుడిని స్మరించుకుంటూ, ఆమె మీదగ్గర ఉంటే ఇంక ఏది అవసరంలేదన్న భావనని మీరు కలిగి ఉంటారు. ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక ఖర్చు అనేది ఉంటుంది, ఆ ఖర్చుకూడా మంచికై ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనాసరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది. ఆ సమయంలో ఏమాత్రంకూడా వెనకాడకుండా, మీ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంతైతే కెపాసిటీ ఉందో, దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ, ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడంకానీ, అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు సహాయం చేయండి, అది కూడా మీకు ఒక సంకేతమే. దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చుని, వాళ్లు మాట్లాడే అనవసరమైన మాటలుమీద మీకు ఏ మాత్రంకూడా ఇంటరెస్ట్ అనేది ఉండదు. మీకు ఎంత సేపటికి సేవాభావన, అలాగే దేవుడిని స్మరించుకోవడం మంచి మాటలు వినడం, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి, మెడిటేషన్ చేసుకోవడం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి, మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బుమీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలని చెప్పి, తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నింటిమీద మోహం అనేది తీరిపోతుందో, మంచిరూట్ లో అనేది నడుస్తాడు. ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలు అన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి. దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని.

ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పటిదాక మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు. వాళ్ళతో కూడా సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి.

ఇక ఉద్యోగరంగంలో వచ్చేటప్పటికి, మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్స్ తీసుకోవాలని అనుకుంటున్నారో, దానికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. మీకు ప్రమోషన్ అనేవి ఉంటాయి, శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి చెబుతున్నాం కదా, ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదని అనుకుని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరుకుంటుంది.

అయితే ఆ దైవశక్తి ఏంటి, సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు, ఆ రూపం ఏంటి. ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ దైవశక్తి ఎవరో కాదు, సాక్షాత్తూ కాళి అమ్మవారే, మీ మీద దైవానుగ్రహం చూపించబోతుంది, ఆ భద్రకాళి మీ ఇంటికి రాబోతుంది. ఆ అమ్మవారు ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. అలాగే ఎటువంటి శత్రువుకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీ ముందు ఉంటుంది. అయితే ఈ కాళిక అమ్మవారి మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారని అంటే, ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ ని మనం బ్రహ్మస్థానం అని చెబుతూ ఉంటాం కదా, ఆ బ్రహ్మ స్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మ స్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్తా చెదారం, డస్ట్బిన్ లాంటివి ఉంచుకోకూడదు. అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటంటే గుమ్మంముందే చెప్పులు అనేవి వదిలేస్తుంటారు. అలా గుమ్మంముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మ స్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు, కుంకుమలతో మీ గుమ్మాన్నీ అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మందగ్గర దీపాలను వెలిగించి, ధూపం వేయాలి. అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసిచెట్టుని పెట్టి పూజించండి. మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే, సాక్షాత్తూ కాళి అమ్మవారి కటాక్షం, మీ మీద కలుగుతుంది. మేము చెప్పిన ఈ సంకేతాన్ని మీరు కనుక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే అర్థం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *