S అక్షరంతో పేరు మొదలయ్యేవారికీ 2025లో జరిగేది ఇదే, S అనే అక్షరం కలవారు ఎలాంటి గుణాలు కలిగి ఉంటారు. అదేవిధంగా వీరుయొక్క జీవితం ఏవిధంగా గడుస్తుంది, ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి మనిషియొక్క జీవితంలో వచ్చేటువంటి అన్ని మార్పులుకూడా వారియొక్క పుట్టిన టైమ్, డేట్, అదేవిధంగా రాశి,నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది. మరి యెస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒకే రాశి, ఒకే పుట్టినతేదీ మరియు ఒకే పేరు కలిగిన వారియొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి. ఇది జ్యోతిషశాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం. మనిషియొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కోపంవల్ల మొదట తన తెలివిని కోల్పోవడం జరుగుతుంది. తర్వాత తన నాలుకను అదుపుచేయలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అయితే యెస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారియొక్క ప్రవర్తనగురించి తెలుసుకోబోతున్నాం. మరి యస్ అనే అక్షరంతో మీకు తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే వారియొక్క స్వభావం మేము చెబుతున్నట్టువంటి లక్షణాలతో సరిపోలితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
యెస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్‌లో 19 వ అక్షరం, ఈ యెస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడుకూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు. ఎవరిని మోసం చేయాలనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. అంతే కాకుండా వీరు లాభనష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చెయ్యరు. ఎవరి పేరు అయితే యెస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటివారు ఎప్పుడు నిష్కల్మషమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. కానీ వీరి స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు. వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది.
S అక్షరంతో పేరు ఉన్నటువంటివారు త్వరగా అలగడం జరుగుతుంది, వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది. అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఎదుటివారు వీరితో వాదించినకూడా ఎదురు సమాధానం చెప్పినాకూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. వారితో వాదనకు దిగుతూ ఉంటారు. ఒక రకంగా ఈ యెస్ తో పేర్లు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్లతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు, వారితో కనుక గొడవ పడితే. అలాగే యెస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు భోలాతనం అంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి విధానంవల్ల కోపిష్టిలా కనపడుతూ ఉంటారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు. దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకే విషయంగురించి వందసార్లు మాట్లాడుకోవడం, ఆలోచించడంలాంటివి చెయ్యరు. అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు, వెంటనే తేల్చేసుకుంటారు. అలాగే వీళ్లతో తిరిగే వాళ్ళకంటే, వీళ్ళుతో స్నేహం చేసేవాళ్ళకి ఇది బాగా తెలుసు. ఏంటంటే యస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదు అని. అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు. వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే, వీళ్ళు క్షమించలేరు. అలాగే సహించరు కూడా, ఎవరైతే వీరిని మోసం చేస్తారో, వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు. ఏ విషయం అయినా సీక్రెట్‌గా ఉంచడం అనేది వీరికి అలవాటు.
ఈ S అక్షరం ఉన్నటువంటివారి బ్రెయిన్, కళ్లు, ముక్కు చెవులున్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది. వీరు ఒకేచోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు, కారణం వీరు అంతర్ముఖులు. ఈ యెస్ అక్షరం గలవారు వీరుయొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికికానీ ఎవరితోనూ పంచుకోవడానికికానీ అస్సలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు. వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు, కానీ వీరు స్పీడ్ లేదా మొండి స్వభావం, వీళ్ళని చెడ్డ వారిగా చేయడం జరుగుతుంది. వీరు వీరియొక్క భవిష్యత్తుగురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నాకూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు. యజమానికి నమ్మకపాత్రులుగా ఉంటారు. వీరుయొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు. జీవితంలో తమగురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. తమయొక్క భావాలను ఎప్పుడుకూడా ఎదుటివారికి వ్యక్తపరచరు. అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ. వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడ నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు, జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు. ఎప్పుడు కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. చాలాచాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు. వీరికి కావాల్సిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిగించికోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు పని చేయాలనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటారు. శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్ట జీవులుగా ఉండటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమనే నమ్ముకుని ప్రతి విషయంలోనూ విజయం సాధించటం వీరి ప్రత్యేకత. తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీ గా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినవారిగా ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు. వీరు ముందంజకు వెళ్లడం కోసం ఎంత శ్రమించిడానికైనా అస్సలు ఆలోచించరు. కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీదైనా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్క చేయరు. అలాంటి వారిని వీరి జీవితంలోనుంచి తీసేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యెస్ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు. వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోడానికి అస్సలు ఇష్టపడరు. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో, ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. యెస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారి కుటుంబంపట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు. వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. అలాగే ఇతరులు కూడా తమవల్ల బాధపడ కూడదని చెప్పి, అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప, ఇతరుల జీవితాలను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు.
యెస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా, దేహదారుడ్యం కలిగినవారిగా, అందం కలిగిన వారిగా, మనసు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు. దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివ్వరు. చూశారు కదా యెస్ అక్షరం కలవారు ఏవిధంగా ఉంటారో, అలాగే వారియొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది, వారు యొక్క శరీర ధారుడ్యం ఎలా ఉంటుంది. అలాగే వీరి ఆలోచనా విధానం ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకున్నారు కదా
